ధృడముగా - లీసా బేవెర్ గారితోనమూనా
కొన్ని శతాబ్దాలుగా ప్రజలు అడామాస్ అనే ఒక ఒక పదార్ధం కోసం వెతికారు. ఈ నిగూఢమైన రాయి చాలా శక్తివంతమైనది, అయస్కాంతం వంటిది, చాలా ప్రకాశవంతమైనది మరియు నాశనం చేయబడలేనిది. దీనిని ఎప్పుడైనా కనుగొనగలిగితే, వారు అజేయంగా మారడానికి ఆయుధాలు మరియు కవచాలు తయారుచేసుకోవడం కోసం ఉపయోగించగలరని పాలకులు భావించేవారు. కొన్ని వందల సంవత్సరాలుగా, చాలామంది హీరోలు ఈ నిగూఢమైన రాయిని వెతుకుతూ అన్వేషణలకు వెళ్లారు.
ఈ ఆలోచన అంటే నాకు చాలా ఇష్టం. ఇటువంటి శక్తివంతమైన రాళ్ళ గురించి అన్వేషించడం వంటి విషయాలు ఎంతో ఆసక్తికరంగా ఉన్నప్పటికీ, ప్రస్తుత కాలంలో ఎవరూ ఇటువంటి అన్వేషణలు, శోధనలు చేయడంలేదు. ఇప్పుడు ఈ శోధనే మారిపోయింది. ప్రస్తుతం లోకం అటువంటి విలువైన ఖనిజం కోసం వెతకడం లేదు కాని, వారు మార్పులేని సత్యం కోసం వెతుకుతున్నారు.
మన జీవితంలో ఒక దృఢమైన, స్థిరమైనది ఏదో కావాలని కోరుకుంటాము. పొంతి పిలాతు కూడా యేసును, “సత్యము అంటే ఏమిటి?” అని అడిగాడు. చాలా మందికి, ఇది చాలా కష్టమైన ప్రశ్న- అంతే కాకుండా చాలా కాలం నుండి, మనము ఈ ప్రశ్నకు సమాధానం ఇవ్వకుండా దాటవేస్తూ ఉన్నాం.
జీవితానికి విలువైన సంభాషణలు, విలువైన సంబంధాలు మరియు సత్యమై యున్న దేవుని వాక్యంతో నిత్యమూ అనుసంధానం అవసరమున్న రోజుల్లో మనము జీవిస్తున్నాము. మన తరం, మనలో విస్మయం తొలగించబడిన తరం వంటిది, అంతే కాకుండా సత్యం అని పిలవబడే నదిలో విసిరివేయబడి, అటు ఇటు కొట్టుకుపోతూ, మనం వృథా ప్రయత్నాలతో మిగిలిపోయాము.
కానీ సత్యము అనేది నది వంటిది కాదు. అది ఒక కొండ లాంటిది.
ఈ గజిబిజి మరియు గందరగోళం మధ్య మనము యేసు వైపు తిరగాలి.ఆయనే మన కొండ, కదల్చబడలేని, మార్పులేని ఒక వజ్రము. మన జీవితాలను ఆయనపైనే కాకుండా, ఆయనలోను ఒక దృఢమైన పునాదిగా రూపొందించుకోవడానికి మనము ఆహ్వానించబడ్డాము. అస్థిరమైన రాళ్ళ వంటి పరిస్థితులతో నిండిన ఈ లోకానికి ఆయనే పునాదిరాయి వంటి వాడు.
మనం ఆయనను మన జీవితములో పునాదిరాయిగా చేసుకున్నప్పుడు, మన జీవితాలు కూడా దృఢంగా, ఆయనలా మారేలా ఆయన చేస్తారు. ఆయనే తలకు మూలరాయి, కాని మనం కూడా సజీవమైన రాళ్ళుగా, ఆయనతో కలిసి ఒక ఆధ్యాత్మిక గృహంగా నిర్మించబడతాము. ఎప్పటికప్పుడు మారుతున్న మన ప్రపంచము చేత శిథిలమైన జీవితములను అనుభవిస్తున్న వారందరికీ, ఆశ్రయమిచ్చే కేంద్రముగా ఈ గృహము పనిచేస్తుంది.
సత్యములో దృఢంగా నిలబడటానికి, ఇది క్రైస్తవులుగా మన పిలుపులో భాగమై యున్నది. ఇది మన కోసం మాత్రమే కాదు, తమ జీవితాలను నిర్మించుకోవడానికి వెతుకుతున్న వారందరి కోసం కూడా.
యేసు ఒక స్థిరమైన కొండ వంటి వాడనే దానిగురించి మీరు ఏమనుకుంటున్నారు? మీ జీవితములో ఏ ఏ ప్రదేశాలలో సత్యము ఒక ద్రవంగా అంటే ప్రభావం లేకుండా మారిపోయింది?
ఈ ప్రణాళిక గురించి
సత్యము అంటే ఏమిటి? సత్యము, కాలంతో పాటే మారుతూ ఉండే ఒక ప్రవహించే నది వంటిదనే అబద్ధాన్ని మన సంస్కృతి నమ్ముతుంది. కానీ సత్యము అనేది ఒక నది వంటిది కాదు కాని, అది స్థిరమైన ఒక బండ లాంటిది. అంతే కాకుండా, మహా సముద్రమంత భిన్నాభిప్రాయాలు కలిగి, దశా దిశా లేకుండా ఉన్న ఈ లోకంలో, మిమ్మల్ని ఒక స్పష్టమైన మార్గంలో నడిపిస్తూ, మీ ఆత్మ నడిపింపుకు ఒక లంగరు వలె ఈ ప్రణాళిక మీకు సహాయపడుతుంది.
More