ధాతృత్వమునమూనా

క్షమాపణ
"మీరు మనుష్యుల అపరాధములను క్షమింపకపోయిన ఎలడ మీ తండ్రియు మీ అపరాధములను క్షయింపడు. - మత్తయి 6:15
మనము ఉండ వలసిన ప్రదేశాలలో ఒకటి ఇతరులను క్షమించడం. వారు మనకు ఏమి చేసారు అనే దానితో సంబంధం లేకుండా. ఈ రోజు చదువుకున్న వాక్యభాగంలో దేవుడు మన పెద్ద ఋణాన్ని తీర్చడాన్ని మనము గుర్తించాలి. మరియు మన చుట్టూ ఉండే వారిని మనము క్షమించడము ద్వారా దేవుని ఎడల మన కృతజ్ఞతను చూపవచ్చు. మనము గూడ పాపులమే అన్న మనలను గూర్చిన మన అవగాహన ఇతరులను క్షమించడానికి మనలను నడుపుతుంది.
ప్రభువు నేర్పించిన మత్తయి 6: 9-15 ప్రార్ధనలో, మన ఎడల తప్పు చేసిన వారిని మనము క్షమించకపోతే దేవుడు గూడ మనలను క్షమించాడనే వ్యాఖ్యానంతో ఆ ప్రార్ధనను ముగిస్తాడు మత్తయి. అయితే ఇతరులను క్షమించడం ద్వారా మన రక్షణను సంపాదించుకొంటామనే అర్ధం కూడా వస్తుంది. అయితే యేసు ఆ విధంగా బోధించడము లేదు ఇక్కడ. ఇక్కడ యేసు చెప్తున్నదేమిటంటే మనము దేవుని క్షమాపణను అనుభవిస్తే, ఇతరులను గూడ మనము క్షమిస్తాము. మనము ఇతరులను క్షమించలేకపోతే మన జీవితములో దేవుని క్షమాపణను అనుభవించలేదనవచ్చు.
యాకోబు 4 :1 - 2 ప్రకారము ప్రజలమధ్య ఎన్నో గొడవలు, పోట్లాటలు యీ లోక విషయాలపై జరుగుతాయి. ఉదా:- ఆస్తులు, పరపతి ,స్థాయి మొదలగు విషయాలలో మనము యీ ఇహలోక సంబంధమైన కోరికలన్నిటిని విడిచిపెట్టాము. కాబట్టి ఇతరులను క్షమించే విషయములో మనకు సమస్య రాకూడదు, యీ విషయాలలో వారు మనకు ఏ హాని చేసినా.
మనము ఇతరులను క్షమించలేక పోతే, మనలను మనము ఒక ప్రశ్న అడుగుకోవాలి. మనము నిజముగా క్రీస్తు సందించామా, ఆయన ఇచ్చిన క్షమాపణను అను బావించామా అని లేక ఒకవేళ మనము లోకముపై ప్రేమను ఇంకా కలిగి ఉన్నామేమో, అందుకని క్షమించడం కష్టమౌతుందేమో. ఇది చాలా విచారకరమైన పరిస్థితి, ఏమిటంటే మనము యేసు చేత క్షమించబడినాము. కానీ ఆ క్షమాపణ మన జీవితాలలో అనుభవంలో నిజం కావడం లేదు. ఏది ఏమైనా, మనము యేసు ఎదుట మన పంపాలని ఒప్పుకొని నిజమైన స్వస్థత కలుగనట్లు ఆయన వద్దకు రావాలి. న జీవితములో నాకున్న క్రమశిక్షణలలో ఒకటి ఇతరులతో నేనెక్కడ కోపము తెచ్చుకుంటాననో దానిని గుర్తించడము అది నేను యేసుకు వదిలిపెట్టాలి. అది ఒకవేళ నెమ్మదిగా, సమాధానంగా ఉన్న పరిస్థితి అల్లరి పిల్లలతో ఆటంక పరచబడితే దేవునితో నేనిలా చెప్తాను. " నేను సమాధానమును, ప్రశాంతతను ప్రేమిస్తున్నాను. అది అల్లరి చేసే వారితో నా సంబంధాన్ని భంగ పరుస్తుంది. నీ చేతిలోకి ఆ అవసరతను వదిలిపెడుతున్నాను. అది లేకుండా జీవించడానికి నాకు సహాయము చేయు".
మనము ప్రతిదానికి యేసునందు విశ్వసముంచితే, యిహలోక వాస్తువికత కొరకు మనము చింతించము. కాబట్టి వాటి విషయమై పోట్లాడాము.
నిన్ను బాధపరిచినవారినందరిని నీకు హాని చేసిన వారినందరినీ నీవు క్షమించావా?
వాక్యము
ఈ ప్రణాళిక గురించి

ధాతృత్వము ధనముకు సంబందించినది అనే సాధారణ అవగాహనకు బయట ఆలోచిస్తే, మన సంబంధాలలోను, సంఘములోను మరియు అనుదిన జీవితములోను ధాతృత్వము కనపరుచుట అవసరము అని గ్రహిస్తాము. మరొక మాటలో చెప్పాలంటే, ధాతృత్వము మన జీవన శైలి అయి ఉండాలి అనియు మరియు మనము పొందిన సువార్తకు ఇది స్పందన అనియు నమ్ముతాము. క్రైస్తవులుగా, భారత దేశములో అత్యంత ధాతృత్వము కలిగిన సమాజముగా మనము ఉండాలి
More
ఈ ప్లాన్ అందించినందుకు మేము ఫ్లాట్ ఫిష్‌కి కృతజ్ఞతలు తెలుపుతున్నాము. మరింత సమాచారం కోసం, దయచేసి సందర్శించండి: https://courageousmagazine.com/