ధృడముగా - లీసా బేవెర్ గారితోనమూనా
మనము ఎదుగుతూ ఉండగా, అంధకారము లేదా చెడు వలన తాకబడని వారు ఎవరూ ఉండరు. మనల్ని తీర్పు తీరుస్తూ, నిందిస్తున్న గొంతుకలను ఎంతో కొంత మనందరమూ వింటూనే వుంటాం. వాటిలో అన్నీ కాకపోయినప్పటికి, చాలామట్టుకు మనమీద మనమే నిందలు వేసుకున్నాం - మనపైన తప్పుడు గుర్తింపులు వేసుకుని అవి నిజమని నమ్ముతాం.
దేవుడు మన దగ్గరకు వచ్చినప్పుడు, అది మనల్ని ఖండించడానికి కాదు, మనము నిజంగా ఎవరు అనే సత్యాన్ని ఆయన తెలిపేటప్పుడు ఆయన స్వరాన్ని వినునట్లు మనల్ని ఆయనకు దగ్గరగా చేర్చుకుంటారు.
ఆ సత్యము ఏమనగా: మన గతం యొక్క అంధకారము మనము కాదు. మరియు, మన తప్పులు, మన లింగము లేదా ఇతర బాహ్య విషయాల ద్వారా మన వ్యక్తిత్వము నిర్వచించబడలేదు. దానికి బదులుగా, మనకు ఊపిరి పోసిన దేవునితో సాన్నిహిత్యం కలిగివుండుటకు దేవుని స్వరూపంలో మనము సృష్టించబడినవారము.
మన గుర్తింపును తప్పుడు విషయాలతో జతచేసి చూసినప్పుడు దానిపైన అసలైన దృష్టిని కోల్పోతాము. అందువల్లనే ఈ క్రమంలో మనం ఎంచుకున్న పరిమితం చేసే గుర్తింపులను మన జీవితాలనుండి దేవుడు తీసివేస్తాడు. పాత విషయాలను తీసివేసి, మన జీవితంలో మున్ముందు చూడవలసిన వాటిని వెలికితీస్తూ, దేవుని ఆత్మ మనలో లోతుగా పనిచేస్తుంది.
మీకున్న భయం మరియు అభద్రత అనేవి మీ జీవితంలో దేవుడు చేస్తున్న కార్యాన్ని తిరస్కరించడానికి కారణం కావచ్చు. కానీ ఈ రోజు, మీ జీవితమములలో మోడుబారిన ప్రదేశాలతో దేవుడు మాట్లాడుతున్నాడు, మరియు వాటిని మళ్ళీ ఫలప్రదమైన వనమువలె మార్చాలని ఆయన ఆశపడుతున్నాడు.
కానీ మన జీవితాల్లోని ఈ అంధకారము నుండి వెలుగును వేరు చేయడానికి దేవునికి అనుమతించటానికి మనం సిద్ధంగా ఉండాలి. మీపై పలుకబడిన అబద్ధాలను దేవుడు ఇకమీదట అనుమతించరు. మీరు మీ గురించి మాట్లాడిన తప్పుడు విషయాలను కూడా ఆయన ఖచ్చితమైన చివరి మాటగా వాటిని అనుమతించరు. వాటికి బదులుగా, ఆయన మీ దగ్గరికి వస్తారు, తద్వారా ఆయన మీలో ఉన్న ఒక నూతన విషయాన్ని సన్నిహితంగా వెల్లడిస్తారు, ఆ విషయం మీ అనుభవిస్తున్న ప్రతీ బాధనుండి స్వస్థతనిస్తుంది, మీరు నిజంగా ఎవరు అని ఆయన చెబుతున్నారో అలా జీవించేలా మీకు స్వేచ్చనిస్తుంది.
దేవుడు సాన్నిహిత్యంలో చాలా మొండిగా ఉంటారు. ఆయన మీ బాధల్ని నయం చేయడానికి ఆ గాయపడిన మనసు లోలోతుల్లోకి వెళతారు, కాని అలా చేయడానికి ఆయన్ని మీరు అనుమతించాలి. ఇలా చేయుట ద్వారా మీ జీవితము ఎలా మార్పు చెందును?
ఈ ప్రణాళిక గురించి
సత్యము అంటే ఏమిటి? సత్యము, కాలంతో పాటే మారుతూ ఉండే ఒక ప్రవహించే నది వంటిదనే అబద్ధాన్ని మన సంస్కృతి నమ్ముతుంది. కానీ సత్యము అనేది ఒక నది వంటిది కాదు కాని, అది స్థిరమైన ఒక బండ లాంటిది. అంతే కాకుండా, మహా సముద్రమంత భిన్నాభిప్రాయాలు కలిగి, దశా దిశా లేకుండా ఉన్న ఈ లోకంలో, మిమ్మల్ని ఒక స్పష్టమైన మార్గంలో నడిపిస్తూ, మీ ఆత్మ నడిపింపుకు ఒక లంగరు వలె ఈ ప్రణాళిక మీకు సహాయపడుతుంది.
More