ఆఖరి పాఠములు: పవిత్ర వారపు పఠన ప్రణాళికనమూనా
ఆరాధన
పవిత్ర వారమునకు స్వాగతం-ఈ రోజు అది మట్టల ఆదివారముతో ప్రారంభం అవుతుంది మరియు క్రీస్తును వెంబడించుటలో మన రెండవ పాఠమును నేర్చుకుందాం (మొదటిది మన యొక్క ఉత్తమమైన దానిని అర్పణగా అర్పించుట):ఆయనను ఆరాధించుట.
యోహాను 12:12-19 చదవండి.
లాజరునకు యేసు ఏమి చేసెనో చూసి ప్రజలు నివ్వెరపోయారు. తమ సొంత వ్యాధుల స్వస్థల కొరకు వారు ఆయనను గూమి కూడి అడుగకుండా, వారు ఆయనను ఆరాధించుటను బట్టి నాకెంతో ఆశ్చర్యమనిపించింది. ఆయన చేసిన ఆశ్చర్యకార్యమునకు వారు ఆయనను ఆరాధన మాత్రమే చేయగలిగారు.
నీవు గనుక ఆ రోజున ఆ జనములలో ఉన్నట్లయితే, నీ యొక్క ప్రతిస్పందన ఏమై యుండవచ్చును?
అనేకమంది వెనుకకు తిరిగి, తమ ఐ ఫోన్ ను ఎత్తులో ఉంచి యేసు వెళ్తుండగా ఒక చక్కటి సెల్ఫి తీసి, #హోసన్నా అని ట్యాగ్ తో @యేసుక్రీస్తును చూసాను అని పోస్ట్ పెట్టటానికి రెడీగా ఉండేవారేమో అని నేను అనుకుంటాను. తరువాత ఆ యాప్ ను పలుమార్లు రిఫ్రెష్ చేస్తూ ఎన్ని లైక్లు వచ్చాయో చూస్తూ, అసలు యేసే మనము ఆయనను ట్యాగ్ చేసామని లైక్ చేసారేమో అని చూస్తుంటాము.
మన యొక్క సోషల్ మీడియా గందరగోళంలో యేసు యొక్క సామాన్యతను మనం మర్చిపోయాము. జీవితంలోని అధిక భాగం, అవును, యేసుతో మనకు గల సంబంధము కూడా మన చుట్టూనే ఉంటుందని మన ప్రస్తుత సంస్కృతి మనకు బాగా నూరి పోసింది.
సమస్తము యేసును గూర్చేనని, ఈ ప్రజలు తెలుసుకున్నారు.
హోసన్నా అను పదం స్తుతికి ఒక రూపమై యుప్పటికి, రక్షణ, సహాయము ;లేక అపాయము నుండి కాపాడమని - అడుగుట లేక అది ఇక్కడే ఉన్నదని తెలిపేదిగా ఉంది.
గత కాలములో దేవుడు నిన్ను వేటి నుండి కాపాడాడు?
ఈరోజున దేవుడు నిన్ను వేటి నుండి రక్షించాలని ఆశిస్తున్నావు?
ఒక నూతన తరహ హోసన్నా పాడుతూ ఈ రోజును ముగించుకుందాం. నీవు పాడే పదములే నీ ప్రార్థనగా భావించు.హోసన్నా అను పదమును పాడుతుండగా, దేని నుండి దేవుడు నిన్ను రక్షించాలని కోరుకుంటున్నావో దానిని గూర్చి తలంచు. హోసన్నా అని పాడుతుండగా, దేవుడు నిన్ను దేని నుండి కాపాడాడో దానిని జ్ఞాపకం చేసుకుంటూ దీనిని కృతజ్ఞతా ప్రార్థనగా మలచుకో.
అవును ప్రభువా, నా హృదయాన్ని స్వస్థపరిచి దానిని శుద్దీకరించుము. నాకు మరుగైయున్నవాటిని చూచుటకు నా కన్నులు తెరువుము. నీవు నన్ను ప్రేమించినట్లుగా నేనును నిన్ను ఎట్లు ప్రేమించగలనో నాకు చూపించుము. నిన్ను ఏది గాయపరచునో వాటికి నా హృదయాన్ని కూడా గాయపరుచుము. నీ రాజ్యము యొక్క కారణాన్ని బట్టియే నేను జీవించుచున్నది. ఈ లోకము నుండి నిత్యత్వము లోనికి పయనిస్తూఉండగా, హోసన్నా. హోసన్నా.సర్వోన్నత స్థలములలో దేవునికి మహిమ కలుగునుగాక."అని వేడుకుంటున్నాను
వాక్యము
ఈ ప్రణాళిక గురించి
ఈ పవిత్ర వారములో మనల్ని మనం నిదానించుకొని ఈ భూమి మీద క్రీస్తు గడిపిన ఆఖరి దినములలో నుండి నేర్చుకుందాం. ఆయన సమయము చేసికొని మనకిచ్చిన పాఠములను లేక వరములను ప్రతి దినము మనము పొండుకుందాం. క్రీస్తునకు అత్యంత ఇష్టమైన దేమిటో -నీవు ఆయన ప్రజలను మరియు ఆయనను వెంబడించుటయే అని మరలా ఒకసారి తాజాగా మీకు గుర్తుచేయమంటారా? ఈ పవిత్ర వారములో ఇంకా ఆయన నీకు ఏమి బోధించనైయున్నారో నీకు తెలుసుకోవాలనుందా?
More