ఆఖరి పాఠములు: పవిత్ర వారపు పఠన ప్రణాళికనమూనా
మరణము
ఈ రోజును గుడ్ ఫ్రైడేగా చెప్పేటప్పుడు నాకెప్పుడు వింతగా అనిపించేది. నా భర్త దీని విషయమై ఎప్పుడు నన్ను ఆటపట్టిస్తూ ఉండేవాడు ఎందుకనగా నేను గుడ్ ఫ్రైడే, బ్లాక్ ఫ్రైడే లలో తికమకపడుతూ అనేక మార్లు గుడ్ ఫ్రైడే ను బ్లాక్ ఫ్రైడే గా (ఎందుకంటే అది విచారముతో కూడినది గనుక); బ్లాక్ ఫ్రైడేను గుడ్ ఫ్రైడేగా పిలిచేదానను (ఎందుకంటే ఆ రోజున వ్యాపారము బాగా జరుగును కాబట్టి).
యేసు యొక్క సిలువ మరణమును తలంచుకునే ఈ రోజున - ఎందుకో అంత మంచిగా అనిపించదు. ఆయన మనకొరకు చేసిన దానినిబట్టి ఈ రోజు మంచిదే అయినప్పటికి, ఆయన యొక్క పునరుత్ధానము లేకుండా కేవలం ఆయన మరణముమొక్కటిలో శక్తి లేదు. కావున నామట్టుకైతే ఈ దినము మంచికి వ్యతిరేకమైన బాధతో కూడిన చీకటి దినముగా అనిపించును.
మరి నీ సంగతేంటి-సిలువను స్మరించుకొనునప్పుడు నీకు ఎటువంటి భావము కలుగును?
ఈనాటి ధ్యానము కొంచెం ఎక్కువగానే ఉండును. ఈ కథ అంతా నీకు తెలుసును అనే భావనతో దేనిని విడిచి పెట్టవద్దు లేక దేనిని తక్కువగా చూడవద్దు. ఒక క్రొత్త విధానములో క్రీస్తు యొక్క మరణమును నీకు తెలియజేయుమని, నీ సహాయకుడైన, పరిశుద్ధాత్మను అడుగుము.
యోహాను 19 1-30 చదవండి
నాకు నేనుగా దీనిని చదువుకున్నప్పుడు - పిలాతు యేసును పట్టుకొని ఆయనను కొరడాలతో కొట్టించుట, ముండ్లతో కిరీటము నల్లి ఆయన తలమీద పెట్టుట, ఊదారంగు వస్త్రము ఆయనకు తొడిగించి అపహాస్యము చేయుట, సైనికులు ఆయనను అరచేతులతో కొట్టుట, ఆయనను సిగ్గుపరిచే విధంగా ప్రజలందరికి ప్రదర్శించుట, సిలువవేయుడి సిలువవేయుడి అని వేసిన కేకలు ఆయన వినుట, ఆయనయందు పిలాతునకు ఏ దోషమును కనబడకపోవుట, యేసు పిలాతుతో మాట్లాడుటకు తిరస్కరించుట, దేవుని నుండే పిలాతునకు ఇయ్యబడియున్నదని యేసు తెలుపుట, రాళ్లు పరచిన స్థలమందు న్యాయపీఠముమీద కూర్చుండుట, ఆయనను సంహరించుము, సిలువవేయుము అని మరిఎక్కువగా వారు కేకలువేయుట, సిలువవేయబడుటకై ఆయనను వారికి అప్పగించుట, ఆయన తన సిలువను తానే మోసికొనుట, సిలువ వేయబడుట, యోహానుకు తన తల్లిని అప్పగించుట, దప్పిగొనుట, చిరకను పుచ్చుకొనుట, సమాప్తమైనదని చెప్పుట, మరణించుట: యేసు సహించిన విషయములలో ఈ కొన్నింటిని నేను గమనించాను.
క్రీస్తు యొక్క సిలువ మరణమును గూర్చి అనేకమార్లు నాకేమి పట్టనట్లు వ్యవహరించేదానిని. ఎక్కడ చూసినా సిలువలే. వాటిని మన మెడలకు ధరించుకుంటాము మరియు గోడల పైన తగిలిస్తాము. ఒకవేళ మనము చర్చి వాతావరణములోనే పెరిగియున్నట్లయితే పదే పదే ఈ సంఘటనను గూర్చి వినేయుంటాము. ఇక మన సంస్కృతి చాలా దృశ్యమానంగా గ్రాఫిక్‌గా ఉన్న మీడియాతో మునిగిపోయిందని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు, మనం కొండల మధ్య మెరుస్తున్న సూర్యాస్తమయ నేపథ్యంలో సిలువను చిత్రీకరించినప్పుడు అది అస్సలేమాత్రము చీకటిగా అనిపించదు.
ఈ రోజున, యేసు సహించిన దానిని మరియు ఆయన సాధించిన దానిని గూర్చి ఒక క్రొత్త దృక్పధము నిమ్మని మన సహాయకుడును అడుగుదాం.
యెషయా 53:4-12 చదవండి.
ఈ ప్రణాళిక గురించి
ఈ పవిత్ర వారములో మనల్ని మనం నిదానించుకొని ఈ భూమి మీద క్రీస్తు గడిపిన ఆఖరి దినములలో నుండి నేర్చుకుందాం. ఆయన సమయము చేసికొని మనకిచ్చిన పాఠములను లేక వరములను ప్రతి దినము మనము పొండుకుందాం. క్రీస్తునకు అత్యంత ఇష్టమైన దేమిటో -నీవు ఆయన ప్రజలను మరియు ఆయనను వెంబడించుటయే అని మరలా ఒకసారి తాజాగా మీకు గుర్తుచేయమంటారా? ఈ పవిత్ర వారములో ఇంకా ఆయన నీకు ఏమి బోధించనైయున్నారో నీకు తెలుసుకోవాలనుందా?
More