నిజమైన దేవుడునమూనా
దేవుడు మంచివాడు
ఎ.డబ్ల్యు. టోజర్ సరిగా చెప్పాడు. దేవుని గురించి మనం ఆలోచించినప్పుడు మన మనస్సులలోనికి వచ్చేదే మన గురించిన అత్యంత ముఖ్యమైన అంశం అని చెప్పాడు.
ఎందుకు? ఎందుకంటే మనం దేవుణ్ణి ఒక ఖగోళ సంబంధ సేవకునిగా చూసినట్లయితే మనం ఎల్లప్పుడూ గుడ్డు పెంకుల మీద నడుస్తున్నట్టుగా ఉంటాము. మనం ఆయనను కఠినమైన ఒక న్యాయమూర్తిగా చూస్తున్నట్లయితే, మనం ఎల్లప్పుడూ అపరాధభావంతో ఉంటాము. మనం ఆయనను సుదూరమైన, అజ్ఞాత సృష్టికర్తగా చూస్తున్నట్లయితే మనలను ప్రేమిస్తున్న పరలోకపు తండ్రిని విశ్వసించడానికి మనకు చాలా కష్టంగా ఉంటుంది.
దేవుని గురించిన మన దృక్పథం ప్రతి నమ్మకాన్నీ, సంబంధాన్నీ, అవగాహననూ, వైఖరినీ, నిర్ణయాన్నీ, సమస్తాన్నీరూపుదిద్దుతుంది.
సంతోషకరమైన సంగతి, దేవుడు పరలోకంలో తనను తాను దాచుకోలేదు. ప్రతి ఒక్కరూ ఆయనను యెరగాలని ఆయన కోరుకొన్నాడు. లేఖనాలు, ప్రకృతి మరియు ఆయన కుమారుడు ప్రభువైన యేసు ద్వారా దేవుడు మనకు తనను తాను వెల్లడి పరచుకొన్నాడు.
దేవుడు మనలను మనుషులనుగా సృష్టించాడు, ప్రత్యేకించి చరిత్ర అంతటిలో ఆయనను గురించి పంచుకోడానికీ, మనతో సంబంధాన్నీ కలిగియుండడానికీ ఆయన మన హృదయాలను నడిపిస్తూ ఉన్నాడు. ఆ విధంగా మనం నిర్మించబడ్డాము. ఆయనతో లోతైన, వ్యక్తిగత సాన్నిహిత్యం కోసం మనం నిర్మించబడ్డాము!
అయితే మనం దేవుణ్ణి పరిపూర్ణంగా విశ్వసిస్తే తప్పించి మనం అటువంటి సంబంధాన్ని కలిగి ఉండలేము. ఆయన మంచివాడని మనం విశ్వసిస్తే తప్పించి మనం ఆయనను నమ్మలేము.
“ఆయన ‘నా మంచితనమంతయు నీ యెదుట కనుపరచెదను; యెహోవా అను నామమును నీ యెదుట ప్రకటించెదను’ అని చెప్పాడు.” (నిర్గమకాండము 33:19)
మంచి దేవుడు తన సంపూర్ణ శ్రేష్టమైన దానిని నీకు ఇవ్వాలని కోరుకొంటున్నాడని నీవు నిజంగా విశ్వసించినట్లయితే మీ జీవితం ఏవిధంగా ఉంటుంది?
ఇది ఏవిధంగా మిమ్మును ప్రభావితం చేస్తుంది:
· మీ వైఖరులు?
· మీ ఆశాభావాలు?
· మీ నిర్ణయాలు?
· మీ ప్రేరణ?
· ఇతరులను విశ్వసించడానికీ, ప్రేమించడానికీ మీ సుముఖత?
· మిమ్మల్ని మీరు ప్రేమించగల సామర్థ్యం?
విశ్వాసం ఉండటం సులభం అని మీకు అనిపిస్తుంది, అవును కదూ? ఆశాభావంతోనూ, ఎదురుచూపుతోనూ మీరు జీవిస్తారు. మీరు సురక్షితంగా ఉన్నారని భావిస్తారు. ప్రేమించబడిన చిన్నబిడ్డలా మీరు విశ్వాసంలోనూ, భద్రతలోనూ నడుస్తారు.
దేవుడు మీ పక్షాన ఉన్నాడు, మీకు వ్యతిరేకంగా కాదు. మిమ్మల్ని దీవించడానికీ, రక్షించడానికీ ఆయన ఔదార్యముగలవానిగానూ, అపరిమితమైన వానిగానూ, ఆకాంక్షగలవానిగానూ ఉన్నాడు. ఈ రోజు మీరు ఆ సత్యాన్ని ధ్యానిస్తారా? ఆ నిశ్చిత వాగ్దానంలో మీరు జీవించండి, నిజమైన దేవునితో మీ సంబంధాన్ని మరింత లోతుగా ఉండేలా చూసుకోండి!
ఈ ప్రణాళిక గురించి
నీవు దేవుణ్ణి ఎలా చూస్తావు? ఆ ప్రశ్నకు సమాధానం నిన్నూ, నీ విశ్వాసాన్నీ, స్వీయ-అవగాహనలనూ, వైఖరులనూ, సంబంధాలనూ, లక్ష్యాలనూ – నీ పూర్తి జీవితాన్నీ రూపొందిస్తుంది. దేవుని విషయంలో సరికాని దృక్పథం కలిగి ఉండటం మిమ్మల్ని జీవితకాల పోరాటాలలో చిక్కుకొనేలా చేస్తుంది. అంటే నిజమైన దేవుణ్ణి స్పష్టంగా చూడడం – ఆయనను చూడాలని దేవుడు కోరుకొన్న విధంగా చూడడం – జ్ఞానవంతమైన కార్యం! నీ జీవితం శక్తివంతంగా రూపాంతరం చెందుతుంది!
More
ఈ ప్రణాళికను అందించినందుకు లివింగ్ ఆన్ ది ఎడ్జ్‌కు మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. మరింత సమాచారం కోసం సందర్శించండి: https://livingontheedge.org