హృదయ శత్రువులునమూనా

Enemies Of The Heart

5 యొక్క 5

ఆండీ స్టాన్లీ:హృదయము యొక్క శత్రువులు

ఆధ్యాత్మిక సందేశం ఐదవ రోజు

"నీ హృదయవాంఛలను దేవుని యొద్దకు తీసుకువెళ్ళుట"

వాక్యము: యాకోబు 4:1-3

హృదయము యొక్క ప్రతి శత్రువు కూడా ఎవరొకరు ఏదోకదానిని అచ్చియుండుట లేక రుణపడుట అనే ఆలోచనను బట్టి ప్రభావితం చేయబడెను. "నీవు నాకు రుణపడి యున్నావు", అని అపరాధభావము అనును. నీవు నాకు అచ్చియున్నావనే భావనను బట్టి కోపము రగిలింపబడెను. ఇదే అభిప్రాయము అత్యాశను కూడా సజీవంగా ఉండేలా చేసింది. హృదయము యొక్క ఈ నాల్గవ సమస్యలో కూడా పెద్ద తేడా ఏమి లేదు. అసూయ లేక మత్సరము. "దేవుడే నాకు అచ్చియున్నాడు", అని అసూయ/మత్సరము చెప్పును.

అసూయ లేక ఈర్ష్య గురించి మనం ఆలోచించినప్పుడు - ఇతరులకు ఉండి మనకు లేని అందం, నైపుణ్యతలు, అవకాశాలు, ఆరోగ్యము, ఎత్తు, స్వాస్థ్యము లాంటి మరెన్నో సంగతుల గురించి వెంటనే ఆలోచిస్తాము. మనకు లేనిదాన్ని కలిగి ఉన్న వ్యక్తితో మన సమస్య ఉందని మనము అనుకుంటాము. కాని దీని గురించి ఆలోచిద్దాం; దేవుడు దీననంతటిని మన కొరకు తీర్చవచ్చు లేక ఇవ్వవచ్చు. నీ పొరుగువానికి ఆయన ఏమి ఇచ్చాడో, ఆయన అది నీకు కూడా ఇవ్వగలడు. బహుశా అందుకే నీవు లోలోపల ఆయన నీకు అచ్చియున్నాడని అనుకుని యుండవచ్చును.

అసూయ మీ జీవితాన్ని భయకంపితులను చేయును మరియు మీ సంబంధాలలో వినాశనాన్ని కలిగించును. శుభవార్త ఏమనగా, ఈ క్రూర మృగము కూడా మిగతా మూడిటి వలె హానికరమైనదే కాని దాని పరిష్కారము కూడా సులువే మరియు దాన్ని నీవు అసలు ఊహించియుండవు, అదేమనగా: ఇతరులు కలిగి ఉన్నదాన్ని కోరుకోవడం మానివేసి, మీకు ఏది ఉత్తమమో తెలిసిన దేవునిని అడగటం ప్రారంభించటమే.

యాకోబు తెలిపినట్లుగా, మన యొక్క బాహ్య పోరాటములనునవి మన అంతరంగ సంఘర్షణల ప్రత్యక్ష ఫలితములై యున్నవి. మనకి ఎదో కావాలి కాని మనము దాని పొందలేదు, కావున మనము ఇతరులతో గొడవలకి వెళ్తాము. యాకోబు ఈ వాక్యభాగములో తెలిపిన తృప్తిచెందని దాహములను చూపే కోరికలేమనగా - ధనము, వస్తువులు, గుర్తింపు, విజయం, పురోగతి, సాన్నిహిత్యం, సెక్స్, సరదా, సంబంధం, భాగస్వామ్యం కోసం మనము పడే తాపత్రయము.

కాబట్టి ఏనాటికి పూర్తిగా సంతృప్తి చెందలేని ఈ కోరికలు మరియు తాపములతో మనం ఏమి చేయాలి? మనలో వాటిని మొదటిస్థానములో ఉండేలా సృష్టించిన వాని యొద్దకు తీసుకువెళ్ళమని యాకోబు చెప్తున్నాడు. మరొక విధంగా చెప్పాలంటే, మన సృష్టికర్తతో మోమాటం లేకుండా మన హృదయాలను కుమ్మరించుకొనుమని యాకోబు మనకి అనుమతి ఇస్తున్నాడు.

