ధృడముగా - లీసా బేవెర్ గారితోనమూనా
మీరు జనాదరణ పొందాలనుకుంటున్నారా. . . లేదా మీ జీవితం ప్రభావవంతంగా ఉండాలనుకుంటున్నారా?
జనాదరణ మరియు ప్రభావం ఒకేలా కనిపిస్తాయి, కానీ అవి చాలా భిన్నమైనవి. జనాదరణ కోసం మీరు ప్రజలను అనుసరించాలి లేదా వారు వినాలనుకుంటున్నది వారికి చెప్పాలి. కానీ ప్రభావవంతమైన జీవితం మిమ్మును అందరితో కలిసి గుంపులో కాకుండా సత్యం మీద నిలబడటానికి మిమ్మల్ని ఆహ్వానిస్తుంది.
లోతుగా గమనిస్తే, సత్యము ఏమైయున్నది అనేది కాదు కాని, అది ఎవరు లేక ఒక వ్యక్తిగా ఉన్నది, ఎందుకంటే యేసు తానే సత్యం అని చెప్పారు. దేవుని వాక్యం సత్యము అని కూడా యేసు చెప్పారు. ఈ లోకం సత్యాన్ని మారుతూవుండేదిగా, సంబంధితమైనదిగా భావించడాన్ని ఇష్టపడుతుంది, కాని యేసు క్రీస్తు అనే వ్యక్తిలో మరియు దేవుని వాక్యములో నాటబడినటువంటి సత్యము ఎప్పటికీ మారదు. భిన్నమైన అభిప్రాయాలతో నిండిన ఈ లోకములో, దేవుని సత్యము మన జీవితాలను నిర్మించగల నమ్మకముల వద్దకు మనల్ని నడిపిస్తుంది.
అభిప్రాయాలకు మరియు నమ్మకాలకు మధ్య వ్యత్యాసాన్ని గుర్తించడంలో మనము జాగ్రత్తగా ఉండాలి. అనేకమైన అభిప్రాయాల వలన కలిగే గందరగోళము మన లోకానికి అవసరం లేదు. ఈ లోకానికి సత్యము వలన కలిగే స్థిరత్వం అవసరం. దేవుని వాక్యము నుండి మరియు సత్యమైన ఆత్మ నుండి మన దృష్టిని మరల్చే ఏ విధమైన అల్లరికి మనం దోహదం పడవద్దు.
ఒక అభిప్రాయానికి రావడం మరియు వాటిని త్వరగా మార్చడం చాలా సులభం, కానీ అజాగ్రత్తతో మన చుట్టూ వాటిని వ్యాప్తి చేయుట ద్వారా ఏర్పడే నష్టమును తీసివేయడం చాలా కష్టం. అవి మన జీవితాలతో పాటూ ఇతరుల జీవితాలను కూడా అపవిత్రం చేసే మష్టు లాగా మారవచ్చును. మన చుట్టూ ఉన్న సమస్యలను మార్చడానిక అభిషేకించబడిన వారమై, ఆ సమస్యల పరిష్కారంలో మనము కూడా భాగమవ్వాలంటే, మనం పలికే ప్రతీ మాట జాగ్రత్తగా మాట్లాడాలి.
మీ జీవితాన్ని సవరించుకోవాలని మరియు మీరు మాట్లాడటానికి ఎంచుకునే పదాలను సవరించుకోవాలని నేను మిమ్మల్ని సవాలు చేస్తున్నాను. మీరు ఏమి చదువుతున్నారో, ఏమి వింటున్నారో, ఏమి చెబుతున్నారో లేదా పోస్ట్ చేస్తున్నారో జాగ్రత్తగా చూస్కోండి. మీ కుటుంబ సమస్యలను లేదా చర్చి సమస్యలను ప్రపంచం అంతా తెలిసేలా ప్రచారం చేయవద్దు. కానీ, అదే సమయంలో, వారి విషయంలో మౌనంగా ఉండకండి: కుటుంబ సమస్యల గురించి కుటుంబ సభ్యులతో మాట్లాడండి. ఎవరైనా ఆ సమస్యలో లేదా పరిష్కారంలో పాత్ర వహించనట్లయితే, అనవసరంగా వారిని అందులో చేర్చవద్దు. ఎందుకనగా అది సమస్యను పరిష్కరించకపోగా ఇంకా పెద్దదిగా చేస్తుంది.
ముఖ్యమైన సమస్యల గురించి నిశ్శబ్దంగా ఉండటం లేదా వాటిని ఆమోదించడం, ఈ రెండు ఒకటే ఎలా అవుతాయి? మీరు సమస్యలలో భాగం కాకుండా వాటి పరిష్కారంలో భాగమయ్యేందుకు మీ మాటలను సవరించుకోవడం గురించి మీరేమనుకుంటున్నారు?
ఈ ప్రణాళిక గురించి
సత్యము అంటే ఏమిటి? సత్యము, కాలంతో పాటే మారుతూ ఉండే ఒక ప్రవహించే నది వంటిదనే అబద్ధాన్ని మన సంస్కృతి నమ్ముతుంది. కానీ సత్యము అనేది ఒక నది వంటిది కాదు కాని, అది స్థిరమైన ఒక బండ లాంటిది. అంతే కాకుండా, మహా సముద్రమంత భిన్నాభిప్రాయాలు కలిగి, దశా దిశా లేకుండా ఉన్న ఈ లోకంలో, మిమ్మల్ని ఒక స్పష్టమైన మార్గంలో నడిపిస్తూ, మీ ఆత్మ నడిపింపుకు ఒక లంగరు వలె ఈ ప్రణాళిక మీకు సహాయపడుతుంది.
More