ఆఖరి పాఠములు: పవిత్ర వారపు పఠన ప్రణాళికనమూనా

The Final Lessons: A Holy Week Plan

10 యొక్క 5

sahayamu

భూమిపైన తాను జీవించే దినముల లెక్క తెలిసిన వ్యక్తితో మీరెప్పుడైనా ఉన్నారా? ప్రతి గడియ, ప్రతి క్షణము ఎంతో విలువగలది. దేనిని విడిచి పెట్టలేము. ఊరకనే సమయము గడుపుటకు మాటాడే మాటలకు ఇది తరుణం కాదు. ఈ సమయములో చెప్పే ఆఖరి వీడ్కోలు, శుభాకాంక్షలు, ప్రకటనలు మరియు సలహాలు అనేవి అలక్ష్యముగా వచ్చే మాటలు కావు.

తన సమయము వచ్చినదని యేసునకు తెలియును (యోహాను 13:1) మరియు ఆయన తన యొక్క ఆఖరి గడియలను పూర్తిగా వినియోగించు కుంటున్నారు. ఈస్టర్ కు మనము మార్గమధ్యలో ఉన్నాము గనుక, ఆయన పలికే చివరి మాటలను శ్రద్ధగా ఆలకించుదము రండి.

లూకా 14:15-31 చదవండి

ఇది చాలా మంచిది. కాని ఒక్కటే సమస్య: నాకు సహాయము కోరడం ఇష్టంలేదు.

మరి నీ సంగతి ఏమిటి? నీవు సహాయమును కోరుటకు ఇష్టపడతావా? లేక అలా అడగటం నిన్ను కూడా ఇబ్బందిపెడుతుందా?

నీవు నిస్సహాయుడవుగా ఉన్నప్పుడు సహాయమును కోరుటయే నీవు చేయగలిగిన అత్యంత సాహసవంతమైన పని. ఇక నీ అంతట నీవు ఏమి చేయలేవు అనే పరిస్థితికి చేరినప్పుడు, నీవు చేయగలిగిన అత్యంత సాహసవంతమైన పని, పరిశుద్ధాత్ముని నీకు సహాయము చేయమని కోరుటయే.

ఈ శక్తిని మునుపెన్నడూ గ్రహింపలేని విధంగా గత సంవత్సరము నేను అనుభవించాను. నా మూడవ బిడ్డకు తల్లి కాబోతున్నానే సంగతి తెలిసిన మాసములోనే ఒక పరిచర్యను ప్రారంభించుటకు నిర్ణయించుకొని నేను ముందుకు అడుగులు వేసాను. నా అంతట నేను మోయలేని భారము వహించే మార్గములో ఉన్నాను. నా పనులలో నేర్పరి అయిన నేను నిస్సహాయరులినిగా మరియు ఇప్పుడు కేవలం కాలము గడుపుదానిగా మార్చి, దీనురాలిగా చేసాయి. అయినప్పటికి, దేవుని కృప మరియు పరిశుద్ధాత్ముని శక్తి ఈ నా దయనీయమైన అర్పణను తీసికొని దానిని వృద్ధి చేసింది. (దేవునికే సకల మహిమ కలుగును గాక.)

పరిశుద్ధాత్ముడు నీకు సహాయం చేసి ముందుకు నడిపించాడనే అనుభవము గల సమయము నీకేమైనా కలదా?

ఆ సహాయకుని యొక్క సహాయమును నీవు పొందగలవని నీకిప్పుడు ఏమైనా అనిపిస్తుందా?

ఆయనను నీకు సహాయము చేయుమని అడుగు. నీ స్థితిని ఉన్నది ఉన్నట్టుగా ఆయన ఎదుట ఉంచు.

గత ఏడాదిన్నర కాలములో ఈ రెండు విషయములు నాకెంతగానో చేయూతను ఇచ్చాయి. నేను తరుచూ ఈ వచనమును బిగ్గరగా పలుకుతుంటాను:

"అందుకు, 'నా కృప నీకు చాలును. బలహీనతయందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని', ఆయన నాతో చెప్పెను. కాగా క్రీస్తు శక్తి నామీద నిలిచియుండు నిమిత్తమే, విశేషముగా నా బలహీనతలయందే బహు సంతోషముగా అతిశయపడుదును. నేనెప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడను." 2 కొరింథు 12:9-10

రోజు 4రోజు 6

ఈ ప్రణాళిక గురించి

The Final Lessons: A Holy Week Plan

ఈ పవిత్ర వారములో మనల్ని మనం నిదానించుకొని ఈ భూమి మీద క్రీస్తు గడిపిన ఆఖరి దినములలో నుండి నేర్చుకుందాం. ఆయన సమయము చేసికొని మనకిచ్చిన పాఠములను లేక వరములను ప్రతి దినము మనము పొండుకుందాం. క్రీస్తునకు అత్యంత ఇష్టమైన దేమిటో -నీవు ఆయన ప్రజలను మరియు ఆయనను వెంబడించుటయే అని మరలా ఒకసారి తాజాగా మీకు గుర్తుచేయమంటారా? ఈ పవిత్ర వారములో ఇంకా ఆయన నీకు ఏమి బోధించనైయున్నారో నీకు తెలుసుకోవాలనుందా?

More

ఈ ప్రణాళికను అందించినందుకు సేక్రేడ్ హాలిడేస్ తో ఉన్న బేకి కిసర్ కు మా కృజ్ఞతలు. మరింత సమాచారం కొరకు www.sacredholidays.com దర్శించండి