మీకు ఉన్న ప్రతి చింత, అది చిన్నదైనా, పెద్దదైనా అది నీ పరమతండ్రికి సంబంధించినది ఎందుకనగా నీవు ఆ పరమతండ్రికి సంబంధించిన వ్యక్తివి. అది నీ ప్రేమకు సంబంధించిన దైననూ, నీ వృత్తిపరంగా నైననూ, నీ వివాహము గురించైననూ, నీ పిల్లల విషయమైననూ, నీ తల్లిదండ్రుల విషయమైననూ, నీ ఆర్థిక పరిస్థితుల గురించైననూ, నీ విద్య గురించైననూ లేక నీ వెలా ఉన్నావో అన్న విషయమైననూ ఆయన యొద్దకు తీసుకుని రండి. మీ మోకాళ్ళ నుండి లేవడానికి మీకు సమాధానము లభించే వరకు దానిని ఆయన వద్దకు తీసుకువచ్చిన తరువాత ఆయన నీ గురించి పట్టించుకుంటాడనే ఆలోచనలో నిశ్చింతగా ఉండి నీ రోజును ఎదుర్కొనుము.

నేను మీకు ఖచ్చితంగా చెప్తున్నాను, మీ హృదయము ఆయన హృదయమునకు ఎంతో ప్రియమైనది.

మీ హృదయము దేని విషయమై బాధ పడుచున్నది? మీరు దేని విషయములో కొరతగా ఉన్నదని భావిస్తున్నారో దాని విషయమై దేవునితో పూర్తి స్వేచ్చగా సంభాషించుటకు కొంత సమయము గడపండి. నీకేది ఉత్తమమని ఆయనకు తెలియునో దానితో మిమ్ములను దీవించమని - మరియు ఈ మార్గములో నీ పట్ల ఆయనకున్న ప్రేమను వెల్లడి చేయమని కోరండి.

ఆండీ గారి "హృదయ శత్రువులు" అనే ఈ 5-రోజుల యూవెర్సిన్ యొక్క ఆధ్యాత్మిక సందేశమును మీరు ఆనందించారని మేము ఆశిస్తున్నాము. మీకు దగ్గరున్న రీటైలర్ వద్ద,, Enemies of the Heart, అను ఆండీ గారి పుస్తకమును కొని ఇంకా లోతుగా చదువుట ద్వారా మీ జీవితంలో దీర్ఘ-కాల స్వస్థత మరియు సమకూర్పును పొందుకొనండి.

వాక్యము

రోజు 4

ఈ ప్రణాళిక గురించి

Enemies Of The Heart

ఏ విధముగానైతే శారీరకంగా బలహీనంగా ఉన్న హృదయము మన శరీరమును ఎలా నాశనము చేయగలదో, అదే విధంగా ఆత్మీయంగా మరియు భావోద్వేగాల పరంగా బలహీనంగా ఉన్న హృదయము కూడా మనలను, మన సంబంధ బాంధవ్యాలను నాశనము చేస్తుంది. తదుపరి ఐదు రోజులలో, ప్రతి హృదయమునకు సహజముగా ఉండే నాలుగు శత్రువులైన - అపరాధభావము, కోపము, దురాశ మరియు మత్సరము- వంటి వాటిని మన అంతరంగములో పరిశీలన చేసికొనుటకు ఆండీ స్టాన్లీ గారు మీకు సహాయపడుతూ, వాటిని ఎలా తొలగించుకొనవలెనో మీకు నేర్పించును.

More

ఈ ప్రణాళికను మాకు అందించినందుకు Andy Stanley and Multnomah వారికి మా కృతజ్ఞతలు. మరింత సమాచారం కోసం bit.ly/2gNB92i దర్శించండి