నిజమైన దేవుడునమూనా
దేవుడు న్యాయవంతుడు
“ఎందుకు?” కష్ట సమయాలలో దేవుడు ఈ ప్రశ్నకు సమాధానం ఇస్తాడని మనం కోరుకుంటున్నాము. జీవితం ఎందుకు అన్యాయంగా ఉంది? మంచి వ్యక్తులకు చెడు విషయాలు జరుగుతున్నాయి, దుష్టత్వం ఇంకా ఎందుకు ఉనికిలో ఉంది అని మనల్ని మనం అరుదుగా ప్రశ్నించుకొనేలా దేవుడు చేస్తాడు.
నమ్మదగిన విధేయతకు ప్రతిఫలం దొరకకుండా ఆయన ఎందుకు అనుమతిస్తున్నాడు, జీవితకాల స్వప్నం సాకారం కావడానికి ముందే అది ఎందుకు భంగమైపోతుంది? లేదా ప్రియమైన వ్యక్తి జీవితంలో ముఖ్యమైన సమయంలో ఎందుకు చనిపోతున్నాడు? దేవుడు సార్వభౌముడూ, మంచివాడూ అయినట్లయితే, లోకం ఈ విధంగా ఎందుకు కనిపిస్తుంది?
మనకు చాలా పరిమితమైన దృక్పథం ఉన్న కారణంగా లోకం ఈ విధంగా కనిపిస్తుంది. మనం అనేకమైన అన్యాయాలను చూస్తున్నాము, నిజమే, అయితే మనం చూస్తున్న దృశ్యం పరిమితమైనది. జరుగుతున్న సంగతుల ఉన్నత పథకాన్ని మనం గ్రహించలేము - దేవుని గొప్ప ప్రణాళికలూ, ఆయన ఉద్దేశాలూ మన దృష్టికి మించి విస్తరించి ఉన్నాయి.
“నీతిన్యాయములు నీ సింహాసనమునకు ఆధారములు కృపాసత్యములు నీ సన్నిధానవర్తులు” (కీర్తన 89:14).
జ్ఞాపకం ఉంచుకోండి, నిజమైన దేవుడు అనంతమైన మంచితనం గలవాడు, సార్వభౌముడు, పరిశుద్ధుడు మరియు న్యాయవంతుడు అని బైబిలు బోధిస్తుంది.
దేవుడు నీతిమంతుడైన న్యాయమూర్తి, కరుణగలవాడు అని ఋజువు పరచుకొన్నాడు. మన పాపముల కోసం మనకు న్యాయంగా రావలసిన శిక్షను ఆయన తన కుమారుడు ప్రభువైన యేసు మీద ఉంచాడు. తద్వారా న్యాయం మన మీదుకు రాకున్నప్పటికీ అది విధించబడింది.
పరిస్థితులు ఇప్పుడు ఏ విధంగా కనిపిస్తున్నప్పటికీ దేవుడు ఋజువు చెయ్యబడ్డాడు అనే వాస్తవంలో ఆదరణ పొందండి, ఆయన ఋజువుపరచబడుతూ ఉంటాడు – ఆయన నీతిమంతుడు “సర్వలోకమునకు తీర్పు తీర్చువాడు” (ఆదికాండము 18:25). అంతంలో ఆయన సమస్తాన్ని చక్కపరుస్తాడు.
ఈ సమయంలో, మనం ఆయన స్వరూపానికి అనుగుణంగా ఉన్నందున, లోకంలోని అన్యాయాలను మనం ఎదుర్కోవలసి ఉంది. ప్రతీకారాన్ని తిరస్కరించాలి, విరోధాన్నీ, ఆగ్రహాన్నీ అడ్డగించాలి, రాబోతున్న అంతిమ తీర్పును గురించి ఇతరులను హెచ్చరించాలి, ప్రతి ఒక్కరినీ దేవుని కరుణ వైపుకు చూపించాలి. నీతిమంతుడైన దేవునికి ఎల్లప్పుడు ఫలితం తెలుసు, ఆయన మనలను చూస్తూ ఉంటాడు.
ఈ ప్రణాళిక గురించి
నీవు దేవుణ్ణి ఎలా చూస్తావు? ఆ ప్రశ్నకు సమాధానం నిన్నూ, నీ విశ్వాసాన్నీ, స్వీయ-అవగాహనలనూ, వైఖరులనూ, సంబంధాలనూ, లక్ష్యాలనూ – నీ పూర్తి జీవితాన్నీ రూపొందిస్తుంది. దేవుని విషయంలో సరికాని దృక్పథం కలిగి ఉండటం మిమ్మల్ని జీవితకాల పోరాటాలలో చిక్కుకొనేలా చేస్తుంది. అంటే నిజమైన దేవుణ్ణి స్పష్టంగా చూడడం – ఆయనను చూడాలని దేవుడు కోరుకొన్న విధంగా చూడడం – జ్ఞానవంతమైన కార్యం! నీ జీవితం శక్తివంతంగా రూపాంతరం చెందుతుంది!
More
ఈ ప్రణాళికను అందించినందుకు లివింగ్ ఆన్ ది ఎడ్జ్‌కు మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. మరింత సమాచారం కోసం సందర్శించండి: https://livingontheedge.org