నిజమైన ఆధ్యాత్మికతనమూనా

నిజమైన ఆధ్యాత్మికత

7 యొక్క 6

దుష్టత్వాన్ని అధిగమించడం

నిన్నటి వచనభాగం మనుష్యులను నిశ్చయంగా ప్రేమించాలని బతిమాలాడింది. తిరిగి ప్రేమించని వ్యక్తి విషయంలో మీరు ఏ విధంగా స్పందిస్తారు? లేదా అధ్వాన్న పరిస్థితిలో, మీ విశ్వాసానికి ప్రతికూలంగా ఉన్నవాడు, శత్రువు అయినా కూడా అటువంటి వారిపట్ల ఏ విధంగా స్పందిస్తారు?

నిజమైన ఆధ్యాత్మికత అన్యాయాన్ని ఏ విధంగా ఎదుర్కొంటుంది?

దీని విషయంలో మీకు స్పష్టమైన దృశ్యం కావాలంటే, ప్రభువైన యేసు వైపు చూడండి. యేసుకు శత్రువులు అనేకమంది ఉన్నారు, ఆయన అత్యంత ఘోరమైన అన్యాయాన్ని భరించాడు. ఆయన ఏ విధంగా స్పందించాడు?

ప్రేమతో స్పందించాడు. ఎటువంటి ప్రతీకారం లేదు, శాపాలు లేవు, ఎదురుదెబ్బలు లేవు. కేవలం ప్రేమ మాత్రమే.

మన జీవితంలో దుష్టత్వానికి మూలంగా ఉన్న వ్యక్తులతో వ్యవహరించడం చాలా కష్టం. దుర్వినియోగం, అన్యాయం,  సంబంధాల విషయంలో మోసం మొదలైన వాటిలో గత గాయాలనూ, క్రోధాన్నీ తప్పించడం అసాధ్యం అనిపిస్తుంది.

అయినప్పటికీ పౌలు రోమా ​​12:14-21 వచన భాగంలో మనకు రెండు ప్రధాన ఆజ్ఞలను ఇస్తున్నాడు. అది ప్రతికూల పరిస్థితులలో ప్రేమ చిత్ర పటాన్ని చూపిస్తుంది. 

మొదట, “మిమ్మును హింసించువారిని దీవించుడి; దీవించుడి గాని శపింపవద్దు. (వ. 14).

ప్రభువైన యేసు చేసినవిధంగానే మనం దుష్టత్వం విషయంలో ప్రతిస్పందించాలి. ఈ లోక మర్యాదను అనుసరించకుండా సజీవ యాగంగా జీవించాలని మనం పిలువబడ్డాము. మనం ఆశీర్వదించాలి ఎందుకంటే అది దేవుని స్వభావం.

రెండవది, “కీడుకు ప్రతి కీడెవనికిని చేయవద్దు” (వ. 17).

వాస్తవానికి, మనం “శక్యమైతే మనం చేతనైనంత మట్టుకు సమస్త మనుష్యులతో సమాధానముగా ఉండాలి.” (వ. 18). అది అంత సులభం కాదు, అయితే దీనిని చేయటానికి దేవుడు మనకు కృపను అనుగ్రహిస్తాడు. మనం సువార్త సందేశానికి రూపాన్ని ఇవ్వవలసినవారంగా ఉన్నాము.

కొన్నిసార్లు సంఘర్షణలను తప్పించలేము. అయితే మార్పు చెంది మనస్సుతో సజీవ యాగంలా ఎటువంటి పరిస్థితిలోనైనా మీరు వ్యతిరేకిగా పిలువబడలేదు. నిజమైన ఆధ్యాత్మికత అంటే విషయాలను మీ చేతులలోనికి తీసుకోవటానికి నిరాకరించడం, వాటిని దేవుని చేతిలో విడిచి పెట్టడమే. మీరు దేవుణ్ణి విశ్వసించి, మీ జీవితం, మీ సంబంధాలు, మీ పిలుపు ఆయనతో భద్రంగా ఉన్నాయని నమ్ముతున్నారా?

వాక్యము

రోజు 5రోజు 7

ఈ ప్రణాళిక గురించి

నిజమైన ఆధ్యాత్మికత

యదార్ధమైన క్రైస్తవ జీవితం ఏ విధంగా కనిపిస్తుంది? లేఖనాలలోని అత్యంత శక్తివంతమైన భాగాలలో ఒక భాగమైన రోమా 12 అధ్యాయం మనకు ఒక చిత్రపటాన్ని ఇస్తుంది. ఈ పఠన ప్రణాళికలో, దేవుడు మన జీవితంలోని ప్రతి భాగాన్ని - మన ఆలోచనలు, స్వీయ-దృక్ఫథం, ఇతరులతో సంబంధాలు, దుష్టత్వంతో పోరాటాలలో దేవుడు మనలో పరివర్తన తీసుకొని వస్తుండగా నిజమైన ఆధ్యాత్మికత గురించి మీరు నేర్చుకుంటారు. దేవుని నుండి శ్రేష్ఠమైన దానిని పొందడం ఆరంభించండి, ఈ రోజున లోకాన్ని తీవ్రంగా ప్రభావితం చేయడం ప్రారంభించండి.

More

ఈ ప్రణాళికను అందించినందుకు లివింగ్ ఆన్ ది ఎడ్జ్‌కు మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. మరింత సమాచారం కోసం సందర్శించండి: https://livingontheedge.org