లోపల మరియు వెలుపల స్వస్థత!నమూనా
అందరికీ స్వస్థత,మినహాయింపులు లేవు
మత్తయి, మార్కు, మరియు లూకా సువార్తలను మనం అధ్యయనం చేసినప్పుడు,స్వస్థపరిచే యేసు పరిచర్యలో ఒక నమూనా ఉంది.
- ఆయన తన వద్దకు వచ్చిన వారందరినీ ఎటువంటి మినహాయింపులు లేకుండా స్వస్థపరిచాడు
- తన వద్ద ఉన్న వారు ఆయనకు పరిసరాలలో చాప మీద పరుండబెట్టబడినా వారిని ఆయన
స్వస్థపరిచాడు
- ఎగతాళి చెయ్యబడడం గురించిన భయం లేకుండా లేదా బహిరంగంగా అవమానానికి గురౌతామనే భయం లేకుండా నిరాశతో మొర్ర పెట్టిన వారిని ఆయన స్వస్థపరిచాడు
ఈ రోజు మనం ఉన్న పాటున ఆయన వద్దకు రాగలమని ఇది మనకు చూపిస్తుంది. మనం ఆయన సన్నిధిలో ఉండవచ్చు. మరియు మన లోతైన బాధలోనూ, నిరాశ క్షణాలలోనూ ఆయనకు మొర్ర పెట్టవచ్చు.
మనం దాదాపు చివరి ప్రయత్నంగా దేవుణ్ణి పిలవడానికి ముందు సాధారణంగా ఒక స్నేహితుడిని, ప్రియమైన వ్యక్తిని లేదా వైద్య నిపుణుడిని పిలవడానికి మనం చూస్తాము.
దేవుడు మనకు ఇవ్వాలనుకుంటున్న నివేదిక కంటే ఇంటర్నెట్ మనకు ఇచ్చే రోగ నిర్ధారణపై మన జీవితాలు ఆధారపడి ఉంటాయి.
మనం ఆ వెర్రియైన వివరాన్ని లేదా సూచన కోసం అడగడానికి ముందు దేవుని సన్నిధిలో మొదట మోకాళ్ల మీద వంగినట్లయితే మనం ఎలాంటి శాంతిని పొందగలమో ఊహించండి.
మనకున్న రోగాల సంక్లిష్టత ఏ స్థాయిలో ఉన్నప్పటికీ మనలను రక్షించడానికీ మరియు మనలను భద్రపరచడానికి ఆయన సర్వతోముఖమైన సన్నిధి మనకు చాలినదిగా ఉంటుంది. నా జీవితంలో ఆయన సన్నిదే నాకున్న గొప్ప అభిలాష అయినట్లయితే?
మనం ప్రతిరోజూ యేసుకు మరింత దగ్గరవుతూ ఉన్నట్లయితే నేను ఆయన స్పర్శ అనుభూతి చెందేలా ఉన్నట్లయితే?
కీర్తనా కారుడు అనేకమార్లు తాను నిరాశతో ఉన్నప్పుడు దేవునికి ఏవిధంగా మొర్ర పెట్టాడో వ్రాస్తాడు. అన్నీ కలిపి ఉండి మనం సిగ్గుతో తల వంచి దేవుని ముందు అవమానకరంగా ఉన్నట్లయితే ఏవిధంగా ఉంటుంది? ఆయన మన దుఃఖకరమైన కన్నీటిని, విచ్ఛిన్నమైన మన స్థితిని మరియు మన నిరాశను ఆయన పరిష్కరించగలడు.
గుడ్డివాడైన బర్తిమయి యేసు దృష్టిని ఆకర్షించేవారిని నిర్లక్ష్యపెడుతూ గుంపు యొక్క స్వరముకు మించి గట్టిగా అరిచాడు.
ఈ దినం మనం నిరాశతో యేసుకు మొర్ర పెట్టి స్వస్థత కోసం ఆయనను అడిగినట్లయితే?
మన సంఘర్షణలలోనికి ఆహ్వానించబడటానికి ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు,తద్వారా మనం చేయలేని వాటిని ఆయన భరిస్తాడు. తద్వారా మనం చేయలేని వాటిని ఆయన స్వస్థపరచగలడు.
ఈ ప్రణాళిక గురించి
ఈ అంశం మీద మనకు ప్రతిదీ తెలియకపోయినా,భూమి మీద ఉన్నప్పుడు ప్రభువైన యేసు పరిచర్యలో అధిక భాగం స్వస్థతతో నిండి ఉందని మనకు తెలుసు. మీరు ఈ బైబిలు ప్రణాళికను చదువుతూ ఉండగా,ఒక లోతైన మరియు సంపూర్ణమైన విధానంలో మీరు స్వస్థతను పొందాలని నేను ప్రార్థిస్తున్నాను. కేవలం అత్యంత గొప్ప వైద్యుడు మాత్రమే తీసుకురాగల స్వస్థత.
More
ఈ ప్రణాళికను అందించినందుకు క్రిస్టీన్ జయకరన్‌కు మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మరింత సమాచారం కోసం, దయచేసి సందర్శించండి: https://www.instagram.com/christinegershom/://www.christinegershom.com/