నిజమైన ఆధ్యాత్మికతనమూనా

నిజమైన ఆధ్యాత్మికత

7 యొక్క 1

నిజమైన ఆధ్యాత్మికత ఎక్కడ ఆరంభం అవుతుంది

"దేవా, నీవు జీవించి ఉంటే, నిన్ను నీవు నాకు కనుపరచుకో."

నేను ప్రార్థించిన మొట్ట మొదటి నిజాయితీ ప్రార్థన అదే. కళాశాలకు వెళ్ళడానికి నేను బయలుదేరాను. నాకు విద్యార్ధి వేతనం ఉంది, అందమైన స్నేహితురాలూ, పెద్ద ప్రణాళికలూ ఉన్నాయి, అయితే నేను శూన్యంగానూ, ఒంటరిగానూ ఉన్నాను. కాబట్టి దేవుడు తనను తాను నాకు బయలుపరచుకోవాలని ప్రార్థించాను.

ఆయన కార్యం జరిగించాడు. కొన్ని వారాల తరువాత క్రైస్తవ క్రీడాకారుల కోసం జరిగిన ఒక సౌవార్తిక శిబిరంలో ప్రభువైన క్రీస్తును అంగీకరించడానికి నేను ప్రార్థించాను. జీవితం గురించిన కొన్ని పెద్ద ప్రశ్నలకు దేవుడు సమాధానం ఇవ్వడం ప్రారంభించాడు:

·  దేవుడు నా నుండి ఏమి కోరుకుంటున్నాడు?

·  ఒక ప్రామాణిక క్రైస్తవుడిగా ఉండడం ఏ విధంగా ఉంటుంది?

·  క్రైస్తవుడిగా ఉండటం అంటే కొన్ని నియమ నిబంధనలను అనుసరించడం లేదా ఒక ప్రమాణం మేరకు ఉండడం కాకపోయినట్లయితే, ఇది దేని గురించి తెలియజేస్తుంది?

·  నిజమైన ఆధ్యాత్మిక జీవితం అంటే ఏమిటి?

నా పరివర్తనను దేవుడు ఎక్కడ ప్రారంభించాడు? రోమా ​​12:1-2. జీవితానికి సంబంధించిన భావాన్ని ఎక్కువగా ఇది తెలియజేస్తుంది.

మన జీవితాలను ఆయనకు సమర్పించుకోడానికి దేవుని ఉన్నత కరుణ మన కోసం ఒక మార్గాన్ని ఏ విధంగా తెరిచాడనే దాని గురించీ, మతసంబంధ కార్యకలాపాలనూ లేదా నియమాలను పాటించడం కాదనే దాని గురించి ఇది చెపుతుంది. 

మన జీవితాలలోని ప్రతీ విభాగంలోనూ ప్రదర్శించబడే అంతర్భావాలతో నిండి ఆయనతో సన్నిహిత జీవితం ఏ విధంగా ఉంటుందనే దాని గురించి ఇది మనకు తెలియజేస్తుంది.  

అటువంటి సన్నిహిత సంబంధంలో నిజమైన ఆధ్యాత్మికత ఆరంభం అవుతుంది.

మనలో ప్రతి ఒక్కరి విషయంలో దేవుని ఆకాంక్ష అదే. మనకు ఇప్పటికే అనుగ్రహించబడిన కృపలోనూ, దయలోనూ జీవించడం నేర్చుకోవాలని ఆయన కోరుతున్నాడు. మనం తన కుమారుడిలాగా మారాలని ఆయన కోరుకుంటాడు, తద్వారా మనం ఆయనను బట్టి సంతోషించగలం, ఆయనను ప్రేమించగలము – అయన ఇతరులను ప్రేమించే విధంగా మనమూ ఇతరులను ప్రేమించగలము.

ఇది జీవితం యొక్క పూర్తి పునఃనిర్దేశం.

అనేకమంది క్రైస్తవులు ఈ సంబంధం యొక్క సంపూర్ణతను అనుభవించడం లేదు. అయితే మనం చెయ్యగలమని రోమా ​​12 వ అధ్యాయం మనకు నిశ్చయత ఇస్తుంది.

దేవునితో సన్నిహిత సంబంధం విషయంలో దేవుడిస్తున్న ఆహ్వానానికి నీవూ, నేనూ స్పందించడంలోని ఫలమే నిజమైన ఆధ్యాత్మికత. దేవుని హెచ్చరికలకు విశ్వాసం ద్వారా స్పందించడానికి మీరు ఇష్టంగా ఉన్నారా?

మీరు ఆ విధంగా చేసినప్పుడు, మీ హృదయాలూ, జీవితాలూ ఆయనతో ఏకం అవుతాయి. ఆయన జీవంతోనూ, ఆయన చిత్తంతోనూ. ఆయన ఉద్దేశ్యంతోనూ మీరు నింపబడతారు. నిజమైన ఆధ్యాత్మిక జీవితాన్ని జీవిస్తారు. 

వాక్యము

రోజు 2

ఈ ప్రణాళిక గురించి

నిజమైన ఆధ్యాత్మికత

యదార్ధమైన క్రైస్తవ జీవితం ఏ విధంగా కనిపిస్తుంది? లేఖనాలలోని అత్యంత శక్తివంతమైన భాగాలలో ఒక భాగమైన రోమా 12 అధ్యాయం మనకు ఒక చిత్రపటాన్ని ఇస్తుంది. ఈ పఠన ప్రణాళికలో, దేవుడు మన జీవితంలోని ప్రతి భాగాన్ని - మన ఆలోచనలు, స్వీయ-దృక్ఫథం, ఇతరులతో సంబంధాలు, దుష్టత్వంతో పోరాటాలలో దేవుడు మనలో పరివర్తన తీసుకొని వస్తుండగా నిజమైన ఆధ్యాత్మికత గురించి మీరు నేర్చుకుంటారు. దేవుని నుండి శ్రేష్ఠమైన దానిని పొందడం ఆరంభించండి, ఈ రోజున లోకాన్ని తీవ్రంగా ప్రభావితం చేయడం ప్రారంభించండి.

More

ఈ ప్రణాళికను అందించినందుకు లివింగ్ ఆన్ ది ఎడ్జ్‌కు మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. మరింత సమాచారం కోసం సందర్శించండి: https://livingontheedge.org