బలం మరియు ధైర్యంతో జీవించండినమూనా
“ఆయన అన్నిటినీ మీ మంచి కోసం సమకూర్చుతాడు”
మీ జీవితంలోని అన్ని భాగాలలోని అన్ని విషయాల్లో దేవుడు స్వాధీనం కలిగి ఉన్నాడు. విశ్వాసులముగా మన మేలు కొరకు ఏ పరిస్థితినైనా సమకూర్చే సమర్ధత కలవాడు.
“దేవుని ప్రేమించువారికి, అనగా ఆయన సంకల్పముచొప్పున పిలువబడినవారికి, మేలుకలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని యెరుగుదుము.” రోమా 8:28
దేవుడు అత్యంత క్లిష్టమైన జీవిత సవాళ్లను కూడా సరిచేయగల శక్తిమంతుడు మరియు మన జీవితాల పట్ల ఆయన ప్రణాళికను నెరవేర్చుటకు మనలను తన మార్గంలో నడిపించగలడు. ఆవిధంగా చేయటానికి కేవలం మనం ఆయనను నమ్మాలని ఆయన కోరుతున్నాడు.
“నీ స్వబుద్ధిని ఆధారము చేసికొనక నీ పూర్ణహృదయముతో యెహోవాయందు నమ్మక ముంచుము నీ ప్రవర్తన అంతటియందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము అప్పుడు ఆయన నీ త్రోవలను సరాళము చేయును.” సామెతలు 3:5-6
దేవునిపై మన నమ్మిక ఉంచినంత మాత్రాన మన వ్యక్తిగత బాధ్యత మరియు మంచి గృహానిర్వాహకత్వం అవసరం లేదు అనుకోకూడదు. వ్యక్తిగత బాధ్యత మరియు ఆయన అయందు నమ్మిక కలిసి ఉంటాయి. మనం మన పని చేస్తే, దేవుడు ఆయన పని ఆయన చేసి మనలను ప్రభావవంతంగా నడిపిస్తాడు.
అనేక సందర్భాల్లో, మన పరిస్థితుల్లో “ద్వారాలను” మూయుట మరియు తెరచుట ద్వారా దేవుని నడిపింపు వస్తుంది. మరికొన్ని సార్లు, మన పరిస్థితుల్లో స్వస్థత కొరకు, అద్భుతం చేయటానికి, లేదా మనకు అసాధ్యమైన మరేదో మన సాధించగలగటానికి దేవుని చొరవ తప్ప మరేది పనికిరాదు.
“యేసు వారిని చూచి ఇది మనుష్యులకు అసాధ్యమే గాని దేవునికి సమస్తమును సాధ్యమని చెప్పెను.” మత్తయి 19:26
ఒక కుదరని రోగంతో బాధపడటం కావచ్చు, ఆర్ధిక ఇబ్బంది, లేదా అనుకోకుండా ప్రియులను కోల్పోవడం కావచ్చు, దేవుడు మనతో కూడా ఉండి ఈ సమయాల్లో కూడా అద్భుతంగా పనిచేయగలడు.
పరిశుద్ధాత్మ ద్వారా విచారాన్ని విజయంగా మరియు కష్టాన్ని ఆనందంగా మార్చుటలో దేవుడు ప్రసిద్ధుడు. దేవుడు నేడు కూడా “అద్భుతాలు చేసే పనిలో” ఉన్నాడన్న విషయాన్ని మీరు ఎన్నడూ అనుమానించవద్దు. దేవుడు ఎటువంటి అసాధ్యమైన పరిస్థితిలోనైనా చొరవతీసుకోగలడు!
ఈ ప్రణాళిక గురించి
మీరు ఎన్నడూ ఒంటరి కాదు. మీరు క్రైస్తవ విశ్వాసంలో 1 రోజు ఉన్నప్పటికీ లేదా 30 సంవత్సరాలు ఉన్నప్పటికీ, మన జీవితంలో ఎటువంటి సవాళ్ళు వచ్చినా ఈ సత్యం మారదు. దేవుని సహాయం ప్రభావవంతంగా ఎలా పొందుకోవాలో ఈ ప్రణాళిక ద్వారా నేర్చుకోండి. డేవిడ్ స్వాండ్ రచించిన “ఈ లోకంలోనుండి: ఎదుగుదల మరియు ఉద్దేశమునకు క్రైస్తవుని మార్గనిర్దేశం” అనే పుస్తకంలోనుండి సంగ్రహించబడింది.
More
ఈ ప్లాన్‌ని అందించినందుకు మేము Twenty20 Faith, Inc.కి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మరింత సమాచారం కోసం, దయచేసి సందర్శించండి: https://www.twenty20faith.org/devotion1?lang=te