ధాతృత్వమునమూనా

ధాతృత్వము

14 యొక్క 13

ధాతృత్వముతో పెట్టుబడి పెట్టుట   

"అప్పుడు ఐదు తలాంతులు తీసుకొనినవాడు మరి ఐదు తలాంతులు తెచ్చి అయ్యా నీవు నాకు ఐదు తలాంతులు అప్పగించితివే అవియు గాక మరి ఐదు తలాంతులు సంపాదించేతినని చెప్పను".  - మత్తయి 25:20  

తలాంతులను గూర్చిన ఉపమానము మనకు ఏమి బోధిస్తుందంటే, మనకివ్వబడిన వనరులు దేవుని రాజ్యము కొరకు మనము ఫలించే బాధ్యత కలిగియున్నాము. ఈ ఉపమాణములలో తలంటు అనేది డబ్బును గూర్చి మాట్లాడుతుంది. అయితే సమయము గతిస్తూ ఉండగా ఇంగ్లీషులో యీ పదము యొక్క అర్ధము సామర్ధ్యములు అను దానికి మారింది. అది ఆ ఉపమానమును తప్పుగా అర్ధం చేసుకోవడానికి దారి తీసింది.   

15. వ. వచనము ఏమి చెప్తుందంటే, డబ్బులు గాని, వనరులు గాని వారికి వారి సామర్ధ్యం కొలది ఇవ్వబడ్డవాని. తరచుగా జనులేమి చెప్తారంటే, దేవుని రాజ్యంలో సేవ చేయడానికి వారికి సామర్ధ్యం లేదని. అయితే యీ ఉపమానము ఒక విషయం బైలు పరుస్తుంది, ఏమిటంటే మనకు వనరులు ఉన్నాయని ఆ వనరులను మనము దేవుని రాజ్యములో పెట్టుబడిగా పెట్టవచ్చని. దేవుడు ఏదో ప్రత్యేకమైన గొప్ప వారలు గాని, టాలెంట్స్ గాని చూడడము లేదు. కాని దేవుని రాజ్యములో పెట్టుబడి పెట్టడానికి ఇష్టమైన మనస్సు ఉండాలని కోరుకొంటాడు.   

సహజంగా గొప్ప వరాలు ఉన్నవారు ఈ ఉపమానమును దేవుడి వారికిచ్చిన వరాలను ఉపియోగించాల్సిందిగా చెప్తున్నట్టు అర్ధం చేస్తారు. ఇది డబ్బు విషయం కాదన్నట్టుగా అంటారు. అది తప్పు.దేవుడు మనకిచ్చిన సామర్ధ్యాలను వరాలను మాత్రమే పెట్టుబడిగా పెట్టమని కోరడం లేదు గాని, ఆయన మనకిచ్చిన వనరులను గుడా పెట్టుబడిగా పెట్టాలని కోరుకుంటాడు.  

5 తలాంతులు గలిగిన వ్యక్తి పదితలాంతులు మరియు తనకు ఇవ్వబడిన మరియొక తలంతుతో పదకొండు తలాంతులు పొందుతాడు. ఇదేమని సూచిస్తుందంటే, మనకున్న పదార్థపు వరములను మనము దేవుని రాజ్యంలో ఉపయోగించడానికి ఇంకా అదునపు వారములనిస్తాడు.              

దేవుని రాజ్యంలో పెట్టుబడిగా పెట్టడమంటే ఏమిటి? దేవుని రాజ్యములో పెట్టుబడి పెట్టడమంటే మిషన్స్ కి ఇవ్వడం మాత్రం గాదు, కాని దేవుడు మనలను పెట్టిన స్థలములో ధాతృత్వము కలిగిన జీవితము జీవించడము. ధాతృత్వముపై పాతనిబంధన బోధను మనము అధ్యయనం చేస్తుండగా, మనమేమి చూస్తామంటే, చర్చిలోగాని, ఇంటివద్దగాని, మనము పనిచేసే స్థలములోగాని, మన చుట్టూ ఉన్నవారితో ధాతృత్వము కలిగి ఉండడము. యేసు దయకార్యాలు తండ్రియైన దేవుని కొరకు గొప్ప పంటను కోయునట్లు మనము దయ అనే విత్తనములను విత్తి దేవుని రాజ్యము కొరకు పంటను కోస్తాము.  

మనకు అప్పజెప్పిన వనరులకు గృహనిర్వాహకత్వము చేయుటయే మన జీవితానికి అర్ధము. భయముతో చేయబడినది కాదు. మన జీవితములో దేవుని సన్నిధి ఉందన సంతోషముతో నైజీరియాలో జానాతాన్ ఆనిగ్బిడే ఒక విషయాన్నీ చెప్తారేమిటంటే, ఒక తలాంతు ఉన్నవాడు దేవుడు అన్యాయంగా లెక్క తీసుకొనే ఒక యజమాని అని దేవున్ని తప్పుగా అర్థంచేసికొన్నాడు. అందుకని అతడు బయపడి తన బాధ్యతలను నిర్వర్తించలేదు. మనము దేవున్ని మన పట్ల శ్రద్ధతీసుకొనే తండ్రిగా మనము చుస్తే ఆయన మనలను నడిపించి, మనకు ఆయన సేవ చేయాలనే కోరిక ఉన్నందుకు, దానిలో ఆనందిస్తున్నాడని అర్ధం చేసికొంటే మనము స్వేచ్ఛగా వనరులను పెట్టుబడిగా పెడ్తాము. ఇంత వరకు చేసిన పెట్టుబడులతో పొరపాట్లు చేసినామని, దానికి శిక్ష ఏమి లేదని తెలిసికొంటే మను ధాతృత్వముతో జీవించడానికి ఇష్టపడతాము. 

దేవుని ద్వారా నీకు ఇవ్వబడిన వనరులను నీ స్వంత దీవెనెలుగా చూస్తావా, లేక దేవుని రాజ్యము కొరకు వాటిని ఉపియోగిస్తావా?  


వాక్యము

Day 12Day 14

ఈ ప్రణాళిక గురించి

ధాతృత్వము

ధాతృత్వము ధనముకు సంబందించినది అనే సాధారణ అవగాహనకు బయట ఆలోచిస్తే, మన సంబంధాలలోను, సంఘములోను మరియు అనుదిన జీవితములోను ధాతృత్వము కనపరుచుట అవసరము అని గ్రహిస్తాము. మరొక మాటలో చెప్పాలంటే, ధాతృత్వము మన జీవన శైలి అయి ఉండాలి అనియు మరియు మనము పొందిన సువార్తకు ఇది స్పందన అనియు నమ్ముతాము. క్రైస్తవులుగా, భారత దేశములో అత్యంత ధాతృత్వము కలిగిన సమాజముగా మనము ఉండాలి

More

ఈ ప్లాన్ అందించినందుకు మేము ఫ్లాట్ ఫిష్‌కి కృతజ్ఞతలు తెలుపుతున్నాము. మరింత సమాచారం కోసం, దయచేసి సందర్శించండి: https://courageousmagazine.com/