హృదయ శత్రువులునమూనా
ఆండీ స్టాన్లీ:హృదయము యొక్క శత్రువులు
ఆధ్యాత్మిక సందేశం నాల్గవ రోజు
"ఎక్కడ అత్యాశ కలిగియున్నావో కనిపెట్టుకొనుము"
వాక్యము: లూకా 12:13-21
హృదయము యొక్క మూడవ శత్రువు? లోభము లేక అత్యాశ. ఈ లోక సంపద మరియు వస్తువులు ఇంకా ఇంకా కావాలి అని అనిపిస్తున్నప్పుడు ఇది వచ్చును. "నాకు నేనే రుణపడి యున్నాను" అని అత్యాశ చెప్పును.
"మీరు ఏవిధమైన లోభమునకు ఎడమియ్యక జాగ్రత్తపడుడి" అని యేసు చెప్పెను. ఎందుకని? హృదయమునందు మనము ఇప్పుడు చూస్తున్న నాలుగు సమస్యలలో, లోభము అన్నిటిలోకేల్ల సున్నితమైనది. మనము గనుక పట్టించుకోకపోయినట్లయితే, లోభము మన హృదయములలో గూడు కట్టుకుని కొన్నేళ్ళ పాటు నివసించును. సహజముగా బలహీనపరిచే ఈ వ్యాధికి కావలి లేని హృదయము ఎక్కువగా గురవుతుంది. దీని రోగనిర్ధారణ చేయుట కష్టం-మరి ముఖ్యంగా స్వీయ-నిర్ధారణ ఇంకా కష్టం.
ఈ లోభమునకు ఆర్జ్యము పోసే మరొక అబద్ధాన్ని కూడా యేసు తెలియజేసెను: "ఒకని కలిమి విస్తరించుటవలన అది వాని జీవమునకు మూలముకాద"నెను. కాని ఈ విషయము అందరికి తెలియునా? ప్రజలు నిజంగా తమ జీవితాలను వారికి కలిగి యున్నదానితోనే సమానమని నమ్ముతారా? వీటికి సమాధానము కాదు మరియు అవును అని చెప్పాలి. మొదటిప్రశ్నకి 'కాదు', ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఈ విషయమును గూర్చి తెలియదు. రెండవదానికి 'అవును', ఎందుకనగా నీవేమి కలిగియున్నావనే దానిపైనే నీ జీవితం ఆధారపడి యున్నదని నమ్మే ప్రజలు ఉన్నారు. మరియు ఈనాడు మనలో చాలా మంది కూడా ఇటువంటి నమ్మికనే కలిగి యుండటానికి అలవాటు పడిపోయారు.
తనకోసం ఇహలోకంలో వస్తువులను నిల్వ చేసుకునే వ్యక్తి దేవుని పట్ల ధనవంతులు కాలేరు: అని లోభి యొక్క నిర్వచనాన్నియేసు ఒక ఉపమానమును చెప్పిన తరువాత, ఇక్కడ చెప్పెను. యేసు యొక్క మాటలలో "దేవుని దృష్టిలో ధనవంతులంటే" అవసరతలో ఉన్నవారి పట్ల ఉదారస్వభావము కలిగియున్నవారే. లోభత్వము కలిగిన స్త్రీ లేదా పురుషుడు తమకొరకు చాలా జాగ్రత్తగా దాచిపెట్టుకుంటూ ఇవ్వటంలో చాలా కొద్దిగా ఇచ్చే వ్యక్తిగా ఉంటారు.
ఉదారంగా ఇవ్వడం అనునది మీ జీవితంపై దురాశకున్న పట్టును విచ్ఛిన్నం చేస్తుంది. కావున, నీకు కలిమి ఉన్నది అని అనుకున్నా లేకపోయినా, ఉదారంగా ఇవ్వండి. మీ జీవనశైలిలో సర్దుబాటు చేయుటకు మిమ్మల్ని బలవంతం చేసే స్థాయికి మీరు ఇచ్చేంత వ్యక్తిగా ఉండాలి. ఒకవేళ మీ జీవనశైలిని ప్రభావితం చేసేంతగా మీరు ఇచ్చేవారిగా ఉండనట్లయితే, యేసయ్య ప్రకారం, మీరు ఒక లోభిగా ఉన్నట్లే. ఒకవేళ నీ దగ్గర కేవలం కొద్దిగా మాత్రమే మిగుల్చుకుంటే లేక ఇచ్చుటకు అసలు ఏమి ఉంచుకోనట్లయితే నీకు దురాశ ఉన్నట్లే. ఒకవేళ మీరు ఇవ్వడానికి తక్కువగా మిగుల్చుకుంటూ లేదా అసలు ఏమీ మిగలనంత వరకు మీరు వినియోగిస్తు ఆదా చేస్తే, మీరు అత్యాశతో ఉన్నట్లే.
ఇది ధృడముగా చెప్పడమని నాకు తెలుసు. నిజానికి, అది చాలా కఠినం.
కాని ఇదే సత్యము.
ఉదారంగా ఇచ్చుట ద్వారా అత్యాశ యొక్క పట్టును విరుగగొట్టండి. జీవనంలో సమస్తమును మార్పు చేయగల ఒక మంచి అలవాటు ఇది.
గత సంవత్సరకాలంలో మీరు ఉదారంగా ఇచ్చిన దానిని ఒకసారి గమనించండి. మీ యొక్క ఉదార స్వభావము మీ హృదయమును గూర్చి ఏమని తెలియజేస్తుంది? రాబోయే సంవత్సరంలో మీ ఉదారత ఒక క్రొత్త దశలోకి వెళితే ఎలా ఉంటుందో అన్న దానిపై ప్రార్థనా పూర్వకముగా అడుగులు వేయండి.
వాక్యము
ఈ ప్రణాళిక గురించి
ఏ విధముగానైతే శారీరకంగా బలహీనంగా ఉన్న హృదయము మన శరీరమును ఎలా నాశనము చేయగలదో, అదే విధంగా ఆత్మీయంగా మరియు భావోద్వేగాల పరంగా బలహీనంగా ఉన్న హృదయము కూడా మనలను, మన సంబంధ బాంధవ్యాలను నాశనము చేస్తుంది. తదుపరి ఐదు రోజులలో, ప్రతి హృదయమునకు సహజముగా ఉండే నాలుగు శత్రువులైన - అపరాధభావము, కోపము, దురాశ మరియు మత్సరము- వంటి వాటిని మన అంతరంగములో పరిశీలన చేసికొనుటకు ఆండీ స్టాన్లీ గారు మీకు సహాయపడుతూ, వాటిని ఎలా తొలగించుకొనవలెనో మీకు నేర్పించును.
More