పశ్చాత్తాపపు క్రియలునమూనా

Acts of Repentance

5 యొక్క 4

మీరు ఎప్పుడైనా దారి తప్పిపోయారా? మీరు ఎటు వెళ్లాలో తెలియని భావము అనేకమైన నిరాశపరిచెడి అనుభవాల్లో ఒక అనుభవము కావచ్చు. నిజానికి, కొన్ని సందర్భాల్లో ఇది భయానకమైనది కావచ్చు. 25 వ వచనంలో పేతురు, మనం పాపంలో జీవిస్తున్నప్పుడు తప్పిపోయి ఎటు వెళ్లాలో తెలియని గొర్రెలతో మనలను పోలుస్తున్నాడు. ఎటు వెళ్లాలో మనకు తెలియదు, కానీ మన పాపముల కొరకు పశ్చాత్తాపడి, దేవుని క్షమాపణ పొందుకున్న తరువాత మనము దేవుడు కాపరిగా ఉన్నటువంటి మందకు తిరిగి వచ్చాము. ప్రతిసారి ఏ విషయములో నీవు దారి తప్పిపోతున్నావు? బహుశా మీరు దేవుని మార్గంలో ఉండడానికి కృషి చేస్తున్నారు, కాని మీ జీవితంలో ఒకానొక పాపం ద్వారా పదే పదే దారి తప్పి వేరొకదారులపైకి వెళ్ళుతున్నారు. దేవుని ముందు ఆ పాపమును ఒప్పుకోండి. ఈ దినమే పశ్చాత్తాపపడి, దాన్ని పూర్తిగా అధిగమించడంలో మీకు సహాయం చేయమని దేవుణ్ణి అడగండి.

వాక్యము

రోజు 3రోజు 5

ఈ ప్రణాళిక గురించి

Acts of Repentance

మన స్వంత రక్షకుడిగా క్రీస్తును తెలుసుకునేందుకు పశ్చాత్తాప పడడటం అనేది మనమందరము తీసుకునే కీలక చర్యల్లో ఒకటి. పశ్చాత్తాప పడడటం అనేది మన చర్య ఆయితే తన పరిపూర్ణ ప్రేమలో దేవుని నుండి మనకు లభించె ప్రతిచర్య క్షమాపణ. ఈ 5-రోజుల అధ్యయన ప్రణాళికలో, మీరు రోజువారీ బైబిల్ పఠనం మరియు ఒక దేవుని యొక్క సంక్షిప్త వాక్య ధ్యానమును అందుకుంటారు, క్రీస్తుతో మన నడకలో పశ్చాత్తాపం యొక్క ప్రాముఖ్యతను అర్థం చేసుకోవడానికి మీకు సహాయపడటానికి రూపొందించబడింది. మరింత సమాచారం కోసం, www.finds.life.church చూడండి

More

We would like to thank Life.Church for providing this plan. For more information, please visit: www.life.church