హృదయ శత్రువులునమూనా
ఆండీ స్టాన్లీ:హృదయము యొక్క శత్రువులు
ఆధ్యాత్మిక సందేశం మొదటి రోజు
"మండుచున్న అగ్ని పర్వతం"
వాక్యము: మత్తయి 15:1-20
మన యొక్క ప్రవర్తనను పరిశీలన చేసుకోవటానికి సిద్ధముగా ఉంటాము కాని చాలా వరకు మన హృదయాలను విస్మరిస్తాము. అయినా, మన యొక్క హృదయాలను ఎలా పరిశీలన చేసుకొనగలము? నా ప్రవర్తనలో ఏదైనా లోపముందని ఎవరైనా తెలియజేస్తే తప్ప నేను ప్రవర్తన గురించి పట్టించుకోను. కాని నా హృదయమును గురించి ఎలా? ఇది కొంచెం కష్టతరముగానే ఉండవచ్చును.
ఈ కాలమునకు కూడా ఎంతగానో ఉపయోగపడునట్లుగా యేసు దీని గురించి ఈ విధంగా తెలియజేసెను: "నోటనుండి బయటికి వచ్చునవి హృదయములోనుండి వచ్చును," అని మరియు, "హృదయములో నుండియే దురాలోచనలు వచ్చును."
హృదయము అటువంటి గూఢ భావము గలది. అందుకే, హృదయమును గురించి ఒక ప్రవక్త ఇలా అడిగెను, "దాని గ్రహింపగలవాడెవడు?" (యిర్మియా 17:9). మంచి ప్రశ్న. దానికి సమాధానమేమంటే ఎవరు గ్రహించలేరు. దీనితో నేను కూడా పూర్తిగా ఏకీభవిస్తాను. ఒకవేళ మనము దాన్ని గ్రహించుటకు ప్రయత్నించినప్పటికి, ఖచ్చితముగా దానిని నియంత్రణ చేయలేము-ఆ కారణము చేతనే మనము దానిని పరిశీలన చేసుకోవాల్సిన అవసరత ఉంది. నిద్రాణమైన అగ్నిపర్వతం యొక్క భూకంప చర్య వలె, నీకు తెలియనిది దేదైనా నిన్ను హాని చేయవచ్చును.
అకస్మాత్తుగాడివోర్స్ కోసం ఎవరైనా ఫైల్ చేయవచ్చును.
అకస్మాత్తుగా పిల్లలకు మార్కులు తగ్గి వారి ప్రవర్తనలో మార్పురావచ్చును.
అకస్మాత్తుగాకాలక్షేపం కోసం చేసే పనే ఒక నాశనకరమైన అలవాటుగా మారును.
మనము ఊహించని విధంగా మనకి ప్రియమైన వారి నుండి మన హృదయాన్ని గాయపరచే సూటిపోటి మాటలు వినవచ్చును.
మనమందరము వాటిని చూసి యుంటాము, అనుభవించి యుండవచ్చు, లేక మనమే చేసి యుండవచ్చును. యేసు ఊహించిన విధంగా, మన హృదయాల్లో రహస్యంగా ప్రారంభమైన దేది కూడా ఎల్లకాలం రహస్యంగా ఉండలేదు. ఎప్పుడోకప్పుడు, అది మన ఇంటిలోనో, ఆఫీస్ లోనో లేక మన చుట్టుప్రక్కల వారి దగ్గరైన బయటకి వచ్చును.
మన యొక్క ప్రతి సంభాషణలోనూ హృదయము దాని యొక్క గుర్తుని విడిచిపెడుతుంది. మన యొక్క ప్రతి సంబంధమును అది నిర్ధారిస్తుంది. అసలు మన యొక్క జీవన విధానాలు హృదయము నుండే ఉద్భవించును. హృదయమును బట్టే మనము జీవిస్తాము, పిల్లలను పెంచుతాము, అర్థము చేసుకుంటాము, పరిస్థితులను ఎదుర్కొంటాము, ప్రతిస్పందిస్తాము, సూచిస్తాము, నిర్వహిస్తాము, సమస్యలను పరిష్కరిస్తాము మరియు ప్రేమిస్తాము కూడా. మన సంభాషణ యొక్క తీవ్రతపై కూడా హృదయములే ప్రభావము చూపించును. మన హృదయాలు మన సున్నితత్వాన్ని మరియు కటినత్వాన్ని ఎక్కువ చేయగల సామర్థ్యాన్ని కలిగి యుండును. మన జీవితంలోని ప్రతి అంశము కూడా మన హృదయాంతరంగాలలో జరిగే దానిని బట్టే ప్రభావితం చేయబడును. పరిస్థితులు ఏ మార్గములో వెళ్ళినా అవి దీని మార్గం గుండానే వెళుతుంది. ప్రతిదీ కూడా.
మన హృదయాలను కనిపెట్టుకొనుట కొరకు, అర్థము చేసుకొనుట కొరకు మరియు పవిత్రపరచుకొనుటకు మన పరలోకపు తండ్రి యొక్క సహాయాన్ని కోరుటకు మనకు ధైర్యము కావాలి. మన హృదయము యొక్క పాత చెడ్డ అలవాట్లను తీసివేసి నూతనమైన మంచి వాటితో భర్తీ చేసి సమయము గడుస్తూ ఉండంగా తన కుమారుని సారూప్యము లోనికి తీసుకు వచ్చుటకు ఆయన ఎంతో ఆనందంగా ప్రతిస్పందించును.
తదుపరి నాలుగు రోజుల ఆధ్యాత్మిక సందేశములలో, మనలో ప్రతి ఒక్కరి హృదయాలు ఎదుర్కొనే నాలుగు శత్రువులను గూర్చి మనము చూచెదము.
ఇటీవలి కాలంలో మీ ఆలోచనలు, మాటలు మరియు చర్యలు మీ హృదయంలో ఏమి జరుగుతుందని బహిర్గతం చేస్తున్నాయి? మీకు సన్నిహితంగా ఉండే వ్యక్తిని కూడా దీనిని గురించి అడగండి.
వాక్యము
ఈ ప్రణాళిక గురించి
ఏ విధముగానైతే శారీరకంగా బలహీనంగా ఉన్న హృదయము మన శరీరమును ఎలా నాశనము చేయగలదో, అదే విధంగా ఆత్మీయంగా మరియు భావోద్వేగాల పరంగా బలహీనంగా ఉన్న హృదయము కూడా మనలను, మన సంబంధ బాంధవ్యాలను నాశనము చేస్తుంది. తదుపరి ఐదు రోజులలో, ప్రతి హృదయమునకు సహజముగా ఉండే నాలుగు శత్రువులైన - అపరాధభావము, కోపము, దురాశ మరియు మత్సరము- వంటి వాటిని మన అంతరంగములో పరిశీలన చేసికొనుటకు ఆండీ స్టాన్లీ గారు మీకు సహాయపడుతూ, వాటిని ఎలా తొలగించుకొనవలెనో మీకు నేర్పించును.
More