బలం మరియు ధైర్యంతో జీవించండినమూనా

బలం మరియు ధైర్యంతో జీవించండి

8 యొక్క 6

“జయజీవితం జీవించడానికి ఆయన మిమ్మును శక్తిమంతులుగా చేస్తున్నాడు”

ఉద్యోగం చేయడానికి అవసరమైన సరైన పరికరాలు లేకుండా, అతి సాధారణమైన పనులు కూడా చాలా కష్టతరమైపోతాయి. ఉదాహరణకు, కరంటుతో పనిచేసే స్క్రూడ్రైవర్ ఉంటే స్క్రూ విప్పడం సులువుగా ఉంటుంది కానీ అది లేకపోతే మరింత కష్టతరమై అలసట కలిగించేదిగా ఉంటుంది.

మన జీవితంలో అవసరమైన పరికరాలు ఇవ్వడమే దేవుని లక్ష్యం. ఒక పెద్ద నిర్ణయం చేసుకోవడానికి కావలసిన తెలివిని ఇవ్వడం కావచ్చు, ఒక చెడు అలవాటును జయించడానికి కావలసిన దృఢ నిశ్చయం, లేదా అసాధ్యమైన పరిస్థితిని ధైర్యంతో ఎదుర్కొనడానికి కావలసిన విశ్వాసం మరియు నమ్మిక కావచ్చు, మనం సంతృప్తికరమైన మరియు ఆశీర్వదించబడిన జీవితాన్ని జీవించడానికి కావలసినవి అనుగ్రహించుటకు దేవుడు నమ్మదగినవాడు.

“బాలురు సొమ్మసిల్లుదురు అలయుదురు యౌవనస్థులు తప్పక తొట్రిల్లుదురు యెహోవాకొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురువారు పక్షిరాజులవలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు అలయక పరుగెత్తుదురు సొమ్మసిల్లక నడిచిపోవుదురు.” యెషయా 40:30-31

మనం ఎదుర్కునే ప్రతి సవాలు కొరకు మనలను సిద్ధపరచడానికి కావలసిన అపరిమితమైన పరికరాల పెట్టెకు తాళపుచెవి దేవునియందు విశ్వాసం ద్వారా దొరుకుతుంది. మనం పైనుండి శక్తిని పొందినప్పుడు, మనం విజయవంతంగా జీవిస్తాము!

వాక్యము

రోజు 5రోజు 7

ఈ ప్రణాళిక గురించి

బలం మరియు ధైర్యంతో జీవించండి

మీరు ఎన్నడూ ఒంటరి కాదు. మీరు క్రైస్తవ విశ్వాసంలో 1 రోజు ఉన్నప్పటికీ లేదా 30 సంవత్సరాలు ఉన్నప్పటికీ, మన జీవితంలో ఎటువంటి సవాళ్ళు వచ్చినా ఈ సత్యం మారదు. దేవుని సహాయం ప్రభావవంతంగా ఎలా పొందుకోవాలో ఈ ప్రణాళిక ద్వారా నేర్చుకోండి. డేవిడ్ స్వాండ్ రచించిన “ఈ లోకంలోనుండి: ఎదుగుదల మరియు ఉద్దేశమునకు క్రైస్తవుని మార్గనిర్దేశం” అనే పుస్తకంలోనుండి సంగ్రహించబడింది.

More

ఈ ప్లాన్‌ని అందించినందుకు మేము Twenty20 Faith, Inc.కి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మరింత సమాచారం కోసం, దయచేసి సందర్శించండి: https://www.twenty20faith.org/devotion1?lang=te