ఆఖరి పాఠములు: పవిత్ర వారపు పఠన ప్రణాళికనమూనా

The Final Lessons: A Holy Week Plan

10 యొక్క 9

పునరుత్ధానము

యేసు కేవలం సిలువపైన మరణమయినందుకే కాక-మృతులలో నుండి ఆయన తిరిగి లేచినందుకు ఈ రోజున మనం వేడుక చేసుకుంటున్నాము! ఏదైతే శిక్షకు మరియు నిశ్శబ్దమునకు (సిలువపైన యేసు యొక్క మరణము) కారణమైనదో అదే మనకు విడుదల మరియు స్వాతంత్రముగా మార్చబడెను ఎందుకనగా మరణము ఆయనను నిలువరించలేక పోయింది.

యోహాను 20:1-29 చదవండి.

ఆయన సజీవుడాయెను. ఇక ఆయన మృతుడు కాడు. ఇది ఎవరికైనా పిచ్చిగా అనిపించవచ్చును? కేవలం ఒక్క దినము ముందే ఆయన మరణమొంది, ప్రేతవస్త్రముల చేత చుట్టబడి సమాధిలో ఉంచబడెను గదా.

ఇక్కడే క్రైస్తవ్యము-మంచి విషయాలను తెలియజేసిన ఒక మంచి బోధకుని నుండి జీవితమును మార్చే విశ్వాసముగా త్రిప్పబడెను. ఒకవేళ, యేసు యొక్క జీవితం ఆయన చేసిన బోధకు, ప్రజలను ప్రేమించుటకు మరియు రోగులను స్వస్థపరచుటకు మాత్రమే పరిమితమైతే, ఆయన కేవలం ఆ విషయాల వరకే గుర్తుండేవాడు. కాని అలా జరగలేదు. ఆయన మృతులలో లేని స్థితిని బట్టి మొత్తం ప్రపంచపు గతులనే మార్చెను. ఆయన ఏవేవి చెప్పెనో మరియు మరియు ప్రవక్తలు ఏమని ఊహించేనో అవన్ని సత్యం! యేసు మృతులలో నుండి లేచుటను బట్టి మనమీదున్న పాపము యొక్క శాపమును నిర్మూలము చేసెను!

ఇది వెర్రితనముగా కనిపిస్తుంది, కదా? మన యొక్క సొంత సామర్థ్యాలలోనే మనం నిలిచియుంటే, బహుశా దీనిని గ్రహించలేమేమో. "మీ విశ్వాసము మనుష్యుల జ్ఞానమును ఆధారము చేసికొనక దేవుని శక్తిని ఆధారము చేసికొనియుండవలెనని",1 కొరింథు 2:5లో పౌలు మనలను ప్రోత్సాహపరచెను.

మానవుని దృక్పధములో, యేసు సిలువపై మరణించుట, మృతులలో నుండి ఆయన లేచుట, మరియు మానవులందరి పాప భారమంతయు తొలగింపబడుట, ఇవన్ని పిచ్చిగానే అనిపించవచ్చును. కాని దేవునికి సాధ్యమే. (నేను ఈ పదములను ఎంతో ఇష్టపడతాను.) మన దేవుడు కేవలం ఒక సిలువపై మరణమొందిన సాధారణ మానవుని వంటి వాడు కాదు, ఆయన యేసు-సంపూర్ణ మానవుడు మరియు దేవుడిగా యున్నాడు. ఒకవేళ ఆయన కేవలం మానవుడే అయినట్లయితే బహుశా ఇదంతా ఒక గొప్ప బోధకుని మరియు బీద, రోగులైన వారి పక్షముగా నుండు వాని మరణముగానే మిగిలిపోయి యుండవచ్చును.

ఆయన సంపూర్ణ మానవుడు,మాత్రమే కాదు కాని; ఆయన సంపూర్ణ దైవము కూడా-దేవుని అద్వితీయ కుమారుడు!

ఈ విషయమే ఈస్టర్ ను ఆచారబద్దమైన దానికంటే విలువైన దానిగా చేయును. యేసు నీ కొరకు మరణించుట మాత్రమే కాదు, ఆయన నీ కొరకు తిరిగి లేచెను కూడా. ఆయన కేవలం మన పాపముల యొక్క భారమును మాత్రమే భరించుటకే ఈ లోకమునకు రాలేదు కాని; మనకు నూతన జీవమును అనుగ్రహించుటకు వచ్చెను!

మనము గనుక ఆయన సిలువ యందును మరియు ఆ ఖాళీ సమాధి యందు విశ్వసించినట్లయితే క్రీస్తు మన కొరకు ఇదే చేసెను: "కాగా ఎవడైనను క్రీస్తునందున్నయెడల వాడు నూతన సృష్టి; పాతవి గతించెను, ఇదిగో కొత్తవాయెను."(2 కొరింథు 5:17)

యేసు నీ కొరకు ఏమి చేసెనో దానిని నీకిష్టమైన విధానములో, వేడుక చేసికొనుటకు ఈ రోజున కొంత సమయమును కేటాయించుము!
రోజు 8రోజు 10

ఈ ప్రణాళిక గురించి

The Final Lessons: A Holy Week Plan

ఈ పవిత్ర వారములో మనల్ని మనం నిదానించుకొని ఈ భూమి మీద క్రీస్తు గడిపిన ఆఖరి దినములలో నుండి నేర్చుకుందాం. ఆయన సమయము చేసికొని మనకిచ్చిన పాఠములను లేక వరములను ప్రతి దినము మనము పొండుకుందాం. క్రీస్తునకు అత్యంత ఇష్టమైన దేమిటో -నీవు ఆయన ప్రజలను మరియు ఆయనను వెంబడించుటయే అని మరలా ఒకసారి తాజాగా మీకు గుర్తుచేయమంటారా? ఈ పవిత్ర వారములో ఇంకా ఆయన నీకు ఏమి బోధించనైయున్నారో నీకు తెలుసుకోవాలనుందా?

More

ఈ ప్రణాళికను అందించినందుకు సేక్రేడ్ హాలిడేస్ తో ఉన్న బేకి కిసర్ కు మా కృజ్ఞతలు. మరింత సమాచారం కొరకు www.sacredholidays.com దర్శించండి