ధాతృత్వమునమూనా

ధాతృత్వము

14 యొక్క 3

దేవుని రాజ్యంలో ధ్రాతృత్వము      

"ఇది మొదలుకొని మితిలేకుండ దానికి వృద్ధియు, క్షేమమును కలుగునట్లు సర్వకాలము దావీదు సింహాసనమును రాజ్యమును నియమించును, న్యాయము వలనను, నీతివలనను రాజ్యమును స్థిరపరచుటకు అతడు సింహాసనాసీనుడై రాజ్యపరిపాలన చేయును. సైన్యములకధిపతియగు యెహోవా ఆసక్తి కలిగి దీనిని నెరవేర్చును." - యెషయా 9:7 

'దేవుని రాజ్యము' అనునది యేసుక్రీస్తుప్రకటించిన సువార్త సందేశములో ప్రాముఖ్యమైనది. ఆయన తీసుకొని వచ్చిన సువార్త సందేశము ఏమంటే దేవుని రాజ్యము వచ్చియున్నది. దురదృష్టవశాత్తు ఈ రోజు సువార్త సందేశంలో సువార్త అనేది మన పాపములనుండి రక్షింపబడడము, మనము చనిపోయినప్పుడు పరలోకానికి వెళ్లగలము అనే దానికి పరిమితి అయి ఉంది. అది అసంపూర్ణమైన సువార్త. సువార్తను దానిమొత్తంగా చూస్తే దేవుని రాజ్యంలో పాలిభాగస్థులమై ఇప్పుడు, ఇక్కడ మనము జీవించియున్నపుడు  

యెషయా 9:7 దేవుని రాజ్యాన్ని వివరిస్తుంది. ఇది ఏమి చూప్పుతుంద్నటే దేవుని రాజ్యము నీతి, న్యాములతో కూడుకొనినది. యేసు ప్రభువు ఈ భూమిపై యున్న కాలములో, జనులు చాలా అన్యాయాలకు గురయిన సమాజములో జీవించారు. 50% లేదా దాని కంటే కొంచెం ఎక్కువ మందే బానిసలుగా జీవించారు. మరొక 25% కూలీ చేసుకొని బ్రతికేవారు. ఈ 75% జనులు ప్రభుత్వ విషయాలలో నోరెత్తడానికి వీలు లేదు, వారు దేనికీ లెక్కబెట్టబడే వారు కాదు. ఇటువంటి జనులక న్యాయవంతమైన దేవుని రాజ్యము ప్రారంభమౌతుందని చాటి చెప్పాడు. దానిలో అందరూ సమానం గాను, గౌరవంతోను చూడబడ్తారు. 

ఈ రాజ్యము ఎక్కడ ఉంది? మనము దానిని ఎక్కడ కనుక్కొనగలము? సార్వత్రిక సంఘము ఈ దేవుని రాజ్యము యొక్క భౌతిక రూపమున చూపునాదైయుంది ఇది నీతి, న్యాయములు గల సమాజముగా ఉండవసిందైయున్నది దేవుడు మనకొరకు ఏది ఆశిస్తున్నాడో, ఆ నిజమైన ప్రేమ, అంగీకారము గల సమాజముగా ఉండవసిందైయున్నది.

125 A.D లో ఒక క్రైస్తవ వేదాంతి అరిస్టెడస్ సార్వత్రిక సంఘములో చూచిన దేవుని రాజ్యాన్ని చిత్రకరిస్తాడు.   

" దేవుని రాజ్యములోనివారు సాత్వికంగాను, దయలోను నడుస్తారు. వారిలో అబద్ధము కనిపించదు. వారు ఒకరినొకరు ప్రేమించుకొంటారు. వారు విధవరాలిని తృణీకరించరు, అనాథలను దుఃఖపెట్టరు. ఉన్నవారు తమకున్నదానిని లేనివారితో పంచుకొంటారు. వారిలోకి ఎవరైన క్రొత్తవారు లేదా అపరిచితులు వస్తే వాళ్ళ కప్పు క్రిందికి తీసుకొని వారితో ఆనందిస్తారు, వారు తమ స్వంత కుటుంబిస్తులైనట్టు. వారిని వారు సహోదరులని సహోదరిణులని సహోదరినులని పిలిచుకొంటారు. శారీరకంగా కాదు కాని ఆత్మీయంగా దేవునియుందు ఆ భావన కలిగి ఉంటారు. వారిలోని పేదవాడొకడు చనిపోతే, వీరిలో ఎవరైన అతనిని చూస్తే తన సామర్ధ్యం కొలది భూస్థాపన కార్యక్రమాలు జరిపిస్తారు. వారిలో కొంతమంది చెరసాలలో ఉంటే లేదా వారి మెస్సయ్యా కొరకు ఏదైనా వత్తిడిని అనుభవిస్తే, అతని అవసరాల నిమిత్తమై ఇవ్వగలిగింది ఇస్తారు. ఒకవేళ ఆ వ్యక్తి విడుదల చేయబడడానికి అవకాశముంటే విడుదల చేయిస్తారు. వారి మధ్యలో ఒక పేదవాడు ఉంటే లేదా అవసరతలో ఉన్నవాడు ఉంటే, వారు అతని కొరకు రెండు లేక మూడు దినముల ఉపవాసముండి, వారి అవసరతలను తీరుస్తారు. 

"Poverty and riches in the early church" అను పుస్తకంలో నుండి, (అది మార్టిన్ హేంగల్ అనే రచయిత వ్రాసిన పుస్తకంలో 42వ పేజీ లో నుండి) తీసుకొనబడింది. 

మీతో సంబంధం లోకి వచ్చిన వారు దేవుని రాజ్యాన్ని అనుభవిస్తారా?      


వాక్యము

Day 2Day 4

ఈ ప్రణాళిక గురించి

ధాతృత్వము

ధాతృత్వము ధనముకు సంబందించినది అనే సాధారణ అవగాహనకు బయట ఆలోచిస్తే, మన సంబంధాలలోను, సంఘములోను మరియు అనుదిన జీవితములోను ధాతృత్వము కనపరుచుట అవసరము అని గ్రహిస్తాము. మరొక మాటలో చెప్పాలంటే, ధాతృత్వము మన జీవన శైలి అయి ఉండాలి అనియు మరియు మనము పొందిన సువార్తకు ఇది స్పందన అనియు నమ్ముతాము. క్రైస్తవులుగా, భారత దేశములో అత్యంత ధాతృత్వము కలిగిన సమాజముగా మనము ఉండాలి

More

ఈ ప్లాన్ అందించినందుకు మేము ఫ్లాట్ ఫిష్‌కి కృతజ్ఞతలు తెలుపుతున్నాము. మరింత సమాచారం కోసం, దయచేసి సందర్శించండి: https://courageousmagazine.com/