పిల్లలు కోసం బైబిలునమూనా

పిల్లలు కోసం బైబిలు

8 యొక్క 6

చాలా గొప్ప శబ్దంతో ఉన్న కొండపై ఒక స్త్రి నిలబడి, ఆమె విచారకరమైన కళ్ళుతో భయంకరమైన దృశ్యాన్ని చూస్తు ఉంది. ఆమె కొడుకు చనిపోతున్నాడు. ఆ తల్లి మరియ, మరియు ఆమె యేసును మేకులతో సిలువకు వేసి స్థలం దగ్గర నిలిచి ఉంది.

ఇదంతా ఎలా జరిగింది? ఇంత అందమైన జీవితాన్ని యేసు ఇంత దారుణంగా ఎలా ముగిస్తున్నాడు? దేవుడు తన కుమారుడిని మేకులతో సిలువ వేయటానికి, మరణానికి ఏలా అనుమతించబడడు? యేసు తాను ఏమైయున్నాడో తెలిసి తప్పు చేశాడా? దేవుడు విఫలమయ్యాడా?

లేదు! దేవుడు విఫలం కాలేదు. యేసు ఏ తప్పు చేయలేదు. తాను దుష్టులచే మరణమునకు అప్పగింప వస్తుంది యేసుకు ఎప్పుడూ తెలుసు. యేసు శిశువుగా ఉన్నప్పుడే, సిమోయోను అనే వృద్ధుడు మరియతో విచారం ఉందని ముందే చెప్పాడు.

యేసు చంపటానికి కొన్ని రోజుల ముందు, ఒక స్త్రీ వచ్చి ఆయన పాదాలపై పరిమళ తైలం పోసింది. "ఆమె డబ్బు వృధా చేస్తోంది" అని శిష్యులు ఫిర్యాదు చేశారు. "ఆమె మంచి పని చేసింది" అని యేసు చెప్పాడు. "ఆమె నా ఖననం కోసం చేసింది." అవి ఎంత విచిత్రమైన మాటలు!

దీని తరువాత, యేసు పన్నెండు మంది శిష్యులలో ఒకరైన యూదా, 30 వెండి నాణేములకు యేసును మోసం చేయుటకు ప్రధాన యాజకులకు దగ్గర అంగీకరించాడు.

యూదుల పస్కా పండుగలో, యేసు తన శిష్యులతో కలిసి చివరి భోజనం చేసెను.ఎవరైతే ఆయనను ప్రేమిస్తారో వారికి దేవుని గురించి, ఆయన చేసిన వాగ్దానాల గురించి అద్భుతమైన విషయాలు చెప్పాడు. అప్పుడు యేసు వారికి పంచుకోవడానికి రొట్టె మరియు ఒక పాత్ర ఇచ్చెను. ఇవి పాప క్షమాపణ పొందు నిమితం యేసు శరీరం మరియు రక్తమునకు సదృశముగా గుర్తుచేయసుకోనుటకు ఇచ్చెను.

అప్పుడు యేసు తన స్నేహితులతో నేను అప్పగింపబడుదును, మరియు మీరు పారిపోతారు అని చెప్పెను. "నేను పారిపోను,"అనిపేతురు గట్టిగా చెప్పెను. "కోడి కూయకముందే నీవు నన్ను మూడుసార్లు తిరస్కరిస్తావు" అని యేసు చెప్పెను.

తరువాత ఆ రాత్రి, యేసు గెత్సేమనే తోటలో ప్రార్థన చేయడానికి వెళ్ళెను. ఆయనతో ఉన్న శిష్యులు నిద్రపోయారు. "ఓ నా తండ్రీ," యేసు ప్రార్థించాడు, "... నీ చిత్తమైతే ఈ పాత్రను నా నుండి తొలిగించుము. అయితే నా చిత్తము కాక నీ చిత్తము ప్రకారము జరిగించు."

అకస్మాత్తుగా ఒక గుంపు యూదా నేతృత్వంలో తోటలోకి ప్రవేశించిరి. యేసు వారిని అడుకోలేదు, కానీ పేతురు ఒక వ్యక్తి చెవిని నరికివేశాడు. నెమ్మదిగా, యేసు ఆ వ్యక్తి చెవిని తాకి అతనిని స్వస్థపరిచాడు. తను పట్టుబడుట దేవుని చిత్తంలో భాగమేనని యేసుకు తెలుసు.

ఆ గుంపు యేసును ప్రధాన యాజకుని ఇంటికి తీసుకు వెళ్ళెను. అక్కడ, యూదుల నాయకులు యేసు చనిపోవాలని చెప్పారు. సమీపంలో,సైనికులు చలి కాసుకుంటూ ఉన్న మంటల పక్కన పేతురు నిలబడి చూసెను. అక్కడ ప్రజలు పేతురు వైపు తెరి చూసి మూడు సార్లు ప్రజలు పేతురు, అడిగెను "నువ్వు యేసుతో ఉన్నావు!" యేసు చెప్పినట్లే పేతురు దానిని మూడుసార్లు నిరాకరించాడు. పేతురు శపించి మరియు ప్రమాణాము కూడా చేశాడు.

