నిజమైన ఆధ్యాత్మికతనమూనా
ప్రామాణికమైన సంఘాన్ని అనుభవించడం
ప్రభువైన యేసు సిలువ వేయబడడానికి ముందు రాత్రి జ్ఞాపకం ఉందా? ఆయన తన అనుచరులకు ఒక కొత్త ఆజ్ఞ ఇచ్చాడు - వారు ఒకరినొకరు తీవ్రంగా ప్రేమించాలని.
ప్రభువైన యేసు తాను తన తండ్రి అయిన దేవునితో కలిగి యున్న ప్రేమనూ, ఐక్యతనూ తన అనుచరులు అనుభవించాలని ప్రార్థించాడు (యోహాను 13:34; 17:20-24). ఆ ప్రేమ ఇచ్చేవాని హృదయం నుండి వస్తుంది. ఇది స్వీకరించే వాని యోగ్యతమీద ఆధారపడి ఉండదు.
పౌలు ఈ పిలుపును రోమా 12:10 వచనంలో ప్రతిధ్వనించేలా చేసాడు:
"సహోదర ప్రేమ విషయములో ఒకనియందొకడు అనురాగముగల వారై, ఘనతవిషయములో ఒకని నొకడు గొప్పగా ఎంచుకొనుడి."
నేటి పఠనంలో, ఒకరినొకరు హృదయపూర్వకంగా ప్రేమించే విశ్వాసుల ప్రామాణికమైన సంఘాన్ని గురించి పౌలు వివరించాడు. పౌలు మనకు ఈ విధంగా చెపుతున్నాడు:
· ఒకనినొకడు గొప్పగా యెంచుకోండి.
· ఆసక్తి కలిగి ప్రభువును సేవించండి.
· నిరీక్షణ గలవారై సంతోషించండి
· శ్రమ యందు ఓర్పుగలవారై ఉండండి
· ప్రార్ధన యందు తీవ్రతగలవారై ఉండండి.
· ప్రభువు ప్రజల అవసరాలలో పాలు పంచుకోండి.
· ఆతిథ్యాన్ని ఇస్తూ ఉండండి.
ఈ విధమైన నిజ ఆధ్యాత్మిక సంఘం చాలా అరుదుగా ఉండవచ్చు (ఈ రోజులలో ఇలాంటి దానిని కనుగొనడం మరింత కష్టమవుతుంది). అయితే మీరు దానిని వృద్ధి చెయ్యడానికి ప్రయత్నం చేసినప్పుడు, అది జీవితాన్ని మార్పు చేసేదిగా ఉంటుంది.
మనం ఒకరికొకరు జీవితంలో భాగంగా మారినప్పుడు, క్రీస్తులోని నిరీక్షణలోనూ, ఆయన వాగ్దానాలలోనూ అంటి పెట్టుకొని ఉండగా జీవితంలోని అత్యంత బాధాకరమైన పరీక్షలను మనం కలిసి ఎదుర్కొనగలం. మనం ఒకరితో ఒకరం – ఆయనతో కలిసి – ఐక్యంగా ఎదుగుతాము.
ఇతరులను ప్రేమించడానికీ, త్యాగపూరితంగా వారికి సేవ చెయ్యడానికీ ఇతర విశ్వాసులతో ప్రామాణికమైన సంబంధాలను ఏర్పరచుకునే దిశగా చర్యలు తీసుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? దేవుడు సహాయం చేస్తాడు. ఇతర విశ్వాసులతో - ఆయన ప్రేమను ప్రతిబింబించాలనీ, మీ జీవితం కోసం ఆయన ఉన్నత ఆకాంక్షలను నెరవెర్చాలనీ మీ విషయంలో ఆయన కోరుకుంటున్నాడు.
వాక్యము
ఈ ప్రణాళిక గురించి
యదార్ధమైన క్రైస్తవ జీవితం ఏ విధంగా కనిపిస్తుంది? లేఖనాలలోని అత్యంత శక్తివంతమైన భాగాలలో ఒక భాగమైన రోమా 12 అధ్యాయం మనకు ఒక చిత్రపటాన్ని ఇస్తుంది. ఈ పఠన ప్రణాళికలో, దేవుడు మన జీవితంలోని ప్రతి భాగాన్ని - మన ఆలోచనలు, స్వీయ-దృక్ఫథం, ఇతరులతో సంబంధాలు, దుష్టత్వంతో పోరాటాలలో దేవుడు మనలో పరివర్తన తీసుకొని వస్తుండగా నిజమైన ఆధ్యాత్మికత గురించి మీరు నేర్చుకుంటారు. దేవుని నుండి శ్రేష్ఠమైన దానిని పొందడం ఆరంభించండి, ఈ రోజున లోకాన్ని తీవ్రంగా ప్రభావితం చేయడం ప్రారంభించండి.
More
ఈ ప్రణాళికను అందించినందుకు లివింగ్ ఆన్ ది ఎడ్జ్‌కు మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. మరింత సమాచారం కోసం సందర్శించండి: https://livingontheedge.org