ప్రణాళిక సమాచారం

ధాతృత్వమునమూనా

ధాతృత్వము

DAY 5 OF 14

ధ్రాతృత్వము గలిగిన గృహనిర్వాహకులు   


"లోకమును దాని పరిపూర్ణతయు నావే. నేను ఆకలిగొనినను నీతో చెప్పను" - కీర్తనలు 50: 12 


దేవుడు సర్వానికి స్వంతదారుడై యున్నాడు. అంటే మనము ఆయనకు ఏమియు ఇవ్వనవసరం లేదు (12. వచనము). అవన్నియు మొదట ఆయన స్వంతమైయున్నవి. ఇది మనము అర్ధము చేసుకోవాల్సిన విషయమై యున్నది. తరుచుగా ఆలయాలలో దశమ భాగమనిచ్చుటపై బోధలు జరుగుతాయి. అప్పుడు ప్రజలు ఏమనుకుంటారంటే వారి సంపాదనలో 90% వారి స్వంతం 10% శాతము దేవునిది అనుకుంటారు. డబ్బు మనది అన్నట్టు మనము చూస్తే దానితో మనకిష్టమైనది చేస్తాము. అది దేవునిదని మనము చూస్తే దేవుని నడిపింపు ప్రకారము దాన్ని వాడుతాము.  


ధ్రాతృత్వము గల వారిగా అవ్వాలంటే మొదటి మెట్టు సర్వము దేవునికి చెందినదని గుర్తించడము. మరియు మనము కేవలము మన చేతికి అప్పగింపబడినదానికి గృహనిర్వాహుకులమని తెలుసుకోవడం. మంచి గృహనిర్వాకులముగా మనకు అప్పగించిన నిధులను ఆయన ఉద్దేశ్యాలు నెరవేర్చడానికి వాడుతాము.    


దేవుని ఉద్దేశ్యాలు ఏమిటి? యేసు యీ విధంగా చెప్పాడు దేవుని నీతిని రాజ్యమును మొదట వెదుకుడి. దేవుని ఉద్దేశ్యము ఆయన రాజ్యాన్ని స్థాపించడం. మన చేతికి అప్పగింపబడిన నిధులను మనము ఈ ఉద్దేహ్యము నెరవేరుటకొరకు వాడుతాము.  


మన విషయమేమిటి? దేవుడు మన కుటుంబాల కొరకు మన కొరకు నిధులను ఇవ్వలేదా? అవును తప్పకుండాఇచ్చాడు ఎఫెసీ 4: 28 చదవండి. ఇక్కడ పౌలు ఏమంటాడంటే మనము మన పోషణ కొరకు సంపాదిస్తాము. మరియు ఇతరుల కివ్వడానికికూడ.    


ఈ బోధన యొక్క ఇంకొక కోణమేమిటంటే మనము దేవునికి ఇవ్వము. మనము చేసిదేమిటంటే మన చేతికి అప్పగింపబడిన నిధులను దేవుని రాజ్యము కొరకు వాడుతాము. ఇందులో ఏ గొప్పతనము లేదు. మనము ధ్రాతృత్వములో ఇచ్చినందుకు మనకు ఏ బహుమానము ఇవ్వబడదు. కొన్ని బోధలలో ఆలాగుంటుంది అయితే దానికి బదులు మంచి గృహ నిర్వాహకత్వమునకు బహుమానముంటుంది. మనము పెట్టిన పెట్టుబడులు దేవుని రాజ్యం కొరకు విస్తారమైన పంటను ఇస్తాయి.  


నీవు దేవునికంటే ఎక్కువ ఇవ్వలేవు అనే వ్యాఖ్యానము తప్పుడు అవగాహనను కలిగి ఉంది. దేవుని రాజ్యములో మనము పెట్టె పెట్టుబడులు విస్తారమైన పంటను ఇచ్చినప్పుడు మనలను దేవుడు తన రాజ్యము కొరకు పెట్టుబడులు పెట్టడానికి అనువైన స్థలముగా చూస్తాడు. అందుకని మనవైపు తన నిధులను పంపిస్తాడు. అది బహుమానము కాదు గాని, దేవుని వలన మనకు హెచ్చయింపబడిన భాద్యత ఇవ్వబడుతుంది. మనము బ్యాంకులో ఎక్కువ డబ్బు పెట్టినప్పుడు, మనము బ్యాంకుకు డబ్బు ఇవ్వడం లేదు గాని, ఎక్కువైనా భాధ్యతను ఇస్తున్నాము.  


దీనికి మరొక కోణము యీ ప్రశ్న. " ఇది దేవుని డబ్బు అయినప్పుడు నేను చనిపోయినప్పుడు ఇది ఎవరి ఆధ్వర్యములోనికి పోవాలి? స్పష్టంగా అందరకి అన్యయించే జవాబు యీ ప్రశ్నకు లేదు. అయితే వివిధ వ్యక్తులకు వివిధ రకాలైన జవాబులు ఉన్నాయి. అయితే అది నేరుగా మన పిల్లలకే చెందుతుందనేది మానమనుకోరాదు. లేదా మన బంధువలకని అనుకోరాదు. అయితే ఎక్కడైతే దేవుని రాజ్యము కొరకు మ్యాగ్షిమమ్ డివిడెండ్ ఉంటుందో అక్కడ పెట్టబడాలి.  


దేవుడు నీకిచ్చిన నిధులను నీవెలా చూస్తావు? 



వాక్యము

Day 4Day 6

About this Plan

ధాతృత్వము

ధాతృత్వము ధనముకు సంబందించినది అనే సాధారణ అవగాహనకు బయట ఆలోచిస్తే, మన సంబంధాలలోను, సంఘములోను మరియు అనుదిన జీవితములోను ధాతృత్వము కనపరుచుట అవసరము అని గ్రహిస్తాము. మరొక మాటలో చెప్పాలంటే, ధాతృత్వము మన జీవన శైలి అయి ఉండాలి అ...

More

ఈ ప్లాన్ అందించినందుకు మేము ఫ్లాట్ ఫిష్‌కి కృతజ్ఞతలు తెలుపుతున్నాము. మరింత సమాచారం కోసం, దయచేసి సందర్శించండి: https://courageousmagazine.com/

YouVersion uses cookies to personalize your experience. By using our website, you accept our use of cookies as described in our Privacy Policy