పిల్లలు కోసం బైబిలునమూనా
దేవుడు ప్రతీ దానిని చేసెను! దేవుడు మొదటి నరుని సృష్టించి, ఆదాము, అతని భార్య అవ్వతో కలిసి ఏదేను వనములో జీవించిరి. వారు పరిపూర్ణమైన ఆనందంతో దేవునికి విధేయత చూపుతూ, మరియు ఆయన సన్నిధినిలో ఒకానొక దినము వరకు ఉన్నారు.
“ఈ చెట్లలో దేని ఫలమునైనను మీరు తినకూడదని దేవుడు చెప్పాడా?” అని సర్పము అవ్వను అడిగెను. “ఈ తోటలోని ప్రతీ చెట్ల ఫలములను మేము తినవచ్చు ఒకటి తప్ప’’ అని ఆమె చెప్పెను. “మేము ఆ ఫలముని ముట్టినా లేదా తినినా, చనిపోతము.’’ “మీరు చనిపోరు అని సర్పము మోసపూరితమైన నవ్వుతో అనెను.
మీరు దేవుని వలే అవుతారు. “అవ్వ ఆ చెట్టు ఫలము కావాలనుకొన్నది. ఆమె సర్పము మాటలు వినెను మరియు ఆ ఫలమును తినెను.
అవ్వ దేవునికి అవిధేయత చూపిన తర్వాత ఆమె ఆదామును కూడా పండు తినేలా చేసింది. "లేదు! నేను దేవుని మాటను ఉల్లంఘించను" అని ఆదాము చెప్పి ఉండాలి.
ఆదాము మరియు అవ్వ పాపము చేసిన తరువాత, వారు తాము దిగంబరులమని తెలుసుకొని, అంజూరపు ఆకులను ఉపవస్త్రంగా కుట్టి, తమను తాము కప్పుకుని, దేవుని సన్నిధి నుండి తొలగి పొదలో దాక్కున్నారు.
చల్లని సాయంకాలమున దేవుడు తోటలోనికి వచ్చాడు. ఆదాము మరియు అవ్వ ఏమి చేశారో ఆయనికి తెలుసు. ఆదాము అవ్వను నిందించాడు. అవ్వ సర్పాన్ని నిందించింది. దేవుడు పలికెను, "పామును శపించటం జరిగింది. స్త్రీ ప్రసవ వేదనతో పిల్లలను కంటుంది."
ఆదామ నీ పాపము నిమిత్తము భూమి శపించబడి ముండ్ల తుప్పలు, గచ్చిపొదలను మోలిపించును. నీవు ప్రతి దినం శ్రమించి చెమటూర్చి ఆహారము తిందువు.
దేవుడు ఆదాము మరియు అవ్వను అద్భుతమైన తోట నుండి బయటకు వెళ్ళగొట్టెను. వారు పాపము చేసినందున, వారు జీవమిచ్చు దేవుని నుండి వేరు చేయబడ్డారు!
దేవుడు వారిని బయట మండే ఖడ్గాన్ని చేశాడు. దేవుడు ఆదాము మరియు అవ్వ కోసం చర్మంతో బట్టలు చేసాడు. దేవుడు చర్మముని ఎక్కడ నుండి తెచ్చెను?
ఆ సమయములో, ఆదాము మరియు అవ్వ ఒక కుటుంబంగా పుట్టింది. వారి మొదటి కుమారుడు కైయీను తోటమాలి. వారి రెండవ కుమారుడు హేబేలు గొర్రెల కాపరి.
ఒకరోజు కైయీను దేవునికి కానుకగా కొన్ని కూరగాయలు తెచ్చాడు. హేబెలు తన గొర్రెలలో కొన్నింటిని దేవునికి బహుమతిగా తెచ్చాడు. హేబెలు బహుమతికి (అర్పణ) దేవుడు సంతోషించాడు.
దేవుడు కైయీను బహుమతిని (అర్పణ) లక్ష్యపెట్టలేదు. కైయీనుకు చాలా కోపం వచ్చింది. కానీ దేవుడు, "నీవు సరైనది చేస్తే, నీవు అంగీకరించబడకుండువా?"
కైయీను కోపం చల్లారలేదు. కొంత సమయం తర్వాత అతడు మైదానంలో హేబెలు పైన పడి దాడి చేసి – మరియు అతనిని చంపాడు!
దేవుడు కైయీనుతో మాట్లాడేను. "నీ తమ్ముడైన, హేబెలు ఎక్కడ ఉన్నాడు?" "నాకు తెలియదు అని," కైయీను అబద్ధం చెప్పాడు. "నేను నా తమ్మునికి కావాలి వాడిన అనెను?" దేవుడు కైయీను వ్యవసాయం చేసే సామర్థ్యాన్ని తీసివేసి, అతన్ని ఒక దేశ దిమ్మరిగా శిక్షించాడు.
కైయీను యెహోవా సన్నిధి నుండి వెళ్ళిపొయెను. అతను ఆదాము మరియు అవ్వ కుమార్తెను వివాహం చేసుకున్నాడు. వారు కుటుంబముగా ఎదిగెను. కైయీను మనమళ్ళతో మరియు మునిమనమళ్ళతో ఆతను కనుగొన్న పట్టణమును త్వరగానింపెను.
అదే సమయములో ఆదాము, అవ్వల కుటుంబము త్వరగా పెరిగింది. ప్రజలు ఈరోజులో కంటే ఆరోజులో ఎక్కువ కాలం జీవించేవారు.
అవ్వకు కుమారుడైన షేతు జన్మించినప్పుడు, అవ్వ, "దేవుడు నాకు హేబెలు ప్రతిగా షేతుతను ఇచ్చాడు" అని చెప్పింది. షేతు దైవభక్తిగల వ్యక్తి గా 912 సంవత్సరాలు జీవించి మరియు చాలా మంది పిల్లలను కలిగి ఉండెను.
ప్రపంచంలోని, ప్రజలు అందరు ఒక తరం వెంబడి మరొక తరం బహుగా చెడిపోయారు. చివరకు, దేవుడు మానవజాతిని నాశనం చేయాలని నిర్ణయించుకున్నాడు మరియు అన్ని జంతువులు మరియు పక్షులు కూడా. దేవుడు మనిషిని చేసినందుకు పశ్చతాపడెను. కానీ ఒక వ్యక్తి దేవుణ్ణి సంతోషపరిచెను.
ఈ మనిషి నోవహు. షేతు వంశస్థుడైన నోవహు నీతిమంతుడు మరియు నిర్దోషి. అతను దేవునితో నడిచినవాడు. అతను తన ముగ్గురు కొడుకులకు కూడా దేవునికి విధేయులై ఉండుట నేర్పించెను. అప్పుడు దేవుడు నోవాను చాలా విచిత్రమైన మరియు ప్రత్యేకమైన రీతిలో ఉపయోగించుకొనుటకు ప్రణాళిక చేసాడు!
ముగింపు
వాక్యము
ఈ ప్రణాళిక గురించి
అది ఎలా మొదలైంది? మేము ఎక్కడ నుండి వచ్చాము? ఎందుకు ప్రపంచంలో చాలా కష్టాలను ఉంది? ఏదైనా ఆశ ఉందా? మరణం తరువాత జీవితం ఉందా? ప్రపంచంలోని ఈ నిజమైన చరిత్ర చదివేటప్పుడు సమాధానాలను కనుగొనండి.
More
ఈ ప్లాన్‌ని అందించినందుకు మేము XXకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మరింత సమాచారం కోసం, దయచేసి సందర్శించండి: https://bibleforchildren.org/languages/telugu/stories.php