ఆఖరి పాఠములు: పవిత్ర వారపు పఠన ప్రణాళికనమూనా
పరిచర్య మరియు ప్రేమ
నేను కొంచెం అతి శుభ్రత గలిగిన వ్యక్తిని నాకు ఐదేండ్ల వయస్సు గల ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారు, అందులో చిన్నది నేను ఉండలానుకున్న విధంగా ఉండకుండా గందరగోళం చేసేస్తుంది. ఆ అల్లరిని నేను అస్సలు భరించలేను మరియు ఎన్నో రోజులు అది నన్ను పిచ్చిదానినై పోయేంతలా చేసింది. ఒకానొక దినమున "ఈ గజిబిజిని ఓర్చుకొని క్షమించు. నా పిల్లలు జ్ఞాపకాలను చేసుకుంటున్నారు" అని తెలియజేసే కార్డు కూడా కొన్నాను. దానిని ఇంట్లో వ్రేలాడదీసి రోజుకు 100 సార్లు దానినే దాటుకుంటూ వెళ్ళేదాన్ని, అలా వెళ్తుండగా ఎక్కడ పడితే అక్కడ విడిచిన బట్టలు, ఆటవస్తువుల కుప్ప, మురికి పాత్రలు, కొన్ని రోజుల క్రితం ఉదికిన టవల్స్ సర్దకుండా బయట పడేసి ఉండటం లాంటివి చూసినప్పుడు నాకు నేను మనసులో "అవి జ్ఞాపకాలుగా మలచుకో బెక్కి జ్ఞాపకాలుగా మలచుకో" అని మనసులో చెప్పుకుంటూ ఉండేదాన్ని.
వాటన్నిటిని సర్దుబాటు చేసే క్రమంలో, అసలు ప్రేమించుటనే మర్చిపోయేంతగా నేను గురి కొల్పోయేదాన్ని.
ఈనాటి ధ్యానము యేసు తాను ఎవరితోనైతే తన ప్రాముఖ్యమైన దినములు గడిపి తనవారిగా పరిగణించబడి మరియు తాను ప్రేమించిన వారి దగ్గరకు మనలను తీసుకువెళ్ళును.
యోహాను 13:1-17 చదవండి మరియు తన శిష్యుల పట్ల యేసు యొక్క వైఖరిని గమనించండి.
మానవుల విమోచనా కర్త మరియు దేవుని కుమారుడైన, యేసు తన్ను తాను తగ్గించుకొని, దుమ్ము కొట్టుకుపోయిన ఆ పన్నెండుగురి పాదములను కడిగెను. ఆయన అస్సలు ఆ పాదములకున్నమురికిని కాని, లేక దాని వాసనను కాని గమనించి యుంటాడని కూడా నేను అనుకోను. తాను ప్రేమించిన వారితో తనకు ఇవి ఆఖరి గడియలని మరియు తమ మదులలో నిలిచిపోయే విధంగా ఈ పాఠము ఉండాలని ఆయన ఆశించాడు గనుక ఈ సమయములో మాటలతో సరిపెట్టలేదు. కావున తనను తాను బహుగా తగ్గించుకొని వారి యొక్క దుమ్ము ధూళినంతటిని తుడిచి శుభ్రపరచెను.
యోహాను 13:15-17 చదవండి.
నీవు పరిచర్య చేయవలసిన వారెవరు? నీ జతపని వారా లేక తోటి ఉద్యోగులా? నీ బిడ్డలా? నీ రూమ్మేట్స్ లేక నీ స్నేహితులా? నీ భార్యా లేక భర్తా? నీ చుట్టూ ప్రక్క వారా?
వారి పాదములను కడిగెంతలా తెలియపరచే ఒక మార్గమును ఈ వారము నీవు ఎంచుకోనగలవా? లేక నిజముగానే ఎవరి పాదాలనైన కడగాలి అని అనిపిస్తే, అవి ఎవరివి?
ఇప్పుడు యోహాను 13:34-35ను చదవండి.
ఒకరికొకరం పరిచర్య లేక సేవ చేయుట ద్వారానే మనము ఒకరినొకరం ప్రేమించగలము. ఇంకా చెప్పాలంటే, ఈ విధముగానే మనము క్రైస్తవులము అని తెలియబడేదము అని యేసు కూడా చెప్పెను. నీవు క్రైస్తవుడవు లేక క్రైస్తవురాలవని, యేసును వెంబడించే వారివని ఇతరులకు తెలియునా?
ఈనాడు సోషల్ మీడియాలో అనేకులు క్రైస్తవ్యాన్ని చూపించే విధానం నేను చూసినప్పుడు నిజముగా నా గుండె బ్రద్దలైనట్టుగా అనిపిస్తుంది. పరిచర్య మరియు ప్రేమ అనే ధ్యేయమును మనము పూర్తిగా కొల్పోయాము. క్రీస్తు స్వారూప్యతలోనికి రాని వారిని మలచుటలోనే మనం ఎక్కువ చింతిస్తున్నాము. కేవలం, మనము ఇతరులకు సేవ చేయుటకు మరియు వారిని ప్రేమించుటకు మాత్రమే పిలువబడితిమి కాని, వారిని బలవంతపెట్టి మరల్చవలసిన పని మనది కాదు.
ఇతరులను తీర్పు తీర్చక, కేవలం పరిచర్య మరియు ప్రేమల తోటే వారిని మార్చి క్రీస్తును అనుభవించేవారిగా చేయునటువంటి మార్గము ఎలా ఉండును?
లోకమును రక్షించవలసిన పని కాని, లోకమును మార్చుట కాని మన పని కాదు అనే విషయము నీకెట్టి ఉపశమనము నిచ్చెను! మనము కేవలము మనల్ని మనం తగ్గించుకొని ప్రేమతో ఇతరులకు పరిచర్య చేయుటకే పిలువబడితిమి.
ఈ ప్రణాళిక గురించి
ఈ పవిత్ర వారములో మనల్ని మనం నిదానించుకొని ఈ భూమి మీద క్రీస్తు గడిపిన ఆఖరి దినములలో నుండి నేర్చుకుందాం. ఆయన సమయము చేసికొని మనకిచ్చిన పాఠములను లేక వరములను ప్రతి దినము మనము పొండుకుందాం. క్రీస్తునకు అత్యంత ఇష్టమైన దేమిటో -నీవు ఆయన ప్రజలను మరియు ఆయనను వెంబడించుటయే అని మరలా ఒకసారి తాజాగా మీకు గుర్తుచేయమంటారా? ఈ పవిత్ర వారములో ఇంకా ఆయన నీకు ఏమి బోధించనైయున్నారో నీకు తెలుసుకోవాలనుందా?
More