బలం మరియు ధైర్యంతో జీవించండినమూనా
“దేవుడు మీ వద్దకు వచ్చాడు”
నిత్యజీవము గూర్చిన వాగ్దానం మానవుడు ఎక్కడో దూరాన ఉన్న దేవుని వెదకి ఆయనను కనుగొనటం వలన వచ్చింది కాదు గాని అది దేవుడు మన వద్దకు వచ్చుట వలన కలిగింది.
కాలం ఆరంభమైన దగ్గరనుండి, దేవుడు మనలో ప్రతి ఒక్కరని ఏ షరతులు లేని నిత్య ప్రేమతో ప్రేమించాడు. మనలో ప్రతి ఒక్కరితో బలమైన మరియు సజీవమైన సంబంధం కలిగి ఉండాలనేది ఆయన అసలు ఉద్దేశం. కానీ, ఏదెను తోటలో ఆదాము మరియు హవ్వ దేవునికి అవిధేయులైనప్పుడు వారి పాపం మనకు దేవునికి మధ్య ఆటంకమును ఏర్పరచింది. మనం దేవునికి నిత్య వేర్పాటులోనికి వెళ్లిపోయాము.
మనం దేవుని నుండి వేరుగా ఉండిపోయేందుకు అనుమతించకుండా మన పునరుద్ధరణ కొరకు ఒక పరిపూర్ణమైన ప్రణాళికను ఏర్పాటు చేశాడు- అది మన పట్ల ఆయనకున్న అపరిమితమైన ప్రేమ మరియు కృప చేత నడిపించబడేది.
2,000 సంవత్సరాల క్రితం, పాపం వలన ఏర్పడిన అడ్డును తొలగించి, అందరికీ రక్షణ అందుబాటులోనికి తేవడానికి దేవుడు తన కుమారుని ఈ లోకానికి పంపించాడు.
“దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. కాగా ఆయన తన అద్వితీయకుమారునిగా పుట్టిన వానియందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్యజీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకేగాని లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడాయనను లోకములోనికి పంప లేదు.” యోహాను 3:16-17
ఆయన మరణం మరియు పునరుత్థానం ద్వారా, మన పాప శిక్షకు సంబంధించిన పూర్తి జరిమానాను చెల్లించి, దేవునికి మరియు మనకు మధ్య ఉన్న అడ్డును తొలగించాడు. ఆయనను కేవలం స్వంత రక్షకునిగా అంగీకరించిన ప్రతి ఒక్కరికీ ఈ క్షమాపణ అందుబాటులో ఉంది.
కానీ ఇది కేవలం ఆరంభం మాత్రమే. యేసు ఈ భూమ్మీద తన పని ముగించుకొని పరలోకంలో ఉన్న తన తండ్రి సన్నిధికి చేరకముందు, మానవాళిని తన వద్దకు చేర్చుకొనుటకు ఆయనకున్న మరింత విశాలమైన ప్రణాళిక గురించి యేసు తన శిష్యులకు తెలియజేశాడు.
“నా తండ్రి యింట అనేక నివాసములు కలవు, లేనియెడల మీతో చెప్పుదును; మీకు స్థలము సిద్ధపరచ వెళ్లుచున్నాను. నేను వెళ్లి మీకు స్థలము సిద్ధపరచినయెడల నేనుండు స్థలములో మీరునుఉండు లాగున మరల వచ్చి నాయొద్ద నుండుటకు మిమ్మును తీసి కొని పోవుదును.” యోహాను 14:2-3
పాపం వలన కలిగిన ఆటంకమును తొలగించడానికి దేవుడు యేసును పంపించుట మాత్రమే కాదు గాని, ఒకరోజు భవిష్యత్తులో యేసు ఆయనతో కూడా విశ్వాసులు నిత్యమూ “నిత్య గృహంలో” ఉండటానికి వారిని తీసుకుపోవడానికి తిరిగి రాబోతున్నాడు.
వాక్యము
ఈ ప్రణాళిక గురించి
మీరు ఎన్నడూ ఒంటరి కాదు. మీరు క్రైస్తవ విశ్వాసంలో 1 రోజు ఉన్నప్పటికీ లేదా 30 సంవత్సరాలు ఉన్నప్పటికీ, మన జీవితంలో ఎటువంటి సవాళ్ళు వచ్చినా ఈ సత్యం మారదు. దేవుని సహాయం ప్రభావవంతంగా ఎలా పొందుకోవాలో ఈ ప్రణాళిక ద్వారా నేర్చుకోండి. డేవిడ్ స్వాండ్ రచించిన “ఈ లోకంలోనుండి: ఎదుగుదల మరియు ఉద్దేశమునకు క్రైస్తవుని మార్గనిర్దేశం” అనే పుస్తకంలోనుండి సంగ్రహించబడింది.
More
ఈ ప్లాన్‌ని అందించినందుకు మేము Twenty20 Faith, Inc.కి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మరింత సమాచారం కోసం, దయచేసి సందర్శించండి: https://www.twenty20faith.org/devotion1?lang=te