ప్రణాళిక సమాచారం

ధాతృత్వమునమూనా

ధాతృత్వము

DAY 6 OF 14

ధ్రాతృత్వముతో ఇచ్చుట   


"అక్కడికే మీ దహనబలులను, బలులను, మీ దశమ భాగములను ప్రతిష్టితములుగా మీరు చేయు నైవేద్యములను, మీ మ్రొక్కుబడి అర్పణములను, మీ స్వేచ్ఛార్పణములను, పశువులలోను గొర్రె మేకలలోను తొలిచూలు వాటిని తీసుకొని రావలెను."  - ద్వి. కా 12:6 


దేవునికి మనము ఎంత ఇవ్వాల్సిన అవసరము ఉంది? పాతనిబంధన కాలములో ఇశ్రాయేలీయులు దేవునికి ఇచ్చిన వివిధ బలులను యీ వచనము జాబితా చేస్తుంది. మొదటిది దహనబలి. ఏ వ్యక్తి అయితే ఆ బలిని ఇస్తున్నాడొ ఆ వ్యక్తి తన చేతిని ఆ పశువు తల మీద పెట్టాలి. అనగా ఆ వ్యక్తి స్థానంలో ఆ జంతువు బలిగా అర్పింపబడుతుందని అర్ధము. ఆ పశువు పూర్తిగా దహింపబడుతుంది. దాని అర్ధము ఆ వ్యక్తి తనను తాను దేవునికి యావేకి పూర్తిగా అర్పించుకున్నాడని. మనము దేవునికి ఇచ్చే విషయంలో మొదటి మెట్టు మెట్టుయుండాలి. ఆర్ధికంగా మనము దేవునికి ఇచ్చే విషయము ఆలోచించకముందు, దేవునికి మనము కావాలి, కాని మన డబ్బు కాదని గుర్తించాలి. మనము దేవుని సంపూర్ణముగా లోబరుచుకోవాలి.   


దాని తర్వాత వచ్చినది పాపపరిహార్ధబలి మరియు అపరాధపరిహారార్ధబలి. ఈ బలుల ఉద్దేశ్యము ఆ వ్యక్తి చేసిన పాపములకు అర్పణ చేయడం, యావేతో తన సంబంధాన్ని కాపాడుకొంటూ అనగా దహనబలిద్వారా కట్టబడిన సంబంధం. మనము దేవునికి ఇచ్చే దేనికన్నా, మనతో ఆయన సంబంధం ఆయనకు ప్రాముఖ్యమైనది.  


మొట్టమొదట ఒక వ్యక్తియొక్క సంబంధం దేవునితో సరిచేయబడినప్పుడే మిగితా బలులకు అర్ధముంటుంది. మనము దేవునితో సంబంధము కలిగియుంటే మనము ఆయనకు మన దశమభాగములను, ప్రత్యకమైన అర్పణలను, స్వేచ్ఛార్పణలను అర్పించగలము.   


కొంతమంది క్రొత్తనిబంధనలో దశమభాగము యొక్క పాత్రను ప్రశ్నిస్తారు. పట్టణ ఆర్ధిక పరిస్థులలోకూడా. అయితే కొండమీది ప్రసంగములో భోధింపబడిన విషయాలలో ఒక సూత్రము ఏమిటంటే ధర్మశాస్త్రములో చెప్పబడినదానికంటే ఇంకా నూతన నిబంధనలో ఎక్కువ చేయాలనే దేవుడు కోరుతున్నాడు. కాని తక్కువ చెయ్యడం కాదు. పాతనిబంధనలో జనులు ఇచ్చిన దశమభాగములు యాజకుల జీవనానికి సరిపోయేవి. అంతే కాకుండా, దేశములో ఉన్న పేదలకు కూడ ఇవ్వబడిదే. అయితే మనము కేవలము ఆలయములో ఇవ్వడం గాక అవసరతలో ఉన్నవారికి కూడా ఇవ్వాలి దశమభాగాలనేని మనకున్నదంతా దేవునిది అన్న విషయం గుర్తు చేస్తుంది, అంతే కాకుండా దేవుడు మనపై పెట్టిన పెట్టుబడికి తిరిగి దేవునికిచ్చే భాగంగా చూడబడుతుంది.   


దశమ భాగము ఇచ్చిన తరువాత, మనము స్వేచ్చార్పణములను, కృతజ్ఞతార్పణలను ఇచ్చి దేవుని పట్ల మన ప్రేమను వ్యక్తము చేస్తాము. ఇవి భావోద్రేకాలపై ఆధారపడిన అర్పణలు కాబట్టి మనమెంత ఇవ్వాలనేదానికి హద్దు ఏమి లేదు. మన దశమభాగము కాకుండా ఇంకా ఎక్కువగా ఇస్తే, అది దేవుని పట్ల మన ప్రేమను, మన కృతజ్ఞతను తెలుపుతుంది. మనము కేవలము దశమభాగమే ఇచ్చి, మన ఇవ్వడమును అక్కడే ఆపేస్తే, దేవుని పట్ల మనకు కృతజ్ఞత లేదని, ప్రేమ లేదని తెలుస్తుంది.   


ఈ వాక్యంలో ఉన్న జాబితా, పాత నిబంధనలో ప్రజలు దశమ భాగము కంటె ఇంకా ఎక్కువగా ఇచ్చారని యావేను సేవించారని చుపెడ్తుంది. వారు ఉదారమైన మనస్సుతో, దేవుని పట్ల ప్రేమతో ఇచ్చారని చూస్తాము.    


నీ ఇవ్వడము దేవునికి ఎంత ఉదారంగా ఉంది? 



వాక్యము

Day 5Day 7

About this Plan

ధాతృత్వము

ధాతృత్వము ధనముకు సంబందించినది అనే సాధారణ అవగాహనకు బయట ఆలోచిస్తే, మన సంబంధాలలోను, సంఘములోను మరియు అనుదిన జీవితములోను ధాతృత్వము కనపరుచుట అవసరము అని గ్రహిస్తాము. మరొక మాటలో చెప్పాలంటే, ధాతృత్వము మన జీవన శైలి అయి ఉండాలి అ...

More

ఈ ప్లాన్ అందించినందుకు మేము ఫ్లాట్ ఫిష్‌కి కృతజ్ఞతలు తెలుపుతున్నాము. మరింత సమాచారం కోసం, దయచేసి సందర్శించండి: https://courageousmagazine.com/

YouVersion uses cookies to personalize your experience. By using our website, you accept our use of cookies as described in our Privacy Policy