అప్పుడే కోడి కూసింది. అది పేతురుకు దేవుని స్వరంలా అనిపించెను. పేతురు యేసు మాటలు గుర్తుకు తెచ్చుకొని ఏడ్చేను.

యూదా కూడా పశ్చాత్తాపము పడెను. యేసు ఏ పాపము తప్ప చేయలేదు అని అతనికి తెలుసు. యూదా ఆ 30 వెండి నాణేలను వెనక్కి ఇచ్చుటకు, కానీ యాజకులు దానిని తీసుకోలేదు.

యూదా ఆ డబ్బును కిందకు విసిరి, బయటకు వెళ్లి - ఉరి వేసుకున్నాడు.

యాజకులు యేసును రోమా గవర్నరు అయిన పిలాతు దగ్గరికి తీసుకొచ్చారు. పిలాతు, “ఈ మనిషిలో నాకు ఎలాంటి తప్పు కనిపించలేదు” అన్నాడు. కానీ ఆ గుంపు "అతన్ని సిలువ వేయండి, సిలువ వేయండి!" కేకలు వేసిరి.

చివరకు యేసును సిలువ వేసి చంపుటకు పిలాతు అంగీకరించాడు. సైనికులు యేసును కొట్టారు, ఆయన ముఖం మీద ఉమ్మి, కొరడాలతో కొట్టారు. వారు పొడవాటి పదునైన ముళ్ళతో క్రూరమైన కిరీటాన్ని చేసి ఆయన తలపై పెట్టి గట్టిగా నొక్కారు. అప్పుడు వారు ఆయన చనిపోవడానికి ఆయనని ఒక చెక్క సిలువకు మేకులు కొట్టి వ్రేలాడదీశారు.

తాను ఆ విధముగా చనిపోవును అని యేసుకు ఎప్పుడూ తెలుసు. ఆయన పై నమ్మకం ఉంచిన పాపులకు ఆయన మరణం ద్వారా క్షమాపణ కలుగుతుంది అని ఆయనకు తెలుసు. యేసు పక్కన ఇద్దరు దొంగలు సిలువ వేయబడ్డారు. ఒకడు యేసును విశ్వసించి - పరదైసుకు వెళ్ళాడు. మరొకరు విశ్వసించలేకపోయెను.

గంటల తరబడి శ్రమలు భరించిన తర్వాత, యేసు, "సమాప్తమైనది" అని చెప్పి మరియు మరణించాడు. ఆయన పని పూర్తయింది. ఆయన స్నేహితులు వేరే ఒకరి సమాధిలో పాటిపెట్టారు.

అప్పుడు రోమా సైనికులు సమాధిపైన ముద్ర వేసి వేసి కాపలాగా ఉన్నారు. సమాధి లోపలికి - బయటకు ఎవరు రాకుండా..

ఇంతటితో కథ ముగిస్తే ఎంత బాధగా ఉంటుంది. కానీ దేవుడు ఒక అద్భుతం చేశాడు. యేసు చనిపోయిన వానిగా ఉండలేదు.

వారంలోని మొదటి రోజు తెల్లవారుజామున, యేసు శిష్యులలో కొందరు సమాధి నుండి రాయి దొర్లినట్లు గుర్తించారు. వారు లోపలికి చూసేసరికి, యేసు అక్కడ ఎంత మాత్రము లేరు.

ఒక స్త్రీ సమాధి దగ్గరే ఉండి ఏడుస్తూ ఉండిపోయింది. యేసు ఆమెకు ప్రతక్షమాయెను! ఆమె ఇతర శిష్యులకు ఈ సంగతి చెప్పడానికి ఆనందంగా పరుగెత్తింది. "యేసు సజీవంగా ఉన్నాడు! యేసు మృతులలో నుండి తిరిగి లేచెను!"

వెంటనే యేసు శిష్యుల దగ్గరకు వచ్చి ఆయన మేకులతో దిగగొట్టబడిన చేతులను వారికి చూపించెను. ఇది నిజమైంది. యేసు మళ్లీ సజీవంగా ఉన్నాడు! తనను తిరస్కరించినందుకు పేతురును క్షమించి, తన శిష్యులకు తన గురించి అందరికీ చెప్పమని చెప్పాడు. అప్పుడు ఆయన ఎక్కడ నుండి వచ్చెనో అక్కడకి స్వర్గానికి తిరిగి వెళ్ళెను.

ముగింపు

వాక్యము

రోజు 5రోజు 7

ఈ ప్రణాళిక గురించి

పిల్లలు కోసం బైబిలు

అది ఎలా మొదలైంది? మేము ఎక్కడ నుండి వచ్చాము? ఎందుకు ప్రపంచంలో చాలా కష్టాలను ఉంది? ఏదైనా ఆశ ఉందా? మరణం తరువాత జీవితం ఉందా? ప్రపంచంలోని ఈ నిజమైన చరిత్ర చదివేటప్పుడు సమాధానాలను కనుగొనండి.

More

ఈ ప్లాన్‌ని అందించినందుకు మేము XXకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మరింత సమాచారం కోసం, దయచేసి సందర్శించండి: https://bibleforchildren.org/languages/telugu/stories.php