ధృడముగా - లీసా బేవెర్ గారితోనమూనా
అవిశ్వాసుల పాపమును మరియు వారి ప్రవర్తనను ఖండించడంలో సంఘము తరచుగా ముందుంటుంది, అయితే దేవున్ని ఎరుగని వ్యక్తులు దేవుడు తెలియని విధంగా వ్యవహరించడంలో ఆశ్చర్యం లేదు. మొదటగా, మనం పరిశుద్ధమైన మరియు రూపాంతరం చెందిన జీవితాలను గడుపుతున్నామా అనే విషయం గురించి ఆలోచించుకోవాలి. మనము ప్రభువును ప్రతిరోజూ వెంబడిస్తుండగా, మన చుట్టూ ఉన్న వారు దేవునిలో మార్పు చెందున్నట్లు, వారికి ఆయన దయను తెలియజేయగల జ్ఞానము కొరకు ఆయనను వేడుకొనవచ్చును.
దేవుని పిల్లలైన మనం వజ్రం లాగా ధృడంగా ఉంటూనే వికసిస్తున్న మృదువైన పువ్వులాగా ఉండేట్లు మనము క్రీస్తులో పునర్నిర్మించబడ్డాము.
రోమీయులకు వ్రాసిన పత్రిక 1వ అధ్యాయములో పౌలు వ్రాసిన వాటిని నెరవేర్చుతున్న లోకములో మనం జీవిస్తున్నాము. కాబట్టి మనలో చాలా మంది దేవుని జ్ఞానమును మరియు ఆయన ఉనికిని విడిచిపెట్టాము మరియు మానవాళి కొరకై ఆయన కలిగిన ప్రాథమికమైన ఉద్దేశ్యాలను కూడా మనము ఏమాత్రము గుర్తించలేకపోతున్నాం.
కావున మిమ్మల్ని మీరే ప్రశ్నించుకోండి, ఈ చెడ్డ దినాలను బట్టి దుఃఖించడం వలన ఏదైనా మారిందా? దురదృష్టవశాత్తు, మనం వేటి నిమిత్తం గుర్తించబడవలేనో వాటివలె కాకుండా, వేటిని వ్యతిరేకిస్తున్నామో వాటివలె మనం గుర్తించబడుతున్నాం. మన సంస్కృతి, సంప్రదాయాలను తీర్పు తీర్చడం మరియు ఖండించడం ద్వారా మనం కోరుకునే పవిత్రత మరియు పరివర్తన రావు కాని, మొదట మన సొంత సమస్యలను పరిష్కరించుకుని, ఆపై అవసరము ఉన్నవారికి దేవుని దయను, కరుణను, విశ్వాసమును తెలియచేయడం ద్వారా ఆ మార్పు వచ్చును.
దేవుని దయ ఎల్లప్పుడూ పాపాన్ని ఆమోదించకుండా సత్యము వద్దకు తిరిగి రావాలని మనల్ని ఆహ్వానిస్తుంది. అందుకే మనకు జ్ఞానం అవసరం. ప్రజలు సిగ్గుపడకూడదని ఆశించి కొన్నిసార్లు పాపమును పాపం కాదని చెప్పడమే దయ అన్నట్లు కొన్నిసార్లు మనం వ్యవహరిస్తాము. ఏదేమైనా, పాపమును పాపముగా తెలియజెప్పుటకు మనం సిద్ధంగా ఉండాలి, అయినప్పటికీ అది ఖండించేవిధముగా కాకుండా నిరీక్షణను పెంపొందించేదిగా ఉండాలి.
మన సంస్కృతిలో పవిత్రత అంటే మన యొక్క సమస్తమును దేవునికి సమర్పించుకోవడంతో మొదలవుతుంది. మార్పు కోసం ఒక తరం ఎదురుచూస్తూ ఉంది, మరియు వారు మనలో ఆ మార్పు చూడటానికి వేచియున్నారు.
దేవుడు తన ప్రజలు తమ్మును తాము తగ్గించుకొని ప్రార్థించినప్పుడు వారి దేశమును స్వస్థపరుస్తానని చెప్పాడు కాని, ఆ దేశ ప్రభుత్వములో అంతా సంక్రమంగా ఉన్నప్పుడే చేస్తానని చెప్పలేదు. ఇది మీకు ఎలా వర్తిస్తుంది?
ఈ ప్రణాళిక గురించి
సత్యము అంటే ఏమిటి? సత్యము, కాలంతో పాటే మారుతూ ఉండే ఒక ప్రవహించే నది వంటిదనే అబద్ధాన్ని మన సంస్కృతి నమ్ముతుంది. కానీ సత్యము అనేది ఒక నది వంటిది కాదు కాని, అది స్థిరమైన ఒక బండ లాంటిది. అంతే కాకుండా, మహా సముద్రమంత భిన్నాభిప్రాయాలు కలిగి, దశా దిశా లేకుండా ఉన్న ఈ లోకంలో, మిమ్మల్ని ఒక స్పష్టమైన మార్గంలో నడిపిస్తూ, మీ ఆత్మ నడిపింపుకు ఒక లంగరు వలె ఈ ప్రణాళిక మీకు సహాయపడుతుంది.
More