బలం మరియు ధైర్యంతో జీవించండినమూనా

బలం మరియు ధైర్యంతో జీవించండి

8 యొక్క 1

“మీరు ఎన్నడూ ఒంటరి కాదు”

జీవితంలో ఎత్తుపల్లాలు, ఆనందం మరియు సవాలు, వాగ్దానాలు మరియు సందేహాలతో కలగలిసి వస్తూ పోతూ ఉంటాయని చెబుతుంటారు. జీవితం నేరుగా పైకి ఎక్కిపోయేవిధంగా ఉండదు; కొండలు లోయలతో కూడిన ప్రయాణం అది. అందరూ, విశ్వాసులు మరియు ఆవిశ్వాసులు ఒకేవిధంగా, జీవితంలోని ఎత్తుపల్లాల గుండా ప్రయాణిస్తారు.

కానీ క్రైస్తవులముగా, జీవితంలోని లోయలను ఒంటరిగా ఎదుర్కోవలసిన అవసరం ఉండదని దేవుడు అద్భుతమైన వాగ్దానం చేస్తున్నాడు. ఆయన ప్రోత్సాహకరమైన మాటలు చూడండి:

“భయపడకుడి, వారిని చూచి దిగులుపడకుడి, నీతోకూడ వచ్చువాడు నీ దేవుడైన యెహోవాయే; ఆయన నిన్ను విడువడు నిన్నెడబాయడు.” ద్వితీయోపదేశకాండము 31:6

సవాలు మరియు విజయముతో కూడిన కాలములో కూడా దేవుని సన్నిధి అవసరం అనేమాట సత్యం. దేవుడు మనతో ఉన్నాడని తెలుసుకోవడం ద్వారా, మన జీవితంలోని ప్రతి సవాలును నిరాశలోనికి దిగజారిపోతున్నట్లు కాకుండా విజయానికి మెట్ల వలె ఎదుర్కోవచ్చు.

ఏ పర్వతం లేదా లోయ దేవుడు మనల్ని కలుసుకోలేనంత ఎత్తైనది లేదా లోతైనది కాదు. పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ, దేవుడు నమ్మదగినవాడు, మరియు ఆయన మనతో ఎల్లప్పుడూ ఉంటాడు!

రోజు 2

ఈ ప్రణాళిక గురించి

బలం మరియు ధైర్యంతో జీవించండి

మీరు ఎన్నడూ ఒంటరి కాదు. మీరు క్రైస్తవ విశ్వాసంలో 1 రోజు ఉన్నప్పటికీ లేదా 30 సంవత్సరాలు ఉన్నప్పటికీ, మన జీవితంలో ఎటువంటి సవాళ్ళు వచ్చినా ఈ సత్యం మారదు. దేవుని సహాయం ప్రభావవంతంగా ఎలా పొందుకోవాలో ఈ ప్రణాళిక ద్వారా నేర్చుకోండి. డేవిడ్ స్వాండ్ రచించిన “ఈ లోకంలోనుండి: ఎదుగుదల మరియు ఉద్దేశమునకు క్రైస్తవుని మార్గనిర్దేశం” అనే పుస్తకంలోనుండి సంగ్రహించబడింది.

More

ఈ ప్లాన్‌ని అందించినందుకు మేము Twenty20 Faith, Inc.కి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మరింత సమాచారం కోసం, దయచేసి సందర్శించండి: https://www.twenty20faith.org/devotion1?lang=te