పిల్లలు కోసం బైబిలునమూనా

పిల్లలు కోసం బైబిలు

8 యొక్క 1

మనలను తయారు చేసింది ఎవరు? బైబిలు, దేవుని వాక్యం, మానవ జాతి ఎలా ప్రారంభమైందో చెప్పుతుంది. చాలా కాలం క్రితం, దేవుడు మొదట మనిషిని సృష్టించాడు మరియు అతనికి ఆదాము అని పేరు పెట్టాడు. దేవుడు ఆదామును భూమి నుంచి మట్టిని తీసి చేసాడు. దేవుడు ఆదాముకు జీవాత్మ ఊదినప్పుడు, అతడు జీవంలోనికి వచ్చాడు. అతనిని అతనుఏదెను అనే అందమైన తోటలో కనుగొనెను.

దేవుడు ఆదామును చేయకముందే, ఆయన అందమైన ప్రపంచాన్ని చేసి అందులో అద్భుతమైన వస్తువులతో నింపెను. అంచెలంచెలుగా దేవుడు కొండ ప్రాంతాలు మరియు విశాలమైన ప్రదేశాలు, సువాసనగల పువ్వులు మరియు ఎత్తైన చెట్లు, ప్రకాశవంతమైన రెక్కలుగల పక్షులు మరియు సందడి చేసే తేనెటీగలు, వాలు తిమింగలాలు మరియు జారే నత్తలను సృష్టించాడు. నిజానికి, దేవుడు ప్రతిదీ చేసేను గనుక ప్రతీది ఉండెను.

ఆదిలోనే, దేవుడు దేనిని చేయకముందు, దేవుడు తప్ప మరేమీ అక్కడ లేదు. మనుషులు కాని లేదా స్థలాలు లేదా వస్తువులు లేవు. ఏమిలేవు. వెలుగు లేదు చీకటి లేదు. ఎత్తు పల్లములు లేవు. నిన్న లేదు రేపు అనే దినములు లేవు. ప్రారంభం అనే లేని దేవుడు ఒక్కడు మాత్రమే ఉన్నాడు. అప్పుడు దేవుడు యోచించెను!

ఆదియందు దేవుడు భూమ్యాకాశములను సృష్టించెను.

మరియు భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను. చీకటి అగాదజలములపైన కమ్మియుండెను. అప్పుడు దేవుడు పలికెను. “ అక్కడ వెలుగు కలుగును గాక.”

మరియు అక్కడ వెలుగు కలిగెను. దేవుడు వెలుగుకి పగలు, చీకటికి రాత్రి అని పేరులు పెట్టెను. ఉదయము, అస్తమయము కలుగగా మొదటి రోజు అయింది.

రెండవ రోజు, దేవుడు మహాసముద్ర జలములను, సముద్రాలను మరియు సరస్సుల నీటిని పరలోకం క్రింద క్రమపరిచెను. మూడవ రోజు, దేవుడు "ఆరిన నేల కనిపించును గాక " అని పలికెను. మరియు అది జరిగింది.

దేవుడు గడ్డిని మరియు పువ్వులను మరియు పొదలను మరియు చెట్లను కలుగుమని కూడా ఆదేశించాడు. మరియు అవి కలిగెను. మరియు సాయంత్రం, ఉదయం అయింది మూడవ రోజు.

అప్పుడు దేవుడు సూర్యుడిని, చంద్రుడిని, ఎవ్వరూ లెక్కించలేని అనేక నక్షత్రాలను సృష్టించెను. మరియు సాయంత్రం, ఉదయం అయింది నాల్గవ రోజు.

అటుతరువాత దేవుని జాబితాలో సముద్ర జీవులు మరియు చేపలు మరియు పక్షులు ఉన్నాయి. ఐదవ రోజు ఆయన పెద్ద కొమ్ములు గల సొర్ర చేపలను మరియు చిన్న చిన్న రంగు గల చేపలను, పొడవాటి కాళ్ళ ఉష్ట్రపక్షి మరియు సంతోషంగా ఉండే చిన్న పక్షులను తయారు చేసెను. దేవుడు భూమి మీద ఉన్న నీరును నింపటానికి ప్రతీ రకమైన చేపలను చేసెను మరియు భూమి మీద, సముద్రము పైన మరియు ఆకాశము కింద ఆస్వాదించడానికి ప్రతీ రకమైన పక్షులను ఆయన సృష్టించాడు. మరియు సాయంత్రం, ఉదయం అయింది ఐదవ రోజు.

