హృదయ శత్రువులునమూనా
ఆండీ స్టాన్లీ:హృదయము యొక్క శత్రువులు
ఆధ్యాత్మిక సందేశం రెండవ రోజు
"ఒప్పుకోలు"
వాక్యము: 1 యోహాను 1:5-10
హృదయము యొక్క మొదటి శత్రువు అపరాధ భావము. మనం తప్పుగా భావించిన పనిని చేసిన దానిబట్టి వచ్చే ఫలితమే అపరాధ భావమై యున్నది. ఈ అపరాధ భావమును మోయుచున్న హృదయము నుండి వచ్చే సందేశము, "నేను ఋణస్థుడను!"
తన కుటుంబాన్ని వదిలివేసి పర స్త్రీ వెంబడివెళ్ళిన ఒక వ్యక్తిని గమనించండి. ఆ సమయంలో అది గ్రహించకుండా, అతను తన కుటుంబంలోని ప్రతి సభ్యుని నుండి ఏదో దొంగిలించాడు. అతను తన భార్య యొక్క భవిష్యత్తును. ఆమె ఆర్ధిక భద్రతను మరియు ఒక భార్యగా ఆమెకున్న మర్యాదను దొంగలించాడు. తన పిల్లల దృక్పధ విషయానికొస్తే, ఈ వ్యక్తి తమ యొక్క క్రిస్మస్, సంప్రదాయాలను, కుటుంబంతో కలిసి చేసే భోజనాలు మరియు తమ యొక్క భావోద్వేగ మరియు ఆర్థిక భద్రత లాంటి ఎన్నిటినో అతను దొంగలించాడు.
ఇప్పుడు, ఇదంతా చేసిన ఆ వ్యక్తికి తానేమి తీసుకొని పోతున్నాననే దాని గురించి అసలు ఆలోచించడు. మొదట్లో, అతను కేవలం తానేమి పొందుకున్నాడో అన్న దాని గురించే ఆలోచిస్తాడు. కాని మొట్టమొదటి సారిగా, అమ్మను నువ్వెందుకు ఇదివరకటిలా ప్రేమించట్లేదని తన చిన్నారి పాప అడిగినప్పుడు, అతని హృదయము స్పందించింది. ఇప్పుడు అతను అపరాధం చేసానని భావిస్తున్నాడు. ఆ తండ్రి రుణ పడ్డాడు.
ఆ రుణాన్ని చెల్లించడం కంటే తక్కువ ఏదీ కూడా ఆ అపరాధ హృదయానికి అపరాధ భారం నుండి ఉపశమనం కలిగించదు. ప్రజలు దీనిని తొలగించుకోవడానికి మంచి పనులు చేస్తారు, పరిచర్య చేస్తారు, ఉదారంగా ఇస్తారు, ఇంకా ప్రార్థిస్తారు కూడా. కాని ఎంత మంచి కార్యములు చేసినా, సమాజ సేవ చేసినా, ఎంతగా విరాళాలు ఇచ్చినా, లేక ఆదివారాలు ముందు బల్లలో కూర్చున్నా కూడా ఆ అపరాధము నుండి ఉపశమనం కలిగించవు. అది ఒక రుణము లేక బాకీ. ఆ అపరాధ హృదయానికి ఉపశమనం కలిగించడానికి అది చెల్లించనైనా చెల్లించాలి లేదా రద్దు అయినా చేయబడాలి.
నీ యొక్క అపరాధమును నీవు ఎలా రద్దుపరచుకొనగలవు? దీనికి సమాధానము నేను చిన్నతనములో కంఠత చేసిన మొదటి బైబిల్ వాక్యమై యున్నది: 1 యోహాను1:9 "మన పాపములను మనము ఒప్పుకొనినయెడల, ఆయన నమ్మదగినవాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్ణీతినుండి మనలను పవిత్రులనుగా చేయును".
పాపము యొక్క చక్రమును తెంపగల శక్తి ఒప్పుకోలునకు ఉన్నది. చాల వైద్య ఉపశమనముల వలె ఇది కూడా, సరిగా అవలంబించినప్పుడు చక్కగా పని చేస్తుంది. మన పాపాలను దేవునికి మాత్రమే కాకుండా, మనం పాపం చేసిన వ్యక్తులకు కూడా అంగీకరించినప్పుడు మాత్రమే సరైన అవలంబన జరుగుతుంది.
అపరాధము చేసిన వ్యక్తులు తరచుగా మళ్ళీ మళ్ళీ తప్పులు చేస్తారు. ఆ రహస్యాన్ని నీవు ఎంత కాలము దాచిపెడతావో, నీవెంతగా బాధపడుతున్నావో అని దేవునికి చెబుతూ నీ మనస్సాక్షిని తేలిక పరచటానికి ప్రయత్నిస్తున్నావో, అంతగా నీవు ఆ గతాన్ని పునరావృతం చేయటానికి నీవు సంసిద్ధమవుతావు. ఏదేమైనప్పటికి, మీరు పాపం చేసిన వ్యక్తులతో మీ పాపాలను అంగీకరించడం ప్రారంభినట్లయితే, మీరు తిరిగి వెళ్లి ఆ పాపాలకు పాల్పడరు.
దేవునికి మరియు నీవల్ల గాయపడిన వ్యక్తులకు కూడా నీ పాపాలు ఒప్పుకొనుము, తద్వారా నీ హృదయము యొక్క ఈ శత్రువును చంపివేయగలవు.
దేని విషయములో నీవు అపరాధ భావమును అనుభవిస్తున్నావు? దేవునికి మరియు నీవు ఎవరినైతే గాయపరచావో వారికి నీ పాపమును ఒప్పుకొనుము. ఈరోజే అది చేయి.
వాక్యము
ఈ ప్రణాళిక గురించి
ఏ విధముగానైతే శారీరకంగా బలహీనంగా ఉన్న హృదయము మన శరీరమును ఎలా నాశనము చేయగలదో, అదే విధంగా ఆత్మీయంగా మరియు భావోద్వేగాల పరంగా బలహీనంగా ఉన్న హృదయము కూడా మనలను, మన సంబంధ బాంధవ్యాలను నాశనము చేస్తుంది. తదుపరి ఐదు రోజులలో, ప్రతి హృదయమునకు సహజముగా ఉండే నాలుగు శత్రువులైన - అపరాధభావము, కోపము, దురాశ మరియు మత్సరము- వంటి వాటిని మన అంతరంగములో పరిశీలన చేసికొనుటకు ఆండీ స్టాన్లీ గారు మీకు సహాయపడుతూ, వాటిని ఎలా తొలగించుకొనవలెనో మీకు నేర్పించును.
More