నిజమైన ఆధ్యాత్మికతనమూనా
నీలోని నిజమైన వ్యక్తిని గురించి తీవ్రంగా ఆలోచించడం
నీవు ఎవరివి? ఇది సంక్లిష్టమైన ప్రశ్న, కాదా? ఒక వైపు, మీ స్వీయ-భావన మీ కుటుంబ నేపథ్యం, మీ వ్యక్తిత్వం, మీకు నేర్పించిన విశ్వాస వ్యవస్థలు, మీ జీవితంలోని ముఖ్య వ్యక్తులలో వేరు పారి ఉంటుంది.
మరోవైపు, మీ గురించి మీరు తలంచినట్టుగా మీరు కాకపోవచ్చును.
దేవుడు మీ నిజమైన గుర్తింపుకు కర్త. ఆయన మిమ్మల్ని ఏ విధంగా రూపొందించాడో ఆయనకు ఖచ్చితంగా తెలుసు. మీరు పిలువబడిన ఉద్దేశాన్ని నెరవేర్చడానికి ఆయన మీకు ఇచ్చిన వరములు ఆయనకు తెలుసు.
ఆకారణంగా పౌలు రోమనులు తమ గురించి తాము ఖచ్చితంగా ఆలోచించాలని బతిమాలాడు:
“తన్నుతాను ఎంచుకొనతగినదానికంటె ఎక్కువగా ఎంచుకొనక, దేవుడు ఒక్కొకనికి విభజించి యిచ్చిన విశ్వాస పరిమాణప్రకారము, తాను స్వస్థబుద్ధిగలవాడగుటకై తగినరీతిగా తన్ను ఎంచుకొనవలెనని, నాకు అను గ్రహింపబడిన కృపనుబట్టి మీలోనున్న ప్రతి వానితోను చెప్పుచున్నాను.” (రోమా 12:3)
మీ విషయంలో దేవుని దృక్పథాన్ని మీరు తెలుసుకున్నప్పుడు - మీరు నిజంగా ఎవరై యున్నారు అని మీరు తెలుసుకొన్నప్పుడు – సమస్తమూ మార్పు చెందడం ఆరంభం అవుతుంది. నిజమైన ఆధ్యాత్మికతతో జీవించడం సాధ్యమవుతుంది.
మీ మనస్సును మార్చడానికి దేవుడిని మీరు అనుమతించినప్పుడు, మీ మనస్సు ద్వారా నడిచే లోక సంబంధ రాత లిపి మార్పు చెందుతుంది. అంటే మీ అనర్హతకు గానీ లేదా అహంకారానికి గానీ చెందినా మీ భావనలూ, ఇతరులతో మీరు సంబంధ పరచుకొనే విధానమూ, మీ ఆలోచన జీవితమూ, మీ కలలు మరియు లక్ష్యాలూ, అవన్నీ కూడా మార్పు చెందుతాయి.
పౌలు ఈ వచన భాగంలో చూపించిన విధంగా, విశ్వాసుల గుంపులో మీరు యోగ్యమైన వారిగా ఏ విధంగా ఉండగలరో అనే దానిని గురించి ఇది ప్రత్యేకంగా చెపుతుంది.
నిజమైన ఆధ్యాత్మికత అంటే క్రీస్తు శరీరం అయిన సంఘ సభ్యునిగా జీవించడం. మీరు ఎవరో మీకు తెలిసినప్పుడు, దేవుడు రూపొందించిన విధానంలో ప్రేమను పొందగలరు, ప్రేమను ఇవ్వగలరు. మీరు విశ్వాసుల శరీరంలో మీ స్థానాన్ని గుర్తించి మీ వరాలను సమర్థవంతంగా వినియోగించండి. దేవుని ఉద్దేశాలకు సంపూర్ణంగా యోగ్యమైన సజీవ యాగంగానూ, మార్పుచెందినదానిగానూ మీ పిలుపును మీరు కొనసాగించగలరు.
వాక్యము
ఈ ప్రణాళిక గురించి
యదార్ధమైన క్రైస్తవ జీవితం ఏ విధంగా కనిపిస్తుంది? లేఖనాలలోని అత్యంత శక్తివంతమైన భాగాలలో ఒక భాగమైన రోమా 12 అధ్యాయం మనకు ఒక చిత్రపటాన్ని ఇస్తుంది. ఈ పఠన ప్రణాళికలో, దేవుడు మన జీవితంలోని ప్రతి భాగాన్ని - మన ఆలోచనలు, స్వీయ-దృక్ఫథం, ఇతరులతో సంబంధాలు, దుష్టత్వంతో పోరాటాలలో దేవుడు మనలో పరివర్తన తీసుకొని వస్తుండగా నిజమైన ఆధ్యాత్మికత గురించి మీరు నేర్చుకుంటారు. దేవుని నుండి శ్రేష్ఠమైన దానిని పొందడం ఆరంభించండి, ఈ రోజున లోకాన్ని తీవ్రంగా ప్రభావితం చేయడం ప్రారంభించండి.
More
ఈ ప్రణాళికను అందించినందుకు లివింగ్ ఆన్ ది ఎడ్జ్‌కు మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. మరింత సమాచారం కోసం సందర్శించండి: https://livingontheedge.org