నిజమైన దేవుడునమూనా
![నిజమైన దేవుడు](/_next/image?url=https%3A%2F%2Fimageproxy.youversionapi.com%2Fhttps%3A%2F%2Fs3.amazonaws.com%2Fyvplans%2F24459%2F1280x720.jpg&w=3840&q=75)
దేవుడు నమ్మదగినవాడు
నిరీక్షణ ఆత్మకు ఆక్సిజన్ లాంటిదని చెప్పబడింది. మనకోసం ఎవరైనా వస్తారనీ, ఆ పరిస్థితులు సరి చెయ్యబడతాయనీ, మన కలలు నిజంగా నెరవేరతాయనీ, దేవుడు మన కోసం శ్రేష్ఠమైన ఈవులను కలిగి ఉన్నాడనీ మనం నమ్మ వలసి ఉంది.
నిరీక్షణ లేకుండా, మన అంతరంగంలో మమ్మల్ని నిలిపి ఉంచేదేమీ ఉండదు. మనం నిరుత్సాహపడతాము, విడిచి పెట్టేస్తాము, వాడిపోవడం ఆరంభం అవుతుంది.
దేవుని విశ్వాస్యతే మన నిరీక్షణకు పునాది.
పాత నిబంధన ప్రవక్త యిర్మీయా మాదిరిగానే, మన పరిస్థితులకు మించి చూడవచ్చు, దేవుని విశ్వాస్యతలో నమ్మకాన్ని ఉంచవచ్చు. యెరూషలేము శిధిలావస్థలో ఉండడం యిర్మియా చూచి, దేవుని వాగ్దానాలు విచ్ఛిన్నమైనట్లు గమనించినప్పుడు మార్పు లేని దేవుని స్వభావంలో నమ్మకం ఉంచాడు.
దేవుడు ఎంతో నమ్మదగినవాడూ, ఆధారపడదగిన వాడుగా మనం అర్థం చేసుకున్నప్పుడు, మనం ఎక్కువగా సహించగలము. ఆరోగ్య సంక్షోభాలు, ఆర్థిక సవాళ్లు, కుటుంబాలు సరిగా పనిచేయకపోవడం, ఒత్తిడి, ఒంటరితనం, జీవితంలోని శ్రమలలో – దేవుని నమ్మకత్వం నిరీక్షణను అందిస్తుంది. ఆయన ప్రేమపూర్వక కరుణ ఎప్పటికీ, అంతం కాదు.
“యెహోవా కృపగలవాడు ఆయన వాత్సల్యత యెడతెగక నిలుచునది గనుక మనము నిర్మూలము కాకున్నవారము. అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది నీవు ఎంతైన నమ్మదగినవాడవు.” (విలాపవాక్యములు 3:22-23).
అంతులేని జీవితపు ఆనందానికీ, సమాధానానికీ ఇది నిజంగా ఒక “రహస్యం”.
· సర్వశక్తిమంతుడు, ప్రేమా స్వరూపుడు, సర్వజ్ఞుడైన దేవుడు మన కోసం వస్తాడని అన్ని సమయాలలో నూటికి నూరు శాతం తెలుసుకోవడం మనల్ని శక్తితో నింపుతుంది, విముక్తి చేస్తుంది.
· ఇది మనల్ని భయం నుండి విముక్తి చేస్తుంది, కొనసాగడానికి మనల్ని ప్రేరేపిస్తుంది, అవకాశాలను ఎదురుచూడడానికి మనలను బలపరుస్తుంది.
· పరిస్థితులు ఆయన విశ్వాస్యతకు ఎంత విరుద్ధంగా అనిపించినప్పటికీ, ఆయన మనలను నిరాశపరచడని మనకు తెలుసు.
మీరు దీన్ని నమ్ముతున్నారా? క్రైస్తవులు నమ్మదగిన దేవుణ్ణి విశ్వసించడం మాత్రమే కాదు, నిరీక్షణ అవసరత ఉన్న లోకానికి ఆయనను ప్రకటించడానికి వారు పిలువబడ్డారు. మంచి దేవుడు, సార్వభౌముడు, పరిశుద్ధుడు, సర్వజ్ఞాని, న్యాయవంతుడు, ప్రేమగలవాడు, నమ్మదగినవాడు అయిన మన ప్రతి పాపం నుండి విడుదలనూ, ప్రతీ నష్టానికీ పునరుద్ధరణనూ, నిరాశ స్థానంలో ఆశీర్వాదమునూ అనుగ్రహిస్తున్నాడు. సమస్త నిరీక్షణకు ఆయన నిజమైన దేవుడు, ఆయన మిమ్మల్ని ఎప్పటికీ నిరాశపరచడు.
ఈ ప్రణాళిక గురించి
![నిజమైన దేవుడు](/_next/image?url=https%3A%2F%2Fimageproxy.youversionapi.com%2Fhttps%3A%2F%2Fs3.amazonaws.com%2Fyvplans%2F24459%2F1280x720.jpg&w=3840&q=75)
నీవు దేవుణ్ణి ఎలా చూస్తావు? ఆ ప్రశ్నకు సమాధానం నిన్నూ, నీ విశ్వాసాన్నీ, స్వీయ-అవగాహనలనూ, వైఖరులనూ, సంబంధాలనూ, లక్ష్యాలనూ – నీ పూర్తి జీవితాన్నీ రూపొందిస్తుంది. దేవుని విషయంలో సరికాని దృక్పథం కలిగి ఉండటం మిమ్మల్ని జీవితకాల పోరాటాలలో చిక్కుకొనేలా చేస్తుంది. అంటే నిజమైన దేవుణ్ణి స్పష్టంగా చూడడం – ఆయనను చూడాలని దేవుడు కోరుకొన్న విధంగా చూడడం – జ్ఞానవంతమైన కార్యం! నీ జీవితం శక్తివంతంగా రూపాంతరం చెందుతుంది!
More
ఈ ప్రణాళికను అందించినందుకు లివింగ్ ఆన్ ది ఎడ్జ్‌కు మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. మరింత సమాచారం కోసం సందర్శించండి: https://livingontheedge.org