లోపల మరియు వెలుపల స్వస్థత!నమూనా

 లోపల మరియు వెలుపల స్వస్థత!

7 యొక్క 6

గాయపడిన క్రీస్తు ప్రతి గాయాన్ని స్వస్థ పరుస్తాడు

ప్రభువైన క్రీస్తు యేసులో, సిలువ మీద సంపూర్తి చేసిన కార్యము ద్వారా మన స్వస్థత ఇప్పటికే నియమించబడి ఉంది. శత్రువు మన ముందు అమర్చే ఉచ్చులు మరియు అడ్డంకుల కారణంగా ఆ స్వస్థత విషయంలో అర్హత కలిగియుండడం కష్టంగా అనిపిస్తుంది. సాతానుడు ఆరంభం నుండి మనిషి యొక్క మనస్సు,శరీరం మరియు ఆత్మకు హానిని కలిగిస్తూ వచ్చాడు. వాడు లోతైన గాయాన్ని కలిగించాడు,ఆ గాయం వ్యక్తులను పాపంలోనూ మరియు దుర్మార్గంలోనూ బంధించింది. సాతాను క్రియలను లయం చెయ్యడానికే దేవుని కుమారుడు ప్రత్యక్షం అయ్యాడు. (1 యోహాను 3:8)

మానవులలో గాయం స్వస్థపడడానికి ఐదు ఆవశ్యకమైన దశలు అవసరం. ఇటీవలి కాలంలో కొంతమంది రోగులలో గాయం స్వస్థపరచబడడంలో అసంపూర్ణత స్థాయి భయాన్ని కలిగించే స్థాయిలో ఉన్నట్లుగా గుర్తించబడింది. దీనికి కారణం సమృద్ధియైన ఆక్సిజన్ వాయువు తగినంతగా లేకపోవడం అది గాయాలకు సంపూర్ణ స్వస్థతను కలిగించకపోవడానికి కారణం అని శాస్త్రవేత్తలు ప్రతిపాదించారు. రక్తం ద్వారా తీసుకువెళ్ళబడే ఈ ఆక్సిజన్ గాయాన్ని సంపూర్ణంగానూ పూర్తిగానూ స్వస్థపరచడానికి అవసరం.

ఈ నాడు మన భావోద్వేగ మరియు ఆత్మీయ స్వస్థత విషయంలో కూడా అదే జరుగుతుందని నేను నమ్ముతున్నాను. మన జీవితాల మీద ప్రభువైన యేసు రక్తం యొక్క అధికారాన్ని స్వీకరించకుండా మరియు అది మనలను కప్పియుంచడానికి మనం అడగకుండా,మన జీవితంలోని లోతైన భాగాలలో స్వస్థతను మనం పొందలేము.

స్వస్థత పొందని అంతర్గత గాయాలు మనలను భయం,ద్వేషం, ఆగ్రహం, క్షమించకపోవడం, గర్వం మరియు నిరాశలో బందీలుగా ఉంచుతాయి. అకస్మాత్తుగా జరిగే సంగతులు మనలను ప్రేరేపించగలవు మరియు దానికి కారణం మనకు తెలియదు. మానని అంతర్గత గాయాల కారణంగా మనలను ప్రేమించే మరియు మనకు దగ్గరగా ఉన్నవారిని మనం గాయపరచవచ్చు మరియు దూరంగా నెట్టవచ్చు.

మనం పూర్తిగా జీవించాలంటే లోతుగా స్వస్థత పొందాలి!

