ధాతృత్వమునమూనా

ధ్రాతృత్వము మరియు సువార్త
"భూములైనను, ఇండ్లయినను కలిగిన వారందరూ వాటిని అమ్మి, అమ్మిన వాటి వెల తెచ్చి అపొస్తలుల పాదముల యొద్ద పెట్టుచూ వచ్చిరి." - అపొ. కా 4:34
లూకా లోని ఈ వాక్యభాగము నాజరీన్ మానిఫెస్టొ అని పిలువబడుతుంది. ఈ వ్యాఖ్యానము యేసు క్రీస్తు తన బాప్తిస్మము మరియు అరణ్యములో శోధింపబడిన సమయమైపోయిన తరువాత ఆయన పరిచర్య ఆరంభములో చేసాడు. నజరేతులోని సునగోగులో యీ వ్యాఖ్యానం చేయబడింది. అందుకే ఆ పేరు. యేసు తన పరిచర్యలో ఏమి చేయబోతున్నాడో దానిని ప్రకటించాడు.
చాల మంది యీ వాక్యభాగమును ఆత్మ విషయమై దీనులైన వారి కొరకు అనుకుంటారు. మరియు ఆత్మీయంగా గ్రుడ్డి అయిన వారి కొరకు అనుకుంటారు. అయితే లూకా 4 మరియు 5 ఆధ్యాయలోని తరువాతి వచనాలు యేసు యీ వాక్యాలను అక్షరార్ధంగా చెప్పాడు అని అంటారు. లూకా 4:31-37 లో యేసుప్రభువు ఒక అపవిత్రాత్మను వెళ్ళగొట్టాడు. లూకా 4:42-44 లో పేతురు అత్తను స్వస్థపరుస్తాడు. లూకా 4: 40-41, అపవిత్రాత్మలను వెళ్లగొట్టడం, స్వస్థపరచడము చూస్తాము. లూకా 4:42-44 లో సువార్తను ప్రకటించడము చూస్తాము. లూకా 5:1-11 లో పేతురును చేపలు పట్టే విషయములో నడిపిస్తాడు. లూకా 5: 12-16 లో కుష్ఠురోగిని స్వస్థపరుస్తాడు. లూకా 5: 17-26 లో పాపాన్ని క్షమించడం, స్వస్థపరచడము చూస్తాము. మరియు లూకా 5: 30-39 లో ఆయన బోధను చూస్తాము. ఆ విధంగా యేసు అన్ని రకాలైన విషయాలను ప్రస్తావించడము చూస్తాము. ఆత్మీయంగా, భౌతికంగా, భావోద్రేక పరంగా మరియు మానసికంగా.
అదే విధంగా మత్తయి 11: 1-5 లో యోహను శిషులు, యేసు వద్దకు వచ్చి, ఆయన మెస్సయా అయి ఉన్నాడా, ఇంకా ఎవరి కొరకైనా ఎదిరి చూడాలా అని అడగటానికి వచ్చినప్పుడు వారేమి చూస్తారో, ఏమి విన్నారో అది యోహానుతో చెప్పుమని యేసు చెప్తాడు. అనగా, గ్రుడ్డివారు చూస్తున్నారు. కుంటివారు నడుస్తున్నారు, కుష్టురోగులు బాగవుతున్నారు, చెవిటివారు వింటున్నారు, చనిపోయినవారు లేస్తున్నారు, బీదలకు సువార్త అందుతుంది అందరూ వారి సమస్యలకు భౌతికంగా చూడగలిగే ఫలితాలను పొందుతున్నారు. ఆ సమాచారమంతా తీసుకొనివెళ్ళి వారు యోహానుకు తెలియజేసారు. బీదల యొక్క సమస్యలకు భౌతికంగా చూడగలిగే ఫలితాలను పొందుతున్నారు. ఆ సమాచారమంతా తీసుకొని వెళ్లి వారు యోహానుకు తెలియజేసారు. బీదల యొక్క సమస్యలకు భౌతికంగా కనబడే పరిష్కారం ఇవ్వబడింది, కేవలము ఆత్మీయమైనదే కాకుండా. బీదలకు సువార్త అనేదే పరిష్కారమని 3 విధాలుగా చెప్పవచ్చు. మొదటిది, వారి దురలవాట్లను మానుకోవడానికి, నిధులను వ్యర్థం చేయకుండా ఉండడానికి సహాయ పడ్తుంది. రెండవది, వారు దేవుని వైపు తిరిగినప్పుడు వారేమి చేసినా ఆయన వారిని ఆశీర్వదిస్తాడు. అయితే కొంతమంది పేదరికము యొక్క చిక్కులలో పడినవారికి ఈ రెండు పరిష్కారాలు కూడా సరిపోవు. వారికి మూడవ విధానము అవసరమైయుంది. అదంటంటే యేసు ధనికుల యొక్క హృదయాలు మార్చి వారి ధనాన్ని బీదలతో పంచుకొనేలా చేస్తాడు.
అది మనము ఆది సంఘములో పాఠించడము చూస్తాము - అ. కా 4: 34,35 యీ సూత్రము గూడ క్రొత్త నిబంధన అంతా నొక్కి చెప్పడము జరిగింది - యోహాను 13:35, ఎఫెసీ 4: 28 మొదలగునవి. సువార్త మనుష్యులను ధ్రాతృత్వము గల వారినిగా చేస్తుంది.
మిమ్మల్ని తెలిసియుండడం ద్వారా ఎంతమంది ఆశీర్వదింపబడ్డారు?
వాక్యము
ఈ ప్రణాళిక గురించి

ధాతృత్వము ధనముకు సంబందించినది అనే సాధారణ అవగాహనకు బయట ఆలోచిస్తే, మన సంబంధాలలోను, సంఘములోను మరియు అనుదిన జీవితములోను ధాతృత్వము కనపరుచుట అవసరము అని గ్రహిస్తాము. మరొక మాటలో చెప్పాలంటే, ధాతృత్వము మన జీవన శైలి అయి ఉండాలి అనియు మరియు మనము పొందిన సువార్తకు ఇది స్పందన అనియు నమ్ముతాము. క్రైస్తవులుగా, భారత దేశములో అత్యంత ధాతృత్వము కలిగిన సమాజముగా మనము ఉండాలి
More
ఈ ప్లాన్ అందించినందుకు మేము ఫ్లాట్ ఫిష్‌కి కృతజ్ఞతలు తెలుపుతున్నాము. మరింత సమాచారం కోసం, దయచేసి సందర్శించండి: https://courageousmagazine.com/