ధృడముగా - లీసా బేవెర్ గారితోనమూనా
దేవుడు మీతో, “నువ్వు నా వజ్రము” అని చెప్తున్నాడు. మీకు మీరు వజ్రముగా ఇప్పుడప్పుడే అనిపించకపోయినా ఫర్వాలేదు; మీరు క్రీస్తు యొక్క నాశనం చేయబడలేని కార్యములో చుట్టబడ్డారు. దేవుడు మీపై ప్రకటిస్తున్న కొన్ని విషయాలను ఈ రోజు వినండి:
నీవు నా దృఢమైన మరియు పారదర్శకమైన వజ్రముగా ఉన్నావు - ప్రజలు నీ ద్వారా క్రీస్తును చూస్తారు.
మీరు నా వజ్రము - నిన్ను స్థిరంగా మరియు కదల్చబడబని వానిగా చేయడానికి క్రీస్తు యొక్క ఆత్మ నీలో నివసిస్తుంది.
మీరు నా వజ్రము - మీలో అగ్ని వంటి ఆత్మ ఉన్నది!
పరిశుద్ధాత్మతో మరియు అగ్నితో మనల్ని బాప్తిస్మం ఇవ్వడానికి యేసు వచ్చారు. ఇది మనందరమూ పొందవలసిన బాప్తిస్మం. మనం మారుమనస్సు నొంది తిరిగి జన్మించినప్పుడు, తాను చూపే శాశ్వత ప్రేమ యొక్క మండుతున్న తేజస్సుతో జీవములేని మన హృదయాలు పురికొల్పబడును.
మీరు ఆత్మతో నింపబడినప్పుడు ఎలా ఉంటారో మీకు తెలియదు. మీరు మామూలు మాటలు మాత్రమే మాట్లాడుతున్నారని మీరు అనుకుంటున్నారు, కాని మీరు అగ్ని వంటి మాటు మాట్లాడుతున్నారు! చాలా కాలం నుండి ప్రజలపై ఉన్న శత్రువు యొక్క అబద్ధాలను వేరుచేయగల వెలుగు మరియు సత్యంతో కూడిన విషయాలను మీరు మాట్లాడుతున్నారు. బందకాలను కరిగించే అగ్ని వంటి మాటలు మీరు మాట్లాడుతున్నారు. మీరు ఈ సత్యంలో నిలబడాలి.
మీ జీవితంలోని ఈ బహుమతి అగ్ని లాంటిది. దాన్ని ఆరిపోనివ్వద్దు. కణకణమండే బొగ్గుపై గాలిని ఊదుతూ దానిని భారీ మంటగా మార్చండి! మీలోనూ మరియు మీ వలన ప్రకాశవంతంగా వెలగడానికి ఇతరులకు కూడా ఆ అగ్ని అవసరం, ఎందుకంటే మీరు ఆయన బిడ్డ, ఆయన స్వభావంతో మీరు తిరిగి జన్మించారు.
నీవు ఎలా ఉన్నావనే దానిపై కాకుండా, ఎలా మార్పు నొందుతావనే విషయాన్ని దృష్టిలో ఉంచుకొని దేవుడు నీతో మాట్లాడతాడు. మీ జీవితం పట్ల ఆయన కలిగిన ప్రణాళికపై ఆయనకు పూర్ణ విశ్వాసం ఉంది. కావున దీన్నిబట్టి , నీ జీవితమును గురించి నీవు మాట్లాడటం మానేయవలసిన (లేదా ప్రారంభించాల్సిన) విషయాలు ఏమిటి?
మీరు ఈ పఠన ప్రణాళికను చదువుటలో ఆనందించినట్లయితే, Adamant: Finding Truth in a Universe of Opinions. అను నా క్రొత్త పుస్తకాన్ని చదువుట ద్వారా ఇంకా లోతుగా తెలుసుకొనగలరని నేను మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాను.
ఈ ప్రణాళిక గురించి
సత్యము అంటే ఏమిటి? సత్యము, కాలంతో పాటే మారుతూ ఉండే ఒక ప్రవహించే నది వంటిదనే అబద్ధాన్ని మన సంస్కృతి నమ్ముతుంది. కానీ సత్యము అనేది ఒక నది వంటిది కాదు కాని, అది స్థిరమైన ఒక బండ లాంటిది. అంతే కాకుండా, మహా సముద్రమంత భిన్నాభిప్రాయాలు కలిగి, దశా దిశా లేకుండా ఉన్న ఈ లోకంలో, మిమ్మల్ని ఒక స్పష్టమైన మార్గంలో నడిపిస్తూ, మీ ఆత్మ నడిపింపుకు ఒక లంగరు వలె ఈ ప్రణాళిక మీకు సహాయపడుతుంది.
More