అటు తరువాత దేవుడు మళ్ళి పలికెను. భూమి మీద బ్రతుకు జంతువులు పుట్టును గాక అని ఆయన చెప్పెను. అన్ని రకాలైన జంతువులు మరియు క్రిములు మరియు పాకే జంతువులు కలుగును గాక అని అజ్ఞాపించెను. భూమిని వణికించ గాల ఏనుగులు మరియు తీరికలేకుండా ఉండే ఉభయచరములు ఉన్నాయి. కొంటె కోతులు మరియు వికృతమైన మొసళ్ళు. ఒల్లు జలజరించె పురుగులను మరియు మొండి చింపాజీలు. జిరాఫీల గుంపులను మరియు మూలుగే పిల్లులను అన్ని రకాల జంతువులు ఆ రోజు దేవుడు చేసెను. మరియు సాయంత్రం, ఉదయం అయింది ఐదవ రోజు

దేవుడు ఆరవ రోజు మరి కొన్ని చేశాడు – అవి చాలా ప్రత్యేకమైనవి. ఇప్పుడు మనిషి కోసం అంతా సిద్ధంగా ఉంది. అతనికి పొలములో ఆహారం ఉంది మరియు సేవ చేయడానికి జంతువులు ఉన్నాయి. మరియు దేవుడు, "మన స్వరూపంలో మనిషిని చేద్దాం అని పలికెను. భూమిపై ఉన్న ప్రతిదానిపై అతడు ప్రభువుగా ఉండనివ్వండి". కాబట్టి దేవుడు తన స్వంత స్వరూపంలో మనిషిని సృష్టించేను; దేవుని స్వరూపంలో ఆయన అతనిని సృష్టించేను...

దేవుడు ఆదాముతో మాట్లాడేను. "తోట నుండి నీకు కావలసినది తినుము. కానీ మంచి మరియు చెడుల జ్ఞానం యొక్క చెట్టు నుండి తినవద్దు. నీవు ఆ చెట్టు నుండి తింటే నీవు కచ్చితంగా మరణించెదవు."

మరియు ప్రభువైన దేవుడు చెప్పను. “నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు. అతనికి నేను ఒక సహాయకుని చేసెదను”. దేవుడు అన్ని పక్షులను మరియు జంతువులను ఆదాము వద్దకు రప్పించెను. వాటి అన్నిటికి ఆదాముపేర్లు పెట్టాడు. అలా చేయడానికి అతను చాలా తెలివిగా చేసెను. కానీ అన్ని పక్షులలో మరియు జంతువులలో ఆదాముకు తగిన సహాయము లేదు.

దేవుడు ఆదామును గాఢమైన, గాఢ నిద్రలోకి తెచ్చెను. నిద్రిస్తున్న వ్యక్తి యొక్క పక్కటెముకలలో ఒకదానిని తీసివేసి, దేవుడు ఆదాము యొక్క పక్కటెముక నుంచి స్త్రీని చేసెను. దేవుడు చేసిన ఆ స్త్రీ ఆదాముకు భాగస్వామిగా ఉండడానికి కచ్చితంగా సరిపోతుంది.

దేవుడు ప్రతిదీ ఆరు రోజుల్లో సృష్టించేను. అప్పుడు దేవుడు ఏడవ రోజును ఆశీర్వదించి దానిని విశ్రాంతి దినంగా చేసెను. ఏదోను తోటలో, ఆదాము మరియు అతని భార్య అవ్వ దేవునికి విధేయత చూపడంలో పరిపూర్ణ ఆనందాన్ని పొందారు. దేవుడు వారి ప్రభువు, వారి ప్రదాత మరియు వారి స్నేహితుడుగాను ఉండెను.

ముగింపు

రోజు 2

ఈ ప్రణాళిక గురించి

పిల్లలు కోసం బైబిలు

అది ఎలా మొదలైంది? మేము ఎక్కడ నుండి వచ్చాము? ఎందుకు ప్రపంచంలో చాలా కష్టాలను ఉంది? ఏదైనా ఆశ ఉందా? మరణం తరువాత జీవితం ఉందా? ప్రపంచంలోని ఈ నిజమైన చరిత్ర చదివేటప్పుడు సమాధానాలను కనుగొనండి.

More

ఈ ప్లాన్‌ని అందించినందుకు మేము XXకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మరింత సమాచారం కోసం, దయచేసి సందర్శించండి: https://bibleforchildren.org/languages/telugu/stories.php