లోపల మరియు వెలుపల స్వస్థత!నమూనా

 లోపల మరియు వెలుపల స్వస్థత!

7 యొక్క 7

స్వస్థత జరగనప్పుడు

చాలా కాలంగా స్వస్థత కలుగుతుందని తలంచినప్పటికీ స్వస్థత రాని సందర్భాలు ఉండవచ్చు. ఒక వ్యక్తి కోసం మీరు చాలా కాలంగా ప్రార్థించినప్పటికీ వారికి స్వస్థత రాకపోవడం మీకు తెలిసి ఉండవచ్చు. ప్రజలు అనుభవించే కొన్ని విషయాలను అర్థం చేసుకోవడం కష్టం మరియు అన్నింటిలో దేవుని చిత్తం ఏమిటి అని అవగాహన చేసుకోవడం కష్టంగా ఉండవచ్చు. నిత్యత్వంలో ఇప్పుడు మనం స్వస్థతను పొందక పోయినప్పటికీ ప్రస్తుతమున్న అడ్డు తెరకు ఆవలి వైపు ఇక మీదట బాధ ఉండదు, కన్నీళ్లు గానీ శ్రమగానీ ఉండదు అని మనం నిశ్చయంగా చెప్పగలం. ఇది నాకు ఆదరణగా ఉంది, ఎందుకంటే భూమి మీద మన జీవితం నిత్యత్వం యొక్క విస్తారమైన విస్తీర్ణంలో ఒక అణువు మచ్చ మాత్రమే. ప్రభువైన యేసు అనుచరులముగా,మన నిత్యత్వం భద్రంగా ఉంది, “నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తు, చావైతే లాభం” అని యెరిగి మనం రేపటి దినాన్ని ధైర్యంగా ఎదుర్కొనవచ్చు (ఫిలిప్పీయులు 1:21).ప్రస్తుత సమయానికి, మనం శ్రమలు మరియు బాధల కఠినమైన కాలాల్లో నడుస్తున్నప్పుడు,వాటిని సహించడానికీ, మరియు విశ్వాసం మరియు బలమైన, మరింత శక్తివంతమైన ప్రకాశవంతమైన నిరీక్షణతో ముందుకు వెళ్ళడానికి దేవుడు తన కృపను అనుగ్రహిస్తాడనే నిశ్చయత కలిగి యుండండి. నిన్ను పేరు పెట్టి పిలిచిన దేవుణ్ణి విశ్వసిస్తూ ఉండండి,దేవుని వాక్యాన్ని ప్రకటిస్తూ ఉండండి. అన్ని సమయాలలోనూ సకల విధములైన ప్రార్థనలను చేస్తూ ఉండండి మరియు మీలో తన మంచి కార్యాన్ని జరిగించడానికి పరిశుద్ధ ఆత్మను అనుమతిస్తూ ఉండండి.

రోజు 6

ఈ ప్రణాళిక గురించి

 లోపల మరియు వెలుపల స్వస్థత!

ఈ అంశం మీద మనకు ప్రతిదీ తెలియకపోయినా,భూమి మీద ఉన్నప్పుడు ప్రభువైన యేసు పరిచర్యలో అధిక భాగం స్వస్థతతో నిండి ఉందని మనకు తెలుసు. మీరు ఈ బైబిలు ప్రణాళికను చదువుతూ ఉండగా,ఒక లోతైన మరియు సంపూర్ణమైన విధానంలో మీరు స్వస్థతను పొందాలని నేను ప్రార్థిస్తున్నాను. కేవలం అత్యంత గొప్ప వైద్యుడు మాత్రమే తీసుకురాగల స్వస్థత.

More

ఈ ప్రణాళికను అందించినందుకు క్రిస్టీన్ జయకరన్‌కు మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మరింత సమాచారం కోసం, దయచేసి సందర్శించండి:  https://www.instagram.com/christinegershom/://www.christinegershom.com/