నిజమైన దేవుడునమూనా

నిజమైన దేవుడు

7 యొక్క 3

దేవుడు పరిశుద్ధుడు

దేవుడు “పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు” (యెషయా 6:3) అని పరలోకంలో నిరంతరం దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్న దేవదూతల దర్శనాన్ని గురించి యెషయా వివరించాడు. దేవుడు మంచివాడనీ, ఆయన సార్వభౌముడనీ మనకు తెలుసు. ఆయన పరిశుద్ధుడుగా ఉండడం అంటే ఏమిటి?

దేవుని పరిశుద్ధ స్వభావం పవిత్రమైనది. ఎటువంటి పాప సంబంధమైన జాడ గానీ, అసంపూర్ణత గానీ  లేదా దుష్టత్వంగాని లేని నిష్కళంకమైనది. పరిశుద్ధత అంటే అదే. ఆయన మూర్తిమత్త్వంలోని మర్మయుక్తమైన అనేక అంశాలలో ఒకటైన ఈ దైవగుణలక్షణం ఆయనను అసమానుడిగా చూపిస్తుంది. 

ఆయన పిల్లలమైన మనం పరిశుద్ధులుగా ఉండడానికి పిలువబడ్డాము – పవిత్రమైనా, సంపూర్ణమైనా ఆయన స్వభావంలో దేవునివలే మార్పు చెందడానికి పిలువబడ్డాము. 

అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి యుండుటకు ప్రయత్నించుడి. పరిశుద్ధతలేకుండ ఎవడును ప్రభువును చూడడు” (హెబ్రీయులు 12:14).

అది ఎలా సాధ్యం? మనలను శుద్ధి చేసే క్రీస్తు సిలువ లేకుండా ఇది జరుగదు. మనం పాపం చేత అపవిత్రులమయ్యాము. పరలోకానికి మార్గంగా ఆయన మనకు అనుగ్రహించే ఏర్పాటు అనగా దేవుని కుమారుడు, రక్షకుడు, ప్రభువైన యేసు త్యాగసహితమైన బహుమానం లేకుండా మనము దేవుని సన్నిధిలో నిలువబడలేము, ఆయన స్వభావానికి అనుకూలంగా ఉండలేము.  

ఇది మన పాపాల పూర్తి జాబితాలో దేవుడు “తొలగించు” బటన్‌ను కొట్టడంలా ఉంటుంది. మిగిలిన మన జీవితకాలమంతా "పరిశుద్ధపరచబడడం" ప్రక్రియగా మారుతుంది - ఆయన ఇప్పటికే అందించిన పరిశుద్ధతను జీవించడమే.

నిజమైన దేవుడు పరిశుద్ధుడు, మనం పరిశుద్దులంగా ఉండాలని కోరుకుంటున్నాడు - తద్వారా మనం ఆయనతో సన్నిహిత సంబంధాన్ని కలిగి ఉండగలం. ఆయన పోలికగా రూపాంతరం చెందడం, ఆయనతో నడవడం ప్రారంభించునట్లు మీ జీవితాన్ని ప్రభువైన క్రీస్తుకు సమర్పించుకొన్నారా?

దేవుని పరిశుద్ధతను గురించిన స్పష్టమైన దర్శనం మీ ఆలోచనా విధానాన్ని మారుస్తుంది, మీ వైఖరులను రూపుదిద్దుతుంది, మీ జీవితాన్ని మార్గనిర్దేశం చేస్తుంది. అది మిమ్మల్ని ఆయనతో సన్నిహిత సహవాసంలోకి తీసుకువస్తుంది. సమయం గడిచేకొద్దీ మీ జీవితం ఆయన మంచి, సార్వభౌమ, పరిశుద్ధ స్వభావాన్ని ప్రతిఫలింప చేస్తుంది. 

రోజు 2రోజు 4

ఈ ప్రణాళిక గురించి

నిజమైన దేవుడు

నీవు దేవుణ్ణి ఎలా చూస్తావు? ఆ ప్రశ్నకు సమాధానం నిన్నూ, నీ విశ్వాసాన్నీ, స్వీయ-అవగాహనలనూ, వైఖరులనూ, సంబంధాలనూ, లక్ష్యాలనూ – నీ పూర్తి జీవితాన్నీ రూపొందిస్తుంది. దేవుని విషయంలో సరికాని దృక్పథం కలిగి ఉండటం మిమ్మల్ని జీవితకాల పోరాటాలలో చిక్కుకొనేలా చేస్తుంది. అంటే నిజమైన దేవుణ్ణి స్పష్టంగా చూడడం – ఆయనను చూడాలని దేవుడు కోరుకొన్న విధంగా చూడడం – జ్ఞానవంతమైన కార్యం! నీ జీవితం శక్తివంతంగా రూపాంతరం చెందుతుంది!

More

ఈ ప్రణాళికను అందించినందుకు లివింగ్ ఆన్ ది ఎడ్జ్‌కు మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. మరింత సమాచారం కోసం సందర్శించండి: https://livingontheedge.org