ధాతృత్వమునమూనా
అవసరతలో ఉన్నవారికి ధాతృత్వము
"మీరు మీ పంట చేను కోయునప్పుడు నీ పొలము యొక్క ఓరలను పూర్తిగా కోయకూడదు. నీ కోతలో రాలిన పరిగెను ఏరుకొనకూడదు. బీదలకును, పరదేశులకును, వాటిని విడిచిపెట్టవలెను. నేను మీ దేవుడనైన యెహోవాను." - లేవీయకాండము 23:22
ధర్మశాస్త్రము పరిగనేరుకొనుట అనే విషయములో ఇశ్రాయేలీయులను నడిపించింది. కొంత పంటను పొలములో పేదల కొరకు వదిలివేయాలని. ఆ విధంగా బీదవారు ఆ సంవత్సరమంతా తినడానికి ఏమైనా కలిగియుంటారు. మొదట్లో అది వ్యర్ధమౌతుందని అనిపించవచ్చు. ఎందుకంటే అడవి జంతువులు తింటున్నాయా లేదా బీదవారు ఏరుకొంటున్నారా వారికి తెలియదు. ఇంకా ఆలోచిస్తే, ఎవరు పంటను ఏరుకుంటున్నారో తెలియదు. నిజంగా అవసరతలో నున్నవారా, లేదా పని చేయుటలో శ్రద్ధలేని వారు ఆ అవకాశాన్ని వాడుకొంటున్నారో తెలియదు. అది ఇక్కడ ఆలోచించే విషయము.
ఎవరైతే ఆస్తి ఉండి మంచి స్థితిని అనుభవిస్తున్నారో వారు దేవుడిచ్చిన బాధ్యతను కలిగియుంటున్నారు. అదేమిటంటే సమాజంలోని బీదలకు తినడానికి ఆహారముండేలా చూడడం. వారు యీ పద్ధతి వలన లాభపడుతున్నవారి గొప్పతనాలేమిటో చూడవలసిన అవసరము లేదు. అది వారు పొందే లాగ చూడాలి.
ఈ రోజుల్లో దానినెట్లా అన్యయించుకోవచ్చు? బాధ్యతరహితంగా ఇచ్చుటలో వారంటీ ఏమి లేనందున, ఆది సంఘము యీ పద్ధతిని నిరుత్సహపరిచింది. 2. థెస్స. 3: 10-12 వంటి వాక్యభాగాలలో మనము దాన్ని చూస్తాము. అయితే ఒక విషయం. ఎవరికైతే సంపాదించే కారకాలు ఉంటాయో, అవిలేని వారికి సహాపడవచ్చు ఎన్నో కారణాల వలన పని చేయలేని వారికి సహాయకరంగా ఉండవచ్చు. ఇది దేవుడిచ్చిన బాధ్యతే అయితే అది మనము తీవ్రంగా తీసుకోవాలి. మనము జీవించే, ఆరాధించే ప్రదేశాలలో ఇది అమలులో పెట్టబడేలాగా మన శాయశక్తులా ప్రయత్నించాలి.
మనము ఏ విశ్వసుల సమాజానికి చెందిన వరమో ఆ సమాజానికి యీ కట్టడాలు అన్వయించబడుతాయి. సమాజములోని వ్యక్తులకు మనము ఇచ్చినప్పుడు వారు ఆ సహాయం పొందటానికి అర్హుల అని పరీక్షించాలి. ఒక విషయం మనమవకాశమివ్వాలి ఏమిటంటే, వారిని పనిచేయుటకు ఆటంక పరిచే మానసిక దెబ్బ మనకు లేదని. మరీకష్టమైన పరిస్థితిలో లేరు. మరొక రకంగా చుస్తే, మనము బీదవారితో పనిచేసే జట్టులకు కూడా ఇస్తూ ఉంటాము. వారు పొందడానికి అర్హులా అని చూడము.
ఈ విదంగా చేయడం కొరకు, మనము పెట్టే పెట్టుబడిపై మనకు వచ్చే రాబడి, మన స్వంత లాభము కొరకు కాక, సమాజమంతటికీ పంచిపెట్టాలనే విషయాన్నీ మనము గుర్తించాలి. ఒకసారి మనమిది గుర్తించామంటే సమాజానికి తిరిగి ఎంత ఇవ్వాలనే విషయంపై న్యాయమైన నిర్ణయం చేస్తాము. ప్రపంచమంతటా ఉన్న CSR స్కీముల వెనుక ఇదే ఆలోచన ఉంది.
ఈ మధ్యకాలంలో వారి పేదతనంతో ఎవరికి మీరు సహాయం చేసారు?
వాక్యము
ఈ ప్రణాళిక గురించి
ధాతృత్వము ధనముకు సంబందించినది అనే సాధారణ అవగాహనకు బయట ఆలోచిస్తే, మన సంబంధాలలోను, సంఘములోను మరియు అనుదిన జీవితములోను ధాతృత్వము కనపరుచుట అవసరము అని గ్రహిస్తాము. మరొక మాటలో చెప్పాలంటే, ధాతృత్వము మన జీవన శైలి అయి ఉండాలి అనియు మరియు మనము పొందిన సువార్తకు ఇది స్పందన అనియు నమ్ముతాము. క్రైస్తవులుగా, భారత దేశములో అత్యంత ధాతృత్వము కలిగిన సమాజముగా మనము ఉండాలి
More
ఈ ప్లాన్ అందించినందుకు మేము ఫ్లాట్ ఫిష్‌కి కృతజ్ఞతలు తెలుపుతున్నాము. మరింత సమాచారం కోసం, దయచేసి సందర్శించండి: https://courageousmagazine.com/