యేసు రక్తం సాతాను మీద విజయాన్ని తీసుకొని వస్తుంది కాబట్టి దానిని చెయ్యడానికి ఆయన రక్తం మనకు సహాయం చేస్తుంది. యేసు కొరడాలతో కొట్టినప్పుడు మరియు బాధించబడినప్పుడు,ఆయన దేహం మీద తెరువబడిన ప్రతి గాయం మనం కలిగియున్న మరియు మనం కలిగియుండబోయే గాయానికి ప్రాతినిథ్యం వహిస్తుంది. ఈ గాయాల నుండి,మేకులతో గుచ్చబడిన ఆయన చేతుల నుండి మరియు గాయపడిన పక్క నుండి ప్రవహిస్తున్న రక్తం భూత,వర్తమాన మరియు భవిష్యత్తులో మానవజాతి యొక్క ప్రతి పాపం యొక్క క్షమాపణ కోసం చిందించబడిన పరిపూర్ణ త్యాగపూరితమైన గొర్రె పిల్ల యొక్క పరిపూర్ణ రక్తం. కల్వరి వద్ద చిందించబడిన రక్తం మనలను రక్షించి పాప శిక్ష నుండి మనలను విముక్తులను చేస్తుంది. ఇది మనలను, పవిత్రంగా,దేవుని యెదుట మనలను నిలబెడుతుంది, మరియు ఇప్పుడు ఆయన వద్దకు నేరుగా ప్రవేశాన్ని అనుగ్రహిస్తుంది. అపరాధం మరియు అవమానం నుండి ఈ రక్తం మన మనస్సాక్షిని శుద్ధి చేస్తుంది. అదే సమయంలో క్రీస్తులో విశ్వాసం ఉంచిన ప్రతీ వ్యక్తినీ ఏకం చేస్తుంది.

"ఆయన గాయాల ద్వారా మనం స్వస్థత పొందాము" అని మనం చెప్పినప్పుడు,"మన ప్రతి గాయానికి మన స్వస్థత ఆయన ప్రతి గాయం నుండి ప్రవహించే రక్తంలో కనిపిస్తుంది" అని మనం చెపుతున్నాము. ప్రార్థన ద్వారా విశ్వాసంతో ప్రభువైన యేసు రక్తాన్ని,మన జీవితంలోని ప్రతి గాయానికి అన్వయించే సమయం ఇది. ఇది ఆచారం కాదు, మంత్రమూ కాదు. ఇది ఒక యుద్ధం. మనం శత్రువుతో పూర్తి యుద్ధంలో ఉన్నాము! మనం గాయాలతో ఓడిపోయి జీవించి యుండడానికి ఎంపిక చేసుకోవచ్చును లేదా విశ్వాసం మరియు ప్రార్థన ద్వారా ఇంధనాన్ని కలిగి యుండి మరియు శక్తితో జీవించడానికి ఎంచుకోవచ్చు! ఆ సిలువ వద్ద ప్రభువైన యేసు సాధించిన విజయం మీద విశ్వాసం మరియు ఆ విజయం మన జీవితంలోని ప్రతి భాగంలోని కనుపరచబడాలనే పట్టుదలతో కూడిన ప్రార్థన.

రోజు 5రోజు 7

ఈ ప్రణాళిక గురించి

 లోపల మరియు వెలుపల స్వస్థత!

ఈ అంశం మీద మనకు ప్రతిదీ తెలియకపోయినా,భూమి మీద ఉన్నప్పుడు ప్రభువైన యేసు పరిచర్యలో అధిక భాగం స్వస్థతతో నిండి ఉందని మనకు తెలుసు. మీరు ఈ బైబిలు ప్రణాళికను చదువుతూ ఉండగా,ఒక లోతైన మరియు సంపూర్ణమైన విధానంలో మీరు స్వస్థతను పొందాలని నేను ప్రార్థిస్తున్నాను. కేవలం అత్యంత గొప్ప వైద్యుడు మాత్రమే తీసుకురాగల స్వస్థత.

More

ఈ ప్రణాళికను అందించినందుకు క్రిస్టీన్ జయకరన్‌కు మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మరింత సమాచారం కోసం, దయచేసి సందర్శించండి:  https://www.instagram.com/christinegershom/://www.christinegershom.com/