ధృడముగా - లీసా బేవెర్ గారితోనమూనా

Adamant With Lisa Bevere

6 యొక్క 3

మనము దేవుని ప్రేమను పొందుకున్నప్పుడు, మనము ప్రతిగా ప్రేమను ఇవ్వడం చాలా సహజమైన మరియు అవసరమైన ప్రతిస్పందనయై యున్నది. మనం నిర్భయంగా, విజయవంతంగా, నిరంతరము ప్రేమించాలి. తాము నిజంగా ప్రేమించబడ్డారని ఎరిగియున్నారన్న దానికి నిజమైన ఋజువు వారు బాగా ప్రేమించేవారుగా ఉంటారు.

దేవునిలో ప్రేమ లేదు; ఆయనే ప్రేమ. ప్రేమ ఆయన స్వభావం. దేవుడు ప్రేమయై యున్నాడు కాబట్టి, నిన్ను ప్రేమించకుండా మీరు ఆయన్ని ఆపలేరు. ఆయన ప్రేమ అజేయమైనది మరియు స్థిరమైనది, మీ జీవితంలోని ఆటుపోటుల వలన ఆ ప్రేమ కదిలించబడదు.

అయితే దేవుడు అందరినీ ప్రేమిస్తున్నాడు కాని, ఆయన ప్రతిదాన్ని ప్రేమిచలేడు. దేవుడు ఆ ప్రేమలో మొండిగా ఉన్నందున, ఆయన ద్వేషంలో కూడా మొండిగా ఉండాలి.

మొదట్లో మనకి ఈ రెండు విషయాలు వైరుధ్యంగా అనిపించవచ్చు, ఎందుకంటే మన సంస్కృతి ప్రేమను ఒక విగ్రహములాగా ఆరాధించినందున అలా అనిపిస్తంది. దేవుడు ప్రేమయై యున్నాడని మనకు తెలుసు కాని, ప్రేమను గురించిన మన ఆలోచననే ఒక దేవుడిగా మనం మార్చేసామా?

సత్యము ఏమిటంటే, ప్రేమను వ్యతిరేకించే వాటిని దేవుడు ద్వేషిస్తాడు. ఆయన ప్రేమించుదానిని చెరిపే వేటినైన ఆయన ద్వేషిస్తాడు. అందుకే మన గుర్తింపును వక్రీకరించే వాటిని దేవుడు ద్వేషించాలి.

వీటిని దేవుడు ద్వేషిస్తారని వాక్యము కూడా చెబుతుంది: న్యాయం మరియు సత్యం విషయంలో రాజీపడే ప్రతిదీ, విధవరాండ్రు మరియు అనాథలు అణచివేతకు గురైనప్పుడు, వృద్ధులను కుటుంబ నిర్లక్ష్యం చేసి వారిని బాధపెట్టినప్పుడు, ఆయన మంచితనాన్ని వక్రీకరిస్తూ మరియు ఆయన ఇచ్చిన తలాంతులను కళంకం చేసినప్పుడు, ప్రేమ వక్రీకృతమై స్వార్ధంగా మారినప్పుడు, స్నేహితులు శత్రువులుగా మారినప్పుడు, ఆయన స్వరూపాన్ని మార్చి మరియు మనలను వక్రీకరించేటప్పుడు, చెడుతనము మంచిగా పిలువబడినప్పుడు మరియు అమాయకులు చంపబడినప్పుడు మరియు అహంకారం మరియు గర్వము మనలను దిగజార్చినప్పుడు. సంక్షిప్తంగా, ప్రేమను క్షీణింపచేసే ప్రతిదీ మనలను క్షీణింపజేయును గనుక, ప్రేమను దిగజార్చువాటన్నిటిని దేవుడు ద్వేషిస్తాడు.

మనం “ప్రతిదాన్ని ప్రేమిస్తే” మనలో నిజమైన ప్రేమ ఉండదు. దేవుడు ప్రేమ మరియు ద్వేషం రెండింటిలోనూ మొండిగా ఉన్నాడు, కాబట్టి దేవుడు ప్రేమించేదాన్ని ప్రేమించడం మరియు ఆయన ద్వేషించేదాన్ని ద్వేషించడం నేర్చుకోవాలి.

మన సంస్కృతి ప్రేమను గురించిన ఆలోచననే ఒక దేవునిగా మార్చిన కొన్ని మార్గాలు ఏమిటి? దేవుడు అందరినీ ప్రేమిస్తాడు, కాని అతను ప్రతిదాన్ని ప్రేమించడు. మీ జీవితంలో ఈ సత్యము ఎటువంటి పాఠము నేర్పిస్తుంది?

రోజు 2రోజు 4

ఈ ప్రణాళిక గురించి

Adamant With Lisa Bevere

సత్యము అంటే ఏమిటి? సత్యము, కాలంతో పాటే మారుతూ ఉండే ఒక ప్రవహించే నది వంటిదనే అబద్ధాన్ని మన సంస్కృతి నమ్ముతుంది. కానీ సత్యము అనేది ఒక నది వంటిది కాదు కాని, అది స్థిరమైన ఒక బండ లాంటిది. అంతే కాకుండా, మహా సముద్రమంత భిన్నాభిప్రాయాలు కలిగి, దశా దిశా లేకుండా ఉన్న ఈ లోకంలో, మిమ్మల్ని ఒక స్పష్టమైన మార్గంలో నడిపిస్తూ, మీ ఆత్మ నడిపింపుకు ఒక లంగరు వలె ఈ ప్రణాళిక మీకు సహాయపడుతుంది.

More

ఈ ప్రణాళికను అందించిన జాన్ & లీసా బివేర్ గారికి మా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మరింత సమాచారం కొరకు, దయచేసి http://iamadamant.com/ సంప్రదించండి