బలం మరియు ధైర్యంతో జీవించండినమూనా
“మీరు ఎదగడానికి సహాయపడటానికి ఆయన ప్రవర్తనను నిర్మిస్తాడు”
మంచి ప్రవర్తన రక్షణతో మనకు రాదు, కానీ అది నేర్చుకొని కాలం గడిచేకొద్దీ పెంపొందించుకోవాలి. క్రీస్తు పోలికను పెంపొందించుకోవడానికి మనకు సహాయపడటం దేవుని ప్రాథమిక లక్ష్యములలో ఒకటి. యేసు స్వభావాన్ని మనలో నిర్మించి దానిని వృద్ధి చెందించుట ద్వారా మనం ఆయన స్వరూపంలోనికి మరింత మారుటకు పరిశుద్ధాత్మ మనకు సహాయం చేస్తాడు. బైబిల్ దానిని ఆత్మ ఫలం అని పిలుస్తుంది.
“అయితే ఆత్మ ఫలమేమనగా, ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయా ళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము. ఇట్టివాటికి విరోధమైన నియమమేదియు లేదు. క్రీస్తుయేసు సంబంధులు శరీరమును దాని యిచ్ఛలతోను దురాశలతోను సిలువవేసి యున్నారు.” గలతీయులకు 5:22-24
సవాళ్ళ మధ్య, మన వ్యతిరేకతలను మన స్వంత శక్తితో గెలవడానికి ప్రయత్నిస్తాము. మనం ఆవిధంగా చేయుట ద్వారా, మన కష్టాలను దాటడానికి మన క్రైస్తవ ప్రవర్తన కూడా పణంగా పెట్టడం లేదా “అడ్డ దారులు తొక్కటం” వంటివి చేయడానికి అవకాశం ఉంటుంది. కానీ మనం పరిశుద్ధాత్మ శక్తి కోసం ప్రార్థించినప్పుడు ఎటువంటి పరిస్థితిలోనైనా మనం యదార్థత, సత్యం మరియు నిజాయితీతో కొనసాగటానికి ఆయన సహాయం చేస్తాడు.
విజయముతో కూడిన కాలంలో, అవే బైబిల్ సూత్రాలు పాటించాలి. స్వార్థపూరిత గర్వం మరియు డంబం దేవుడు మనలో పెంపొందించాలని ఆశించే క్రైస్తవ ప్రవర్తనకు వ్యతిరేకంగా ఉంటాయి. వాస్తవానికి, దేవుని నుండి ఉన్నతిని పొందాలంటే తగ్గింపు తప్పనిసరిగా అవసరమై వుంటుంది.
“సాత్వికులు ధన్యులు; వారు భూలోకమును స్వతంత్రించుకొందురు.” మత్తయి 5:5
క్రీస్తును పోలిన ప్రవర్తన వలన మనం విజయాన్ని మరియు సవాళ్లను ఎదుర్కొంటూ ఉండగా, మనం దేవునితో మన యాత్రలో ఎదుగుతాము. ఆత్మ ఫలమును కలిగి జీవించుట ద్వారా మనకు మేలుకరంగా మరియు గౌరవదాయకంగా ఉంటుందన్న సంగతి మనం గమనించడం ప్రారంభిస్తాము. మనం దేవునితో మన ప్రయాణంలో ఎంత ఎక్కువగా ఎదిగితే, అంతా ఎక్కువగా దేవుడు తన ఆశీర్వాదాలను మన జీవితంలో అనుగ్రహించగలడు!
ఈ ప్రణాళిక గురించి
మీరు ఎన్నడూ ఒంటరి కాదు. మీరు క్రైస్తవ విశ్వాసంలో 1 రోజు ఉన్నప్పటికీ లేదా 30 సంవత్సరాలు ఉన్నప్పటికీ, మన జీవితంలో ఎటువంటి సవాళ్ళు వచ్చినా ఈ సత్యం మారదు. దేవుని సహాయం ప్రభావవంతంగా ఎలా పొందుకోవాలో ఈ ప్రణాళిక ద్వారా నేర్చుకోండి. డేవిడ్ స్వాండ్ రచించిన “ఈ లోకంలోనుండి: ఎదుగుదల మరియు ఉద్దేశమునకు క్రైస్తవుని మార్గనిర్దేశం” అనే పుస్తకంలోనుండి సంగ్రహించబడింది.
More
ఈ ప్లాన్‌ని అందించినందుకు మేము Twenty20 Faith, Inc.కి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మరింత సమాచారం కోసం, దయచేసి సందర్శించండి: https://www.twenty20faith.org/devotion1?lang=te