పిల్లలు కోసం బైబిలునమూనా

పిల్లలు కోసం బైబిలు

8 యొక్క 3

నోవహు ఒకడే దేవుణ్ణి ఆరాధించే వాడు. మిగిలిన వారందరూ దేవుణ్ణి అసహ్యించుకున్నారు మరియు అవిధేయత చూపే వారు. ఒకరోజు దేవుడు దిగ్భ్రాంతికరంగామైన విషయం చెప్పాడు. “నేను ఈ దుష్ట లోకాన్ని నాశనం చేస్తాను” అని దేవుడు నోవహుతో చెప్పెను. "మీ కుటుంబం మాత్రమే రక్షించబడుతుంది."

ఒక గొప్ప జలప్రళయం వచ్చి భూమిని కప్పివేస్తుందని దేవుడు నోవహును హెచ్చరించాడు. "ఒక చెక్క ఓడను, నీ కుటుంబానికి మరియు అన్ని జంతువులకు సరిపోయేంత పెద్ద పడవను నిర్మించుకోండి" అని నోవాకు దేవుడు ఆజ్ఞాపించేను. దేవుడు నోవహుకు ఖచ్చితమైన సూచనలను ఇచ్చాడు. నోవహు తీరికలేనివాడు ఆయెను!

నోవహు తాను ఓడను ఎందుకు తయారు చేస్తున్నాడో వివరించినప్పుడు ప్రజలు బహుశా ఎగతాళి చేసియుండియుండ వచ్చును. నోవహు ఓడను కట్టుకుంటూనే ఉండెను. అతను దేవుని గురించి ప్రజలకు చెబుతూనే ఉండేవాడు. ఎవరూ వినలేదు.

నోవహుకు గొప్ప విశ్వాసం కలిగి ఉండేవాడు. ఇంతకు ముందెన్నడూ వర్షం పడకపోయినా దేవుడిని విశ్వసించాడు. త్వరలోనే ఓడ సమస్త సామాగ్రితో నింపుటకు సిద్ధమాయెను.

ఇప్పుడు జంతువులు వచ్చాయి. దేవుడు కొన్ని జాతుల్లో ఏడు జంటలను, మరికొన్ని జాతుల్లో రెండేసి జంటలను తీసుకువచ్చాడు. పెద్దవి మరియు చిన్నవి, చిన్నవి మరియు పొడవాటి జంతువులు అన్నీ ఒకలోనికి వెళ్ళెను.

నోవహు జంతువులను ఒకలోనికి ఎక్కించేటప్పుడు బహుశా ప్రజలు అతని పైన అరచి దూషించి ఉండవచ్చు. వారు దేవునికి వ్యతిరేకంగా పాపం చేయడం ఆపలేదు. వారు ఓడలోకి వస్తామని కూడా అడగలేదు.

చివరగా, అన్ని జంతువులు మరియు పక్షులు ఓడలోనికి ఎక్కెను. "ఓడలోకి రండి" అని దేవుడు నోవహును ఆహ్వానించాడు. "నీవు మరియు నీ కుటుంబం." నోవహు, అతని భార్య, అతని ముగ్గురు కుమారులు మరియు వారి భార్యలు ఓడలోకి ప్రవేశించారు. అప్పుడు దేవుడు ఓడ తలుపు మూసివేసెను!

అప్పుడు వర్షం వచ్చింది. గొప్ప ప్రచండ వర్షము నలభై పగళ్ళు మరియు రాత్రులు భూమిని తడిపింది.

పట్టణాలను, గ్రామాలను వరదనీరు ముంచెను. వర్షం ఆగిపోవడంతో పర్వతాలు కూడా నీట మునిగాయి. గాలి పిల్చుకునే ప్రతీది జీవి చనిపోయెను.

నీళ్లు పెరగడంతో ఓడ నీళ్ళ పై తేలుతోంది. లోపల చీకటిగా ఉండవచ్చు, ఎగుడుదిగుడుగా ఉండవచ్చు మరియు భయానకంగా ఉండవచ్చు. కానీ ఆ ఓడ నోవహుకు జల ప్రళయం నుండి ఆశ్రయాన్ని ఇచ్చింది.

ఐదు నెలల జల ప్రళయం తరువాత, దేవుడు పొడి గాలిని పంపాను. మెల్లగా, ఆ ఓడ ఆరారాతు పర్వతములు మీద నిలిచెను. నీరు తగ్గేఅంతవరకూ నోవహు మరో నలభై రోజులు ఓడ లోపలే ఉన్నాడు.

నోవహు ఓడ కిటికీ తెరిచిన ఒక కాకిని మరియు పావురాన్ని పంపాడు. నివసించుటకు ఆరిన శుభ్రమైన స్థలం నేల కనపడనందున, పావురం నోవహు వద్దకు తిరిగి వచ్చింది.

ఒక వారం తర్వాత, నోవహు మళ్లీ ప్రయత్నించాడు. పావురం దాని ముక్కులో కొత్త ఆలివ్ ఆకుతో తిరిగి వచ్చింది. తరువాత వారం, పావురం తిరిగి రాకపోవడంతో భూమి ఎండిపోయిందని నోవహు తెలుసుకొనెను.

ఓడను విడిచిపెట్టే సమయం వచ్చిందని దేవుడు నోవహుకు చెప్పాడు. నోవహు మరియు అతని కుటుంబము కలిసి జంతువులను బయటకు దింపారు.

నోవహు ఎంత గొప్ప కృతజ్ఞతగలవాడై భావించి! అతను ఒక బలిపీఠాన్ని నిర్మించి మరియు భయంకరమైన జలప్రళయము నుండి తనను మరియు తన కుటుంబాన్ని రక్షించిన ఆ దేవునిని ఆరాధించేను.

దేవుడు నోవహుకు అద్భుతమైన వాగ్దానాన్ని ఇచ్చాడు. మనవుల పాపాన్ని తీర్పు తీర్చడానికి ఆయన మళ్లీ వరదను పంపననెను. దేవుడు ఆయనవాగ్దానానికి గొప్ప గుర్తును ఇచ్చాడు. ఇంద్రధనస్సు దేవుని వాగ్దానానికి గుర్తే.

జలప్రళయం తర్వాత నోవహు మరియు అతని కుటుంబం కొత్త జీవితాన్ని ప్రారంభించారు. కాలక్రమేణా, అతని వారసులు మొత్తం భూమిని తిరిగి ప్రజలుగా మార్చారు. ప్రపంచంలోని అన్ని దేశాలు నోవహు మరియు అతని పిల్లల నుండి వచ్చినవారే.

ముగింపు

రోజు 2రోజు 4

ఈ ప్రణాళిక గురించి

పిల్లలు కోసం బైబిలు

అది ఎలా మొదలైంది? మేము ఎక్కడ నుండి వచ్చాము? ఎందుకు ప్రపంచంలో చాలా కష్టాలను ఉంది? ఏదైనా ఆశ ఉందా? మరణం తరువాత జీవితం ఉందా? ప్రపంచంలోని ఈ నిజమైన చరిత్ర చదివేటప్పుడు సమాధానాలను కనుగొనండి.

More

ఈ ప్లాన్‌ని అందించినందుకు మేము XXకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మరింత సమాచారం కోసం, దయచేసి సందర్శించండి: https://bibleforchildren.org/languages/telugu/stories.php