నిజమైన ఆధ్యాత్మికతనమూనా
దేవుడు కోరుకున్నడానిని ఆయనకు ఇవ్వడం
రోమా 12 వ అధ్యాయం సమర్పించుకోవాలనే పిలుపుతో ఆరంభం అవుతుంది – ఈ తీవ్రమైన పిలుపు మనం మనకోసం జీవించడానికి కాదు, అయితే దేవుని కోసం మాత్రమే జీవించడం కోసం పిలుపు. వాస్తవానికి ఆయనతో మనకున్న సంబంధానికి ఇది చాలా పెద్ద సవాలు.
ప్రభువైన క్రీస్తును అంగీకరించిన తరువాత, నేను సమర్పించుకోవలసిన సమయానికి రావడానికి నేను తీవ్రమైన ఘర్షణను నేను అనుభవించాను. నా జీవితాన్ని ఆయనకు ఇవ్వడం అంటే నేను ఎదురు చూసిన విషయాలను వదులుకోవడం అని నేను అనుకున్నాను.
నేను వివాహం చేసుకోవాలని కోరుకున్నాను. దేవుడు నన్ను ఒంటరిగా ఉండటానికి గానీ లేదా నేను ఇష్టపడని వ్యక్తిని వివాహం చేసుకొనేలా చేస్తాడని భయపడ్డాను. బాస్కెట్‌బాల్ ఆడటం నిలిపి వేసి మిషనరీగా వెళ్ళమని ఆయన నాకు చెపుతాడని నేను అనుకున్నాను. ఆయన చిత్తం "మంచిదే" గాని అది ఆనందించేదిగా ఉండదని ఊహించాను.
నేను స్నేహితులతో రాత్రి భోజనం నుండి ఇంటికి ప్రయాణం అవుతున్న ఒక రాత్రి సమయం వరకూ నాలో ఈ ఘర్షణ పెరుగుతూనే ఉంది. నేను కోరుకున్న ప్రతిదానిని వారు కలిగి ఉన్నట్లుగా అనిపించింది - మంచి కుటుంబం, సంతోషకరమైన గృహం, దేవుని కోసం హృదయాలు – నేను కష్టపడుతున్నాను.
అప్పుడు దేవుడు ఈ వచనాన్ని నా మనసుకు తీసుకొని వచ్చాడు:
“తన సొంతకుమారుని అనుగ్రహించుటకు వెనుకతీయక మన అందరికొరకు ఆయనను అప్పగించినవాడు ఆయనతో పాటు సమస్తమును మన కెందుకు అనుగ్రహింపడు?” (రోమా 8:32)
మీరు గమనించండి, దేవుడు మన జీవితాలమీద సంపూర్ణ ఆధిపత్యాన్ని కోరుతున్నాడు, అయితే మన హృదయాలు ఆయనకు తెలుసు. ఆయన వాటిని నెరవేర్చాలని కోరుతున్నాడు.
మన పట్ల ఆయన చిత్తం శ్రేష్ఠమైనది. దానిని నిరూపించడానికి, ఆయన ఇప్పటికే తన కుమారుని అద్వీతీయ బహుమతిని మనకు అనుగ్రహించాడు.
మన పిలుపు ఒక సజీవ యాగముగా "సమర్పణ" అని కాకుండా "సంపూర్ణంగా అప్పగించుకోవడం" అని నేను తరచూ వివరిస్తుంటాను. ఎందుకంటే:
· సమర్పణ మనం వదులుకుంటున్న వాటి మీద దృష్టిని ఉంచుతుంది. అంతా ఖర్చు చెయ్యడమే, ప్రయోజనం లేదు అన్నట్టుగా కనిపిస్తుంది.
· సంపూర్ణంగా అప్పగించుకోవడం అంటే ప్రాముఖ్యమైన దానిని తిరిగి మూల్య నిర్ధారణ చెయ్యడం. దేవుడు ఎవరో, ఆయన మనకోసం ఏమి చేసాడో, దేనికోసం ఆయన మనలను పిలుస్తున్నాడో మనం గుర్తించాము.
శాశ్వతంగా ప్రతిఫలాన్ని ఇచ్చే దాని కోసం వ్యర్థమైన జీవితాన్ని వదులుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ప్రభువైన క్రీస్తు కోసం సంపూర్ణ అర్పణను కలిగియుండండి. ఆయనకు సజీవయాగాముగా మిమ్మల్ని మీరు అర్పించుకోండి. సంతోషకరమైన జీవితం, నిజమైన ఆధ్యాత్మికత మీకు ప్రతిఫలంగా దొరుకుతుంది.
వాక్యము
ఈ ప్రణాళిక గురించి
యదార్ధమైన క్రైస్తవ జీవితం ఏ విధంగా కనిపిస్తుంది? లేఖనాలలోని అత్యంత శక్తివంతమైన భాగాలలో ఒక భాగమైన రోమా 12 అధ్యాయం మనకు ఒక చిత్రపటాన్ని ఇస్తుంది. ఈ పఠన ప్రణాళికలో, దేవుడు మన జీవితంలోని ప్రతి భాగాన్ని - మన ఆలోచనలు, స్వీయ-దృక్ఫథం, ఇతరులతో సంబంధాలు, దుష్టత్వంతో పోరాటాలలో దేవుడు మనలో పరివర్తన తీసుకొని వస్తుండగా నిజమైన ఆధ్యాత్మికత గురించి మీరు నేర్చుకుంటారు. దేవుని నుండి శ్రేష్ఠమైన దానిని పొందడం ఆరంభించండి, ఈ రోజున లోకాన్ని తీవ్రంగా ప్రభావితం చేయడం ప్రారంభించండి.
More
ఈ ప్రణాళికను అందించినందుకు లివింగ్ ఆన్ ది ఎడ్జ్‌కు మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. మరింత సమాచారం కోసం సందర్శించండి: https://livingontheedge.org