లోపల మరియు వెలుపల స్వస్థత!నమూనా

 లోపల మరియు వెలుపల స్వస్థత!

7 యొక్క 3

ప్రభువైన యేసు గొప్ప వైద్యుడు

సువార్త వృత్తాంతాల నుండి, ప్రభువైన యేసు చేసిన స్వస్థపరచు పరిచర్యను గురించి మనం చూడవలసిన ప్రాముఖ్యమైన అంశాలు ఉన్నాయి.

ఆయన మనుష్యులకు ఎప్పుడూ తాత్కాలిక చికిత్సలు ఇవ్వలేదు. ఆయన ఈ ప్రజలను శాశ్వతంగా మార్చాడు!

ఆయన దయ్యాల రాజ్యం మీద పూర్తి ఆధిపత్యాన్ని కలిగి ఉన్నాడు మరియు దయ్యాల నుండి క్రమబద్ధీకరణను గానీ లేదా ధృవీకరణను గానీ ఎప్పుడూ ప్రోత్సహించలేదు.

రోగుల పట్ల ఆయనకు నిజమైన కనికరం ఉంది మరియు ఆయన వారిని స్వస్థపరిచాడు.

రోగుల పట్లా మరియు గాయపడిన వారి పట్లా ప్రభువైన యేసుకున్న కనికరం ఆయన ఎవరు అనే దాని లోతుల్లోంచి వచ్చింది. ఆయన సకల జీవుల సృష్టికర్తగా ఉండి, ఆయన సృష్టించిన వ్యక్తులను చూడాలనే అభిలాష కలిగి ఉన్నాడు, ఆరోగ్యం మరియు సంపూర్ణతతో కూడిన ప్రదేశానికి వారిని పునరుద్ధరించాడు.

ప్రభువైన యేసు మనుష్యులను నిత్యత్వం కోసం రక్షించడానికి ఈ భూమి మీదకు వచ్చినప్పుడు, వారు ఈ భూమి మీద పూర్తి సామర్థ్యంతో జీవించాలని కోరుకున్నాడు. తన సృష్టి పునరుద్ధరించబడి, మరియు దేవుని రాజ్యాన్ని భూమి మీదకు తీసుకురావడంలో వారు చేయగలిగింది చెయ్యాలని కోరుకుంటున్నాడు.

ప్రభువైన యేసు శరీరములో దేవుడై ఉండి పరిశుద్ధాత్మతో నిండి ఉన్నాడు మరియు దేవుని శక్తి ఆయన ద్వారా నిత్యమూ ప్రవహిస్తూ ఉంది. ఈ శక్తి ఆకస్మికంగా విడుదలైనప్పుడు, రోగులను స్వస్థపరచాడు, విరిగి నలిగిన వారిని పునరుద్ధరించాడు, బందీలుగా ఉన్న వారిని విడిపించాడు. ఆయన నిజముగా గొప్ప వైద్యుడు.

రోజు 2రోజు 4

ఈ ప్రణాళిక గురించి

 లోపల మరియు వెలుపల స్వస్థత!

ఈ అంశం మీద మనకు ప్రతిదీ తెలియకపోయినా,భూమి మీద ఉన్నప్పుడు ప్రభువైన యేసు పరిచర్యలో అధిక భాగం స్వస్థతతో నిండి ఉందని మనకు తెలుసు. మీరు ఈ బైబిలు ప్రణాళికను చదువుతూ ఉండగా,ఒక లోతైన మరియు సంపూర్ణమైన విధానంలో మీరు స్వస్థతను పొందాలని నేను ప్రార్థిస్తున్నాను. కేవలం అత్యంత గొప్ప వైద్యుడు మాత్రమే తీసుకురాగల స్వస్థత.

More

ఈ ప్రణాళికను అందించినందుకు క్రిస్టీన్ జయకరన్‌కు మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మరింత సమాచారం కోసం, దయచేసి సందర్శించండి:  https://www.instagram.com/christinegershom/://www.christinegershom.com/