పిల్లలు కోసం బైబిలునమూనా
యేసు భూమిపై జీవించినప్పుడు ఆయన తన శిష్యులకు పరలోకము గురించి చెప్పెను. ఆయన దానిని "నా తండ్రి నివాసము" అని పిలిచాడు మరియు అక్కడ చాలా భవనాలు ఉన్నాయని చెప్పెను.ఆ భవనములు పెద్దవి, అందమైన నివాసములు. పరలోకము అన్ని భూసంబంధమైన ఇల్లు కంటే పెద్దవి మరియు అందమైనవి.
యేసు, "నేను వెళ్ళి మీకు స్థలం సిద్ధం చేస్తే, నేను మళ్ళీ వచ్చి, నేను ఉండే స్థలంలో మీరు కూడా ఉండేలా, నా దగ్గరికి మిమ్మల్ని తీసుకు వెళ్తాను" అని చెప్పెను. యేసు మృతులలో నుండి లేచిన తరువాత పరలోకముకి వెళ్ళెను. ఆయన శిష్యులు చూస్తుండగా, యేసు ఆరోహణమాయెను, మరియు వారి దృష్టిలోనుండి ఒక మేఘము ఆయనను కొనిపోయెను.
అప్పటి నుండి, యేసు మరలావచ్చి వారిని కొని పోవును అనే వాగ్దానమును క్రైస్తవులు నమ్మిరి. కనీసం ఊహించని సమయంలో నేను అకస్మాత్తుగా తిరిగి వస్తానని యేసు చెప్పెను. అయితే ఆయన రాకడ ముందే చనిపోయిన క్రైస్తవుల సంగతేమిటి? వారు నేరుగా యేసుతో ఉండడానికి వెళ్తారని బైబిలు చెప్పుతుంది. శరీరముకు దూరంగా ఉండటమంటే ప్రభుతో ఉండటమే.
ప్రకటన గ్రంధము బైబిలులోని చివరి పుస్తకము, పరలోకము ఎంత అద్భుతమైనదో తెలియజేస్తుంది. చాలా అద్భుతమైన విషయం ఏమిటంటే, చాలా ప్రత్యేకమైన రీతిలో, పరలోకము దేవుని నివాసము పరలోకము అని ఒక ప్రత్యేకమైన మార్గములో ఇది చాలా అందమైనదిగా తెలియజేసేను . దేవుడు ప్రతిచోటా ఉండును, కానీ ఆయన సింహాసనం పరలోకములో ఉంది.
దేవునిదూతలు మరియు ఇతర పరలోకపు జీవులు పరలోకములో దేవుణ్ణి ఆరాధిస్తారు. అలాగే మరణించిన మరియు స్వర్గానికి వెళ్ళిన దేవుని ప్రజలందరూ అదే చేస్తారు. వారు ప్రత్యేక పాటలు పాడతు దేవుని ఆరాధిస్తారు.
ఆ పెద్దలు, “ఆ గ్రంథాన్ని తీసుకుని దాని సీలులు తెరవడానికి నువ్వు యోగ్యుడివి. నువ్వు వధ అయ్యావు. ప్రతి వంశం నుండీ, ప్రతి భాష మాట్లాడే వారి నుండీ, ప్రతి జాతి నుండీ, ప్రతి జనం నుండీ నీ రక్తాన్ని ఇచ్చి దేవుని కోసం మనుషులను కొన్నావు. (ప్రక. 5:9)
బైబిలు చివరి పేజీలో పరలోకమును "నూతన యేరూషలేం" అని వర్ణిస్తుంది. ఇది చాలా చాలా పెద్దది, బయట ఎత్తైన గోడలతో ఉంది. గోడ జాస్పర్ రాయితో ఉంది, తేటగా స్పష్టంగా ఉంది. ఆభరణాలు మరియు విలువైన రాళ్ళతో గోడ పునాదిని కప్పి, అందమైన రంగులతో మెరుస్తూ ఉంది. నగర ద్వారాలు ప్రతి ఒక్కటి ఒక పెద్ద ముత్యంతో తయారు చేసి ఉండెను!
ఆ గొప్ప ముత్యాల ద్వారాలు ఎప్పుడూ మూసివేయబడవు. లోపలికి వెళ్లి చుట్టూ చూద్దాం... అమో! పరలోకము లోపల మరింత సుందరముగా ఉంది. నగరం స్వచ్ఛమైన బంగారంతో నిర్మితమైంది, స్పష్టమైన గాజులా ఉంది. వీధులు కూడా బంగారంతో చేసి ఉన్నాయి.
