లోపల మరియు వెలుపల స్వస్థత!నమూనా

 లోపల మరియు వెలుపల స్వస్థత!

7 యొక్క 1

మానవ-నిర్మిత చికిత్సలు,దేవుడు స్వస్థతను తీసుకువస్తాడు

స్వస్థత అనేది ఒక మర్మం. నిశ్చయమైన ఒక విషయం, మనం యెరిగిన, మనం ప్రేమించిన సజీవుడైన దేవుడు దానిని తీసుకువస్తాడు. స్వస్థతను తీసుకొని రావడానికి ఆయన ఎటువంటి మార్గాన్నైనా వినియోగిస్తాడు:

1. మన శరీరంలో దైవికంగా అంతర్నిర్మిత విధానాలతో పాటుగా పనిచేసే ఆధునిక ఔషధం ద్వారా,

2. మన శరీరాలలోని సహజ రోగనిరోధక వ్యవస్థలు మరియు గాయాన్ని స్వస్థపరచే ప్రక్రియల ద్వారా

3. లేదా ప్రార్థన ద్వారా సహజాతీతంగా.

నేను ఈ అంశాన్ని పునరుద్ఘాటిస్తాను,స్వస్థపరచు వాడు ఆయనే మాత్రమే! మనం సజీవంగా ఉన్నాము మరియు దీనినిచదువుతున్నాము అనే దానికి కారణం, సృష్టి కర్త, నిర్వాహకుడు, మరియు పునరుద్ధరించే ఆయన సర్వాధికారమే.

స్వస్థత ఏ విధంగా జరగాలి లేదా ఎప్పుడు జరగాలి అని మనం ఆయనకు నిర్దేశించలేము అని కూడా నేను వ్యక్తిగతంగా తెలుసుకున్నాను. ఏ విధానంలోనైనా ఆయన స్వస్థపరుస్తాడని సందేహం లేకుండా మనం విశ్వసించవచ్చు.

మహమ్మారి సమయంలో ఏదైనా గమనంలోనికి వచ్చినప్పుడు, లెక్కలేనన్ని నివారణలు, చికిత్సలు ఒకదాని వెనుక ఒకటి వచ్చాయి. శాశ్వత స్వస్థతను విస్మరిస్తూ నివారణలకు ఈ మానవత్వం అధిక ప్రాధాన్యతను ఇచ్చింది.

సుసాన్ హోవిచ్ తన "సంపూర్ణ సత్యాలు" గ్రంథంలో ఇలా రాశారు, "చికిత్స అనేది శారీరక అనారోగ్యం యొక్క బహిష్కరణను సూచిస్తుంది, అయితే స్వస్థత అంటే కేవలం భౌతిక చికిత్స మాత్రమే కాదు గానీఎటువంటి శారీరక చికిత్స సాధ్యం కాక పోయినప్పటికీ జీవిత నాణ్యతను మెరుగుపరచడానికి మనస్సునూ, ఆత్మనూ బాగుచేయడం మరియు బలపరచడం అని అర్థం."

లోక రక్షకుడైన యేసుక్రీస్తు చికిత్సలు చెయ్యడంలో కొనసాగ లేదు – ఆయన సంపూర్ణంగా స్వస్థత పరచడం విషయంలో మాత్రమే కొనసాగాడు. ఆయన దీనిని ఏవిధంగా చేస్తాడో మరియు ఎప్పుడు చేస్తాడో మనకు తెలియదు- అయితే ఆయన తాను మన గాయాలను స్వస్థపరుస్తాను అనీ, మన ఆరోగ్యాన్ని పునరుద్ధరిస్తానని చెప్పినట్లయితే ఆయన దానిని జరిగిస్తాడు! ఆయన సమయంలో, మరియు ఆయన విధానంలో.

రోజు 2

ఈ ప్రణాళిక గురించి

 లోపల మరియు వెలుపల స్వస్థత!

ఈ అంశం మీద మనకు ప్రతిదీ తెలియకపోయినా,భూమి మీద ఉన్నప్పుడు ప్రభువైన యేసు పరిచర్యలో అధిక భాగం స్వస్థతతో నిండి ఉందని మనకు తెలుసు. మీరు ఈ బైబిలు ప్రణాళికను చదువుతూ ఉండగా,ఒక లోతైన మరియు సంపూర్ణమైన విధానంలో మీరు స్వస్థతను పొందాలని నేను ప్రార్థిస్తున్నాను. కేవలం అత్యంత గొప్ప వైద్యుడు మాత్రమే తీసుకురాగల స్వస్థత.

More

ఈ ప్రణాళికను అందించినందుకు క్రిస్టీన్ జయకరన్‌కు మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మరింత సమాచారం కోసం, దయచేసి సందర్శించండి:  https://www.instagram.com/christinegershom/://www.christinegershom.com/