ఆఖరి పాఠములు: పవిత్ర వారపు పఠన ప్రణాళికనమూనా

The Final Lessons: A Holy Week Plan

10 యొక్క 8

నిశ్శబ్దము

ఈరోజున అసలు ఏం జరిగింది అనేది నమోదు చేయబడని ఒక ప్రత్యేకమైన దినముగా ఉండిపోయింది. నిశ్శబ్దము

నీవు ఎప్పుడైనా దేవుని యొక్క నిశ్శబ్దమును గురించి ఆందోళన చెందారా? ఆయన తదుపరి కదలిక ఏమిటో తెలియని స్థితిలో నీవున్నావా?

ఈ విషయములో నీవు ఒంటరివి కావు. దేవుని మార్గములలో జరిగే ఆలస్యములు అనేక మార్లు ఆ క్షణమందు అర్థము కానట్లుగానే ఉండును. యెషయా 55:8-9 దీనిని నిర్ధారణ చేయును,'''నా తలంపులు మీ తలంపులవంటిని కావు మీ త్రోవలు నా త్రోవలవంటిని కావు ఇదే యెహోవా వాక్కు. 'ఆకాశములు భూమికిపైన ఎంత యెత్తుగా ఉన్నవో మీ మార్గములకంటె నా మార్గములు మీ తలంపులకంటె నా తలంపులు అంత యెత్తుగా ఉన్నవి.'''

బైబిల్ నందు వ్రాయబడని విషయములలో వివరములు మరియు ఆ దినముల గురించి నాకెంతో ఆసక్తిని రేపును. అప్పుడు ఆ ప్రజలు ఏం చేసియుండి యుంటారు? ఏమి ఆలోచిస్తూ యుండి యుంటారు?

ఈరోజున అదే స్థితిలో నేను మనల్ని ఉంచాలని ఆశపడుతున్నాను, ఈనాడు మనకందరికి తెలిసిన కీర్తన ఒకటి చదువుకుందాము:

కీర్తనలు 139 చదవండి.

ఇప్పుడు కొద్ది సమయం తీసుకుని దేవునిని మన హృదయాంతరంగములను పరిశోధించుటకు మరియు దానిని ఎరుగుటకు ఆయనను అనుమతిద్దాము.

రోజు 7రోజు 9

ఈ ప్రణాళిక గురించి

The Final Lessons: A Holy Week Plan

ఈ పవిత్ర వారములో మనల్ని మనం నిదానించుకొని ఈ భూమి మీద క్రీస్తు గడిపిన ఆఖరి దినములలో నుండి నేర్చుకుందాం. ఆయన సమయము చేసికొని మనకిచ్చిన పాఠములను లేక వరములను ప్రతి దినము మనము పొండుకుందాం. క్రీస్తునకు అత్యంత ఇష్టమైన దేమిటో -నీవు ఆయన ప్రజలను మరియు ఆయనను వెంబడించుటయే అని మరలా ఒకసారి తాజాగా మీకు గుర్తుచేయమంటారా? ఈ పవిత్ర వారములో ఇంకా ఆయన నీకు ఏమి బోధించనైయున్నారో నీకు తెలుసుకోవాలనుందా?

More

ఈ ప్రణాళికను అందించినందుకు సేక్రేడ్ హాలిడేస్ తో ఉన్న బేకి కిసర్ కు మా కృజ్ఞతలు. మరింత సమాచారం కొరకు www.sacredholidays.com దర్శించండి