దేవుని సింహాసనం నుండి అందమైన, స్పష్టమైన జీవజల నది ప్రవహిస్తుంది. నదికి ఇరువైపులా జీవ ఫల వృక్షం ఉంది, ఇది మొదట ఏదేను వనములో కనుగొనబడింది. ఈ చెట్టు చాలా ప్రత్యేకమైనది. ఒక్కొక్క మాసములో ఇది పన్నెండు రకాల పండ్లను కాయును. మరియు జీవవృక్షం యొక్క ఆకులు దేశాల స్వస్థత కోసం ఉన్నాయి.
వెలుగు కోసం పరలోకమునకు సూర్యుడు లేదా చంద్రుడు అవసరం లేదు. అది దేవుని స్వంత మహిమ చేత అద్భుతమైన కాంతితో నింఫై ఉంటుంది. అక్కడ ఎప్పుడూ రాత్రి ఉండదు.
పరలోకములోని జంతువులు కూడా భిన్నంగా ఉంటాయి. వారంతా మృదువుగా మరియు స్నేహపూర్వకంగా ఉంటాయి. తోడేళ్ళు మరియు గొర్రె పిల్లలు కలిసి గడ్డిని తింటాయి. బలమైన సింహాలు కూడా ఎద్దులా గడ్డిని తింటాయి. యెహోవా ఇలా చెప్పెను, "నా పవిత్ర పర్వతం అంతటా ఏ మృగము హాని చేయదు లేదా నాశనం చేయదు."
మనం చుట్టూ చూస్తున్నప్పుడు, పరలోకములో మనముకొన్నిసంగతులు పరలోకములో లేనట్టు గమనించవచ్చు. కోపంతో కూడిన మాటలు ఎప్పుడూ వినబడవు. ఎవరూ పొట్లడరు లేదా స్వార్థపరులుగా ఉండరు. తలుపులకు తాళాలు ఉండవు, ఎందుకంటే పరలోకములో దొంగలు లేరు. అక్కడ ఆబద్ధకులు, హంతకులు, మాంత్రికులు లేదా ఇతర దుర్మార్గులు ఉండరు. పరలోకంలో ఏ విధమైన పాపమూ లేదు.
దేవునితో పరలోకములో కన్నీళ్లు ఉండవు. కొన్నిసార్లు, దేవుని ప్రజలు ఈ లోక జీవితంలో గొప్ప దుఃఖం కారణంగా ఏడుస్తారు. పరలోకములో, దేవుడు అన్ని ప్రతీ కన్నీళ్లను తుడుచును.
పరలోకములో మరణం ఉండదు. దేవుని ప్రజలు ఎప్పటికీ ప్రభువుతో ఉంటారు. ఇక దుఃఖం లేదు, ఏడుపు లేదు, బాధ లేదు. అనారోగ్యం లేదు, విడిపోవడం లేదు, అంత్యక్రియలు లేవు. పరలోకములో ఉన్న ప్రతి ఒక్కరూ దేవునితో ఎప్పటికీ సంతోషంగా ఉంటారు.
అన్నింటికంటే ఉత్తమమైనది, యేసుక్రీస్తును తమ సొంత రక్షకునిగా విశ్వసించిన, తమ ప్రభువుగా ఆయనకు విధేయత చూపిన అబ్బాయిలు మరియు బాలికలకు (మరియు పెద్దలు కూడా) పరలోకము.
పరలోకములో గొర్రె పిల్ల యొక్క జీవగ్రంధము అని పిలిచే ఒక పుస్తకం ఉంది. దానిలో ప్రజల పేర్లతో నిండి ఉంది. అక్కడ ఎవరి పేర్లు రాసి ఉన్నాయో మీకు తెలుసా? యేసుపై నమ్మకం ఉంచిన ప్రజలందరూ పేర్లు. మీ పేరు ఉందా?
పరలోకము గురించి బైబిలు చివరి మాటలు అద్భుతమైన ఆహ్వానం. “మరియు‘రా! అంటూ ఆత్మా, పెళ్ళికూతురూ చెబుతున్నారు. వింటున్నవాడూ, ‘రా! అని చెప్పాలి. దాహం వేసిన వాడు రావాలి. ఇష్టమున్న వ్యక్తి జీవ జలాన్ని ఉచితంగా తీసుకోవచ్చు’’.
ముగింపు
ఈ ప్రణాళిక గురించి
అది ఎలా మొదలైంది? మేము ఎక్కడ నుండి వచ్చాము? ఎందుకు ప్రపంచంలో చాలా కష్టాలను ఉంది? ఏదైనా ఆశ ఉందా? మరణం తరువాత జీవితం ఉందా? ప్రపంచంలోని ఈ నిజమైన చరిత్ర చదివేటప్పుడు సమాధానాలను కనుగొనండి.
More
ఈ ప్లాన్‌ని అందించినందుకు మేము XXకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మరింత సమాచారం కోసం, దయచేసి సందర్శించండి: https://bibleforchildren.org/languages/telugu/stories.php