నిజమైన దేవుడునమూనా
దేవుడు ప్రేమ స్వరూపి
ప్రతి ఒక్కరూ ప్రేమ కోసం చూస్తున్నారు. నిజమైన ప్రేమ కోసం చూస్తున్నారు, కేవలం తాత్కాలిక భావోద్వేగం కోసం కాదు. దాని కోసం మనం ఆతురత పడుతున్నాము. మనం ధృవీకరించబడటానికీ, శ్రద్ధ వహించబడడానికీ, క్షమించబడడానికీ, మద్దతు పొందడానికీ, అభినందించబడడానికీ నిర్మించబడ్డాము. ఎందుకు? ఎందుకంటే మనం దేవుని చేత సృష్టించబడ్డాము, దేవుడు ప్రేమ స్వరూపి (1 యోహాను 4:8, 16).
దేవుని ప్రేమ చాలా అపారమయినది, విశ్వాసులు “దేవుని సంపూర్ణతయందు పూర్ణులగునట్లుగా, ప్రేమయందు వేరు పారి స్థిరపడి, సమస్త పరిశుద్ధులతో కూడ దాని వెడల్పు పొడుగు లోతు ఎత్తు ఎంతో గ్రహించుకొనుటకును, జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలిసికొనుటకును” దైవికమైన శక్తిగలవారు కావలెనని వారి కోసం అపొస్తలుడైన పౌలు శక్తివంతమైన ప్రార్థన చేసాడు. (ఎఫెసీయులు 3:18-19).
ప్రేమ అనేది సార్వత్రిక అవసరం, మరియు దేవుని ప్రేమ విశ్వవ్యాప్త సమాధానం.
· దేవుని ప్రేమ ఈ లోక ప్రేమకు భిన్నమైనది, అది షరతులు లేనిది.
· మనం మంచిగా ఉన్నప్పుడూ, చెడుగా ఉన్నప్పుడూ ఆయన మన పట్ల దయ కలిగి ఉంటాడు.
· మనం మంచితనంతోనూ, జీవంతోనూ పొంగిపొరలేలా ఉండాలని ఆయన కోరుకుంటాడు.
· ఆయన ప్రేమలో మనం సంతృప్తి చెందాలనీ అది అది ఇతరుల జీవితాలలోనికి పొంగిపోరలాలని ఆయన కోరుకుంటున్నాడు.
నిజమైన దేవుణ్ణి తెలుసుకోవడం మీ లక్ష్యంగా చేసుకోండి, తద్వారా అయన ప్రేమ పొంగిపొరలుతుంది. ఆయన ప్రేమను ధ్యానించండి, అది మీ హృదయాన్ని వశం చేసుకోనివ్వండి. ఆయన మిమ్మల్ని చూసే విధంగా మిమ్మల్ని మీరు చూసుకోవడం నేర్చుకోండి, ఆయన ప్రేమలో భద్రంగా ఉండండి.
మీ హృదయం రూపాంతరం చెందడానికి మీరు అనుమతిస్తారా? దేవుని ప్రేమ మీలోనికి స్వేచ్ఛగా ప్రవహించడం మాత్రమే కాక అది మీ ద్వారా లోకాన్ని మారుస్తుంది.
ఈ ప్రణాళిక గురించి
నీవు దేవుణ్ణి ఎలా చూస్తావు? ఆ ప్రశ్నకు సమాధానం నిన్నూ, నీ విశ్వాసాన్నీ, స్వీయ-అవగాహనలనూ, వైఖరులనూ, సంబంధాలనూ, లక్ష్యాలనూ – నీ పూర్తి జీవితాన్నీ రూపొందిస్తుంది. దేవుని విషయంలో సరికాని దృక్పథం కలిగి ఉండటం మిమ్మల్ని జీవితకాల పోరాటాలలో చిక్కుకొనేలా చేస్తుంది. అంటే నిజమైన దేవుణ్ణి స్పష్టంగా చూడడం – ఆయనను చూడాలని దేవుడు కోరుకొన్న విధంగా చూడడం – జ్ఞానవంతమైన కార్యం! నీ జీవితం శక్తివంతంగా రూపాంతరం చెందుతుంది!
More
ఈ ప్రణాళికను అందించినందుకు లివింగ్ ఆన్ ది ఎడ్జ్‌కు మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. మరింత సమాచారం కోసం సందర్శించండి: https://livingontheedge.org