పశ్చాత్తాపపు క్రియలునమూనా
బత్షెబాతో తన అతిక్రమణ జరిగిన పిదప తన పాప విధానాన్ని బట్టి పశ్చాత్తాపం కోసం 51 వ కీర్తనలో దావీదు దేవునికి మొరపెట్టాడు. దావీదు, దేవుడిని తన పాపాలను కడగమని మోకాళ్లపై ఎలుగెత్తి దేవునికి మోర పెట్టుచున్నట్లుగా దాదాపుగా మీరు చిత్రించవచ్చు. ఈ కీర్తన మన జీవితాల్లో పశ్చాత్తాపం అనేది ఎలా ఉండాలి అనేదాని గురించి మనకు ఒక చిత్రాన్ని కూడా అందిస్తుంది. మొదటిది, దావీదు తన పాపమును గూర్చి ఒప్పుకున్నాడు. తరువాత, అతను క్షమాపణ కోసం అడిగాడు. అప్పుడు, దేవున్ని అతడు సరిదిద్దమని అడుగుతాడు. చివరగా, పాపములో పాలుపంచుకున్నవారికి, పశ్చాత్తాపం అవసరం ఉన్నవారికి నేర్పించటానికి తన పాపాన్ని వాడుకోవటానికి ఆయన దేవున్ని అడుగుతాడు. మీ జీవితంలో పశ్చాత్తాపం ఏ విధంగా కనిపిస్తుంది? పశ్చాత్తాపపడిన దావీదు యొక్క ఉదాహరణను అనుసరించటం ద్వార దేవునితో మీ సంబంధము ఏ విధంగా బలపడింది?
వాక్యము
ఈ ప్రణాళిక గురించి
మన స్వంత రక్షకుడిగా క్రీస్తును తెలుసుకునేందుకు పశ్చాత్తాప పడడటం అనేది మనమందరము తీసుకునే కీలక చర్యల్లో ఒకటి. పశ్చాత్తాప పడడటం అనేది మన చర్య ఆయితే తన పరిపూర్ణ ప్రేమలో దేవుని నుండి మనకు లభించె ప్రతిచర్య క్షమాపణ. ఈ 5-రోజుల అధ్యయన ప్రణాళికలో, మీరు రోజువారీ బైబిల్ పఠనం మరియు ఒక దేవుని యొక్క సంక్షిప్త వాక్య ధ్యానమును అందుకుంటారు, క్రీస్తుతో మన నడకలో పశ్చాత్తాపం యొక్క ప్రాముఖ్యతను అర్థం చేసుకోవడానికి మీకు సహాయపడటానికి రూపొందించబడింది. మరింత సమాచారం కోసం, www.finds.life.church చూడండి
More
We would like to thank Life.Church for providing this plan. For more information, please visit: